తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం (నవంబర్ 26) ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది . బ్యాటింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా మొదట 235 పరుగులు చేయగా, ఆ తర్వాత లక్ష్య ఛేదనలో ఆసీస్ 191 పరుగులకే ఆలౌటైంది. 44 పరుగుల తేడాతో విజయం సాధించిన విజయం సాధించిన టీమిండియా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో మరో మ్యాచ్ గెలిస్తే భారత్ సిరీస్ కైవసం చేసుకుంటుంది. తద్వారా ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాజయం నుంచి కాస్తైనా ఊరట దక్కుతుంది. మరి ఇండో-ఆసీస్ 3వ టీ20 ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో తెలుసుకుందాం రండి. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టీ20 మ్యాచ్ మంగళవారం (నవంబర్ 28) జరగనుంది. గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఎప్పటిలాగే మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది.
ఇక శుక్రవారం ( డిసెంబర్ 1) న భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. రాయ్‌పూర్ లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. ఇక ఆదివారం (డిసెంబర్ 3) బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం వేదికగా ఆఖరి టీ మ్యాచ్ జరగనుంది.
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యస్సవి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ , పర్దీష్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
మాథ్యూ వేడ్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ షార్ట్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాన్సన్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.
Another commanding performance by Team India, securing a 2-0 lead in the T20I series against Australia! Kudos to our dynamic openers @ybj_19 and @Ruutu1331 for setting the stage on fire with their explosive fifties. @ishankishan51, holding his ground at number 3, played yet… pic.twitter.com/pqGFUSM9Kj
— Jay Shah (@JayShah) November 26, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..