AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: సిరాజ్‌ సూపర్‌ స్పెల్‌కు లంక కకావికలం.. ఆసియా కప్‌ ఫైనల్‌లో టీమిండియా టార్గెట్‌ ఎంతంటే?

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ను ఏడోసారి గెల్చుకునేందుకు టీమిండియా మరో అడుగుదూరంలో నిలిచింది. ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత బౌలర్లు విజృంభించారు. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన లంకేయులను కేవలం 50 పరుగులకే ఆలౌట్‌ చేశారు. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్ 21 పరుగులిచ్చి 6 వికెట్ల పడగొట్టగా, హార్దిక్‌ పాండ్యా 3 వికెట్లతో చెలరేగాడు

IND vs SL: సిరాజ్‌ సూపర్‌ స్పెల్‌కు లంక కకావికలం.. ఆసియా కప్‌ ఫైనల్‌లో టీమిండియా టార్గెట్‌ ఎంతంటే?
Mohammed Siraj
Basha Shek
|

Updated on: Sep 17, 2023 | 5:52 PM

Share

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌నుఎనిమిదోసారి గెల్చుకునేందుకు టీమిండియా మరో అడుగుదూరంలో నిలిచింది. ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతున్న ఆసియా కప్‌ ఫైనల్‌లో భారత బౌలర్లు విజృంభించారు. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన లంకేయులను కేవలం 50 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఆ జట్టు కేవలం 15.2 ఓవర్లు మాత్రమే ఆడడం గమనార్హం. హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్ 21 పరుగులిచ్చి 6 వికెట్ల పడగొట్టగా, హార్దిక్‌ పాండ్యా 3 వికెట్లతో చెలరేగాడు. జస్‌ప్రీత్ బుమ్రా ఒక వికెట్‌ తీశాడు. టీమిండియా బౌలర్ల దాటికి కుశాల్‌ మెండిస్‌ (17), దుషన్‌ హేమంత (13) మినహా మరెవరూ రెండంకెల స్కోరుకు చేరుకోలేకపోయారు. భారత బౌలర్ల విధ్వంసంతో శ్రీలంక జట్టులో సగం మంది ఖాతా కూడా తెరవలేకపోయారు. ఓపెనర్లు నిస్సాంక (2), కుశాల్‌ ఫెరీరా (0), మెండిస్‌ (17) సమర విక్రమ (0), చరిత అసలంక (0), ధనంజయ డిసిల్వా (4), దసన్‌ శనక (0), వెలెగెదెర (8), మధుషన్‌ (1), పతిరణ (0) ఇలా ఒకరు కూడా క్రీజులో నిలవలేకపోయారు. కాగా శ్రీలంక ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు ఫాస్ట్ బౌలర్లే పడగొట్టడం విశేషం.

ఇవి కూడా చదవండి

బుమ్రా శుభారంభం.. సిరాజ్ విధ్వంసం..

కొలంబోలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్‌ని ఎంచుకుంది. అయితే అదెంత తప్పో మొదటి ఓవర్‌లోనే తెలుసొచ్చింది. మొదటి ఓవర్‌లోనే బుమ్రా, కుశాల్ పెరీరా వికెట్‌ను తీసి భారత్‌ కు శుభారంభం ఇచ్చాడు.ఆ తర్వాత బౌలింగ్‌కు వచ్చిన సిరాజ్ ఒక చిన్నపాటి విధ్వంసమే సృష్టించాడు. తొలి ఓవర్‌లో మెయిడిన్‌ వేసిన సిరాజ్‌ తన రెండో ఓవర్‌లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. శ్రీలంక ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ తొలి బంతికే పాతుమ్ నిస్సాంకను అవుట్ చేశాడు సిరాజ్. మూడో బంతికి సమవిక్రమను ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. నాలుగో బంతికి అసలంక అవుట్ కాగా, చివరి బంతికి ధనంజయ్ వికెట్ తీశాడు. తర్వాతి ఓవర్లో శ్రీలంక కెప్టెన్ షనక వికెట్ పడగొట్టి సిరాజ్ వన్డే క్రికెట్‌లో తొలిసారి ఐదు వికెట్లు తీశాడు. దీంతో భారత్ తరఫున కనీసం 16 బంతుల్లో ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు. సిరాజ్ వెంటనే ఆరో వికెట్ పడగొట్టాడు అతనితో పాటు హార్దిక్ పాండ్యా కూడా మూడు వికెట్లు పడగొట్టి శ్రీలంకను కేవలం యాభై పరుగులకే పరిమితం చేశారు.

టీమిండియాపై అత్యల్ప స్కోరు నమోదు చేసిన లంకేయులు..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గోవా వెళ్లేవారికి రిలీఫ్.. తగ్గనున్న ప్రయాణం
గోవా వెళ్లేవారికి రిలీఫ్.. తగ్గనున్న ప్రయాణం
మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను..
మృతుడి వేలిముద్రతో ఫోన్ అన్‌లాక్.. ఓఆర్‌ఆర్ ప్రమాద బాధితులను..
స్టార్ల వైఫల్యంపై ముంబై కోచ్ జయవర్ధనే షాకింగ్ కామెంట్స్
స్టార్ల వైఫల్యంపై ముంబై కోచ్ జయవర్ధనే షాకింగ్ కామెంట్స్
ఇన్వర్టర్ Vs కన్వర్టిబుల్.. ఈ రెండిటిల్లో ఏది మంచిది..?
ఇన్వర్టర్ Vs కన్వర్టిబుల్.. ఈ రెండిటిల్లో ఏది మంచిది..?
పట్టపగలు తుపాకులతో గోల్డ్‌ షాప్‌లోకి చొరబడిన దొంగలు.. తర్వాత సీన్
పట్టపగలు తుపాకులతో గోల్డ్‌ షాప్‌లోకి చొరబడిన దొంగలు.. తర్వాత సీన్
ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం..
ఇంటి డోర్‌ దగ్గర ఈ ఒక్కటి పెడితే ఆ చిక్కులన్నీ మాయం..
మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
మెచ్యూర్ కానీ అమ్మాయిలే టార్గెట్.. OTTలో రియల్ క్రైమ్ స్టోరీ
కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇవి ఇవ్వండి..
కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఇవి ఇవ్వండి..
కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే..
కేవలం వాటర్ తాగితే సరిపోదూ.. కిడ్నీలోని రాళ్లు పోవాలంటే..
సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు చూస్తే గర్వంగా ఉంది..
సెట్‏లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు చూస్తే గర్వంగా ఉంది..