టీమిండియా మాజీ క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ అంబటి రాయుడు ఐపీఎల్‌తో పాటు అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్- 2023 ఫైనల్ రాయుడు ఆఖరి మ్యాచ్. చెన్నై విజయంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా ఆరుసార్లు టైటిల్‌ను అందుకున్న ప్లేయర్‌గా రోహిత్ శర్మ సరసన చేరాడీ తెలుగు క్రికెటర్. కాగా అద్భుతమైన ట్యాలెంట్ ఉన్నప్పటికీ రాయుడికి సరైన గౌరవం దక్కలేదనే చెప్పుకోవాలి. ముఖ్యంగా టీమిండియాలో చోటు విషయంపై అంబటికి బీసీసీఐ అన్యాయం చేసిందని చాలామంది చెబుతారు. . 2018-19 మధ్య కాలంలో భారత జట్టులోకి వచ్చిన రాయుడు అద్భుతంఆ రాణించాడు. ముఖ్యంగా నాలుగో స్థానంలో బరిలోకి దిగి జట్టును గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇదే సమయంలో 2019 వన్డే ప్రపంచకప్‌లో రాయుడు ఆడతాడని అందరూ భావించారు. కానీ బీసీసీఐ సెలెక్షన్ కమిటీ పెద్ద షాక్ వచ్చింది. 2019 వన్డే ప్రపంచకప్‌కు రాయుడును కాదని ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ను ఎంపిక చేశారు. దీంతో నిరాశ చెందిన రాయుడు బీసీసీఐపై బహిరంగంగానే విమర్శలు గుప్పించాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు.
అయితే ఆటపై మక్కువతో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నప్పటికీ టీమిండియాలో మళ్లీ చోటు దక్కలేదు. ఇప్పుడు ఇదే విషయంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే స్పందించాడు. ‘రాయుడు 2019 ప్రపంచకప్ ఆడాల్సింది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే రాయుడిని తప్పించి సెలక్షన్ కమిటీతో పాటు జట్టు మెనెజ్‌మెంట్ పెద్ద తప్పు చేసింది. కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి అతడిని నాలుగో స్థానం కోసం ఆరునెలల పాటు సిద్ధం చేశారు. అటువంటిది ఆ తర్వాత జట్టులో స్థానం లేకుండా చేశారు. ఇదిది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది’ అని కుంబ్లే షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం కుంబ్లే వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. 2019 వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి ఉన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..