
Jack Hobbs: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ జూన్ 16న (శుక్రవారం) ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2021-22లో జరిగిన చివరి యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 4-0తో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈసారి ఆతిథ్య ఇంగ్లండ్ మునుపటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంది. యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టుకు పాట్ కమిన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ఇంగ్లిష్ జట్టు బాధ్యత బెన్ స్టోక్స్ భుజాలపై ఉంది.
అయితే, 140 ఏళ్ల యాషెస్ సిరీస్ చరిత్రలో డాన్ బ్రాడ్‌మన్ అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా మారాడు. బ్రాడ్‌మాన్ 37 మ్యాచ్‌లలో 89.78 సగటుతో 19 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలతో సహా 5028 పరుగులు చేశాడు. యాషెస్‌లో బ్రాడ్‌మన్ తర్వాత ఎక్కువగా అలరించిన బ్యాట్స్‌మెన్ ఇంగ్లండ్‌కు చెందిన జాక్ హాబ్స్. జాక్ హాబ్స్ మొత్తం 41 మ్యాచ్‌లు ఆడి 12 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలతో సహా 3636 పరుగులు సాధించాడు. యాషెస్ సిరస్‌లో అత్యధిక శతకాలు, రన్స్ చేసిన లిస్టులో 2వ స్థానంలో ఉన్నాడు.
జాక్ హాబ్స్ అంతర్జాతీయ క్రికెట్ కంటే దేశీయ క్రికెట్‌లో మెరుపులు మెరిపించాడు. రైట్ హ్యాండ్ ఓపెనర్ జాక్ హాబ్స్ 834 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 50.70 సగటుతో 61760 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని బ్యాట్ నుంచి 199 సెంచరీలు, 273 అర్ధ సెంచరీలు వచ్చాయి. హాబ్స్ అత్యధిక ఫస్ట్ క్లాస్ స్కోరు 316 నాటౌట్‌గా నిలిచింది. క్రికెట్ చరిత్రలో హాబ్స్ కంటే ఎక్కువ పరుగులు, సెంచరీలు, హాఫ్ సెంచరీలు చేసిన మరో బ్యాట్స్‌మెన్ ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. హాబ్స్ 1905 సంవత్సరంలో తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌ను షురూ చేశాడు. 29 సంవత్సరాల తర్వాత 1934లో ముగింపు పలికాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చే సమయానికి అతని వయసు 52 ఏళ్లు కావడం విశేషం.
1 జనవరి 1908న టెస్టు అరంగేట్రం చేసిన జాక్ హాబ్స్, ఇంగ్లాండ్ తరపున 61 టెస్టు మ్యాచ్‌లలో 56.94 సగటుతో 5410 పరుగులు చేశాడు. 15 సెంచరీలు, 28 అర్ధ సెంచరీలు బాదేశాడు. జాక్ అత్యధిక స్కోరు 211 పరుగులు. హాబ్స్ తన పేరిటే మరో రికార్డును కలిగి ఉన్నాడు. 46 ఏళ్ల 82 రోజుల ఏజ్‌లో కంగారులపై ఈ శతకాన్ని సాధించి, హిస్టరీలో తన పేరును లిఖించుకున్నాడు.
భారత ఆటగాళ్ల గురించి మాట్లాడితే, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన వారిలో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు. సునీల్ గవాస్కర్ 348 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 51.46 సగటుతో 81 సెంచరీలు, 105 అర్ధ సెంచరీలతో సహా 25834 పరుగులు చేశాడు. అదే సమయంలో క్రికెట్ దేవుడు సచిన్ 310 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 57.84 సగటుతో 25396 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 81 సెంచరీలు, 116 హాఫ్ సెంచరీలు సచిన్ పేరిట నమోదయ్యాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..