Asia Cup 2022: టీమిండియాకు బిగ్ షాక్.. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ ఔట్.. జట్టులోకి ఎవరు రానున్నారంటే?
Ravindra Jadeja: ఆసియాకప్ హాట్ ఫేవరెట్‌గా భావిస్తోన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. మోకాలి గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
Ravindra Jadeja: ఆసియాకప్ హాట్ ఫేవరెట్‌గా భావిస్తోన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. మోకాలి గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం జడేజా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. జడ్డూ స్థానంలో అక్షర్ పటేల్‌ను ఎంపిక చేసినట్లు బోర్డు తెలిపింది. ఆసియాకప్ టోర్నీలో భాగంగా పాక్, హాంకాంగ్‌లపై టీమిండియా ఘన విజయం సాధించడంలో జడేజా కీలక పాత్ర పోషించాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతను గాయపడడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పకోవచ్చు. దీనికి తోడు త్వరలోనే జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో జడ్డూ ఆడతాడా? లేదా? అనుమానాలు తలెత్తుతున్నాయి.
కాగా కొద్ది రోజులుగా అటు బ్యాట్‌తోనూ, బంతితోనూ మెరుస్తున్నాడు రవీంద్ర జడేజా. ఆసియాకప్‌లోనూ తన జోరు చూపిస్తున్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు బౌలింగ్‌లో 2 ఓవర్లు వేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక హాంకాంగ్‌పై 4 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. టీమిండియా సూపర్-4కు చేరుకున్న తరుణంలో జడ్డూ దూరమవ్వడం టీమిండియాకు కోలుకోలేని దెబ్బే అని భావించవచ్చు.
NEWS – Axar Patel replaces injured Ravindra Jadeja in Asia Cup squad.
More details here – https://t.co/NvcBjeXOv4 #AsiaCup2022
— BCCI (@BCCI) September 2, 2022
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..