AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : సిక్స్ కొట్టినా అవుట్ ఇచ్చిన అంపైట్.. బ్యాట్ మెన్ చేసిన తప్పిదం జట్టు కొంప ముంచింది

క్రికెట్‌లో చివరి ఓవర్లో డ్రామా మామూలే. కానీ, బంతిని బౌండరీ అవతలికి సిక్సర్‌గా పంపి, టీమ్ విజయంపై ఆశలు రేపుతున్న సమయంలో అంపైర్ వేలు పైకి లేపితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి నమ్మశక్యం కాని సంఘటన బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 సిరీస్ మొదటి మ్యాచ్‌లో జరిగింది.

Video : సిక్స్ కొట్టినా అవుట్ ఇచ్చిన అంపైట్.. బ్యాట్ మెన్ చేసిన తప్పిదం జట్టు కొంప ముంచింది
Bangladesh Vs West Indies
Rakesh
|

Updated on: Oct 28, 2025 | 6:13 AM

Share

Video : క్రికెట్‌లో చివరి ఓవర్లో డ్రామా మామూలే. కానీ, బంతిని బౌండరీ అవతలికి సిక్సర్‌గా పంపి, టీమ్ విజయంపై ఆశలు రేపుతున్న సమయంలో అంపైర్ వేలు పైకి లేపితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి నమ్మశక్యం కాని సంఘటన బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య జరిగిన టీ20 సిరీస్ మొదటి మ్యాచ్‌లో జరిగింది. చివరి మూడు బంతుల్లో బంగ్లాదేశ్‌కు వరుసగా మూడు సిక్సర్లు కొట్టాల్సిన పరిస్థితి. ఆ సమయంలో క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ సిక్సర్ కొట్టినా, అతని చిన్న తప్పిదం కారణంగా అంపైర్ ఔటిచ్చాడు. దీనితో బంగ్లాదేశ్ విజయం అంచుల దాకా వచ్చి బోల్తా పడింది.

బంగ్లాదేశ్‌లోని చట్టోగ్రామ్‌లో సోమవారం అక్టోబర్ 27న రెండు జట్ల మధ్య టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి 165 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ జట్టు ఆరంభం నుంచే వికెట్లు కోల్పోతూ వచ్చింది, 18వ ఓవర్‌లో దాని 9వ వికెట్ కూడా పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్ చివరి జోడీగా క్రీజులో ఉన్నారు. ఇద్దరూ 19వ ఓవర్‌లో జట్టు స్కోరును 146 పరుగులకు చేర్చారు.

ఇప్పుడు చివరి ఓవర్‌లో 20 పరుగులు అవసరం 1 వికెట్ మాత్రమే మిగిలి ఉంది. రొమారియో షెపర్డ్ వేసిన మొదటి 3 బంతుల్లో ఒక వైడ్ తో సహా బంగ్లాదేశ్‌కు 3 పరుగులు వచ్చాయి. దీంతో చివరి 3 బంతుల్లో 17 పరుగులు కావాలి, అది వరుసగా 3 సిక్సర్లతో మాత్రమే సాధ్యమయ్యేది. స్ట్రైక్‌లో తస్కిన్ ఉన్నాడు. అతను 7 బంతుల్లో 10 పరుగులు చేసి ఉన్నాడు. షెపర్డ్ నాలుగో బంతి వేయగానే, తస్కిన్ బ్యాక్‌ఫుట్‌లోకి వెళ్లి బంతిని గాల్లోకి కొట్టాడు. బంతి డీప్ మిడ్‌వికెట్ బౌండరీ అవతల పడింది.

అయితే బంగ్లాదేశ్ జట్టు, అభిమానులు సంబరాలు చేసుకునేలోపే, ఆ 6 పరుగులు స్కోరులో చేరకముందే, అంపైర్ తస్కిన్‌ను ఔట్‌గా ప్రకటించాడు. ఇది ఎందుకు జరిగింది అంటే, సిక్స్ కొట్టడానికి తస్కిన్ బ్యాక్‌ఫుట్‌లోకి అంత వెనక్కి వెళ్ళిపోయాడు, అతని కాలు స్టంప్‌లకు తగిలి బెయిల్స్ (Bails) కింద పడిపోయాయి. అంటే, తస్కిన్ హిట్‌వికెట్ ద్వారా ఔట్ అయ్యాడు. ఈ విధంగా బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ అక్కడితో ముగిసింది.

మ్యాచ్ గురించి చెప్పాలంటే, వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసి, కెప్టెన్ షే హోప్ అద్భుతమైన ఇన్నింగ్స్ సహాయంతో 3 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. హోప్ చివరి ఓవర్‌లో వరుసగా 3 సిక్సర్లు కొట్టి జట్టును ఈ స్కోరుకు చేర్చాడు. అతను 28 బంతుల్లో 46 పరుగులు చేసి, రోవ్‌మన్ పావెల్ తో కలిసి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పావెల్ 28 బంతుల్లో 44 పరుగులు చేశాడు. దీనికి సమాధానంగా బంగ్లాదేశ్ జట్టు కేవలం 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. వెస్టిండీస్ తరపున జేసన్ హోల్డర్, జెడెన్ సీల్స్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నాటు కోడి Vs ఫారం కోడి.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
నవ్వితే పోయేదేం లేదు.. అనారోగ్యం తప్ప..! అందుకే హాయిగా నవ్వుకోండి
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు.. కేంద్రం షాకింగ్ డెసిషన్!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
బాలీవుడ్‌ ఎంట్రీపై ఎగ్జైటింగ్‌గా యంగ్ బ్యూటీ!
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
దేశంలోనే అద్భుతం.. ఈ గ్రామంలో ఒక్క ఇంట్లో కూడా వంట చెయ్యరు..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
భర్త కాదు.. కాలయముడు.. భార్యను చంపి మృతదేహాంతో..
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
క్రిప్టో ఇన్వెస్టర్లకు అలర్ట్.. 2026లో ఈ 5 తప్పులు చేస్తే భారీ న
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
హోటల్ స్టైల్ గ్రీన్ చికెన్ కర్రీ.. టేస్టీగా మీ ఓన్ కిచెన్‎లోనే..
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి
చలి పెడుతుందని రూమ్ హీటర్ వాడుతున్నారా ? ఈ విషయాలు తెలుసుకోండి