Kohli-Anushka: కోహ్లీ కోసం ఇండియాకొస్తున్న అనుష్క.. కొడుకుతో కలిసి ఐపీఎల్ మ్యాచ్‌లకు..!
ఐపీఎల్ 2024 మ్యాచులు క్రికెట్ అభిమానుల్లో ఎక్కడాలేని జోష్ నింపుతోంది. మొదటి మ్యాచ్ లో బెంగళూరు, చెన్నై తలపడటంతో అభిమానులకు మంచి కిక్ ఇచ్చినట్టయింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒడిపోయినా మ్యాచ్‌ని అభిమానులు ఎంజాయ్ చేశారు. ఇక మొదటి ఐపీఎల్ మ్యాచ్ లోనే కోహ్లీ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.

ఐపీఎల్ 2024 మ్యాచులు క్రికెట్ అభిమానుల్లో ఎక్కడాలేని జోష్ నింపుతోంది. మొదటి మ్యాచ్ లో బెంగళూరు, చెన్నై తలపడటంతో అభిమానులకు మంచి కిక్ ఇచ్చినట్టయింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒడిపోయినా మ్యాచ్‌ని అభిమానులు ఎంజాయ్ చేశారు. ఇక మొదటి ఐపీఎల్ మ్యాచ్ లోనే కోహ్లీ సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. అయితే కోహ్లీని ఉత్సాహపరిచేందుకు అతని భార్య, నటి అనుష్క శర్మ గత కొంతకాలంగా స్టేడియంలో కనిపించలేదు. అయితే అనుష్క, విరాట్‌లకు గత నెలలో మగబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే.
కుమారుడికి అకాయ్ పెట్టి, అందుకు సంబంధించిన వార్తను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అయితే ప్రస్తుతం అకాయ్‌తో కలిసి అనుష్క లండన్‌లో ఉండగా, గత వారం విరాట్ ఐపీఎల్ కోసం భారత్‌కు తిరిగి వచ్చాడు. అయితే ఐపిఎల్ లేదా మరేదైనా మ్యాచ్ కావచ్చు. విరాట్ కోహ్లీకి మద్దతుగా అనుష్క శర్మ తరచుగా స్టేడియంలో కనిపిస్తుంది. వారిద్దరి అందమైన క్షణాలు, వీడియోలు చాలా వైరల్ అవుతూ అభిమానులను ఫిదా చేస్తుంటాయి. అయితే ఈసారి అనుష్క ఇంకా ఐపీఎల్‌కు రాలేదు. పుట్టిన బిడ్డను చూసుకుంటూ లండన్‌లోనే ఉండిపోయింది.
కానీ కొన్ని రిపోర్టుల ప్రకారం.. మరికొద్ది రోజుల్లో అనుష్క ఇండియాకు తిరిగి వస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. త్వరలో ఆమె ఇండియాకు వస్తుందని, RCB మ్యాచ్‌ల్లో విరాట్‌ను ఎంకరేజ్ చేస్తుందని టాక్. కొడుకు నెలన్నర నెలలు నిండిన తర్వాత అనుష్క ప్రయాణం సులువవుతుంది. ప్రస్తుతం అనుష్క తనతో పాటు అకాయ్ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. మరికొద్ది రోజుల్లో ఆమె భారత్‌కు తిరిగి రావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆమెను స్టేడియంలో చూసేందుకు అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు.
ఇక అనుష్క శర్మ చివరిసారిగా 2018 చిత్రం జీరోలో కనిపించింది. షారుఖ్ ఖాన్, కత్రినా కైఫ్‌లతో పాటు, వారిద్దరూ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా తర్వాత అనుష్క బుల్లితెరకు దూరంగా ఉంది. ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులు ఏవీ ఒప్పుకోలేదు. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఆర్ట్ చిత్రంలో అతిధి పాత్రతో ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఆమె తల్లి బాధ్యతను నిర్వర్తిస్తోంది.