IND vs PAK: హై ఓల్టేజీ పోరుకు రంగం సిద్ధం.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే? పూర్తి వివరాలు మీకోసం..
2022 ఆసియా కప్‌లో గ్రూప్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత సూపర్ ఫోర్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. కానీ, ఇప్పుడు ఫార్మాట్ మారడంతో ఈ వన్డే ఫార్మాట్ లో ఎవరు ఎవరిని ఓడిస్తారనే క్యూరియాసిటీ పెరిగింది. ఆసియా కప్‌ను ఏడుసార్లు గెలుచుకున్న టీమిండియా ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. మరోవైపు ఈ టోర్నీలో పాకిస్థాన్ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. మరి ఈ ఆసియా కప్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Asia Cup 2023 IND vs PAK Live Streaming: శనివారం మధ్యాహ్నం ఆసియా కప్ వేదికపై ఇద్దరు చిరవకాల ప్రత్యర్థులు తలపడనున్నారు. శనివారం జరగనున్న భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మెగా మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. 2022 ఆసియా కప్‌లో గ్రూప్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత సూపర్ ఫోర్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది.
శనివారం మధ్యాహ్నం ఆసియా కప్ (Asia Cup 2023) వేదికపై ఇద్దరు చిరకాల ప్రత్యర్థులు తలపడనున్నారు. శనివారం జరగనున్న భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మెగా మ్యాచ్ కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. 2022 ఆసియా కప్‌లో గ్రూప్ దశలో ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత సూపర్ ఫోర్‌లో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. కానీ, ఇప్పుడు ఫార్మాట్ మారడంతో ఈ వన్డే ఫార్మాట్ లో ఎవరు ఎవరిని ఓడిస్తారనే క్యూరియాసిటీ పెరిగింది. ఆసియా కప్‌ను ఏడుసార్లు గెలుచుకున్న టీమిండియా ఈ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. మరోవైపు ఈ టోర్నీలో పాకిస్థాన్ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. మరి ఈ ఆసియా కప్‌లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ఆసియా కప్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఘర్షణను పరిశీలిస్తే.. ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు 17 సార్లు తలపడ్డాయి. భారత్ 9 సార్లు గెలుపొందగా, పాకిస్థాన్ 6 సార్లు గెలిచింది. 1 మ్యాచ్ ఫలితం తేలలేదు.
మ్యాచ్‌కి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడుచూద్దాం..
ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు?
నేబు శనివారం (సెప్టెంబర్ 2) భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ మ్యాచ్ జరగనుంది.
భారత్ వర్సెస్ పాకిస్థాన్ ఆసియా కప్ మ్యాచ్ ఎక్కడ ఉంది?
శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్థాన్ ఆసియా కప్ మ్యాచ్ జరగనుంది.
ఆసియా కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌కు అరగంట ముందు టాస్ వేయనున్నారు.
ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి?
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ (స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ హెచ్‌డి)లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీలో చూడవచ్చు. అంతేకాకుండా, దీనిని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో మొబైల్‌లో కూడా చూడవచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..