IPL 2024: ధనాధన్ లీగ్ ప్రారంభ వేడుకలో సందడి చేసే సినీ తారలు వీరే.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?

మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ ఎడిషన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎం చిదంబరం మైదానంలో జరుగుతుండగా,

IPL 2024: ధనాధన్ లీగ్ ప్రారంభ వేడుకలో సందడి చేసే సినీ తారలు వీరే.. ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?
IPL 2024

Updated on: Mar 20, 2024 | 5:58 PM

మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ ఎడిషన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎం చిదంబరం మైదానంలో జరుగుతుండగా, ఈ మ్యాచ్‌కు ముందు ప్రారంభోత్సవ వేడుకను కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతిసారీ మాదిరిగానే ఈసారి కూడా అట్టహాసంగా ప్రారంభోత్సవం నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని సన్నాహాలు చేస్తోంది. ప్రారంభ మ్యాచ్ జరిగే చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు ఐపీఎల్ ప్రారంభోత్సవం ప్రారంభం కానుంది. సుమారు గంట పాటు ఈ వేడుక జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఐపీఎల్ ప్రారంభ వేడుకలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అలాగే ఐపీఎల్ మ్యాచ్‌లు జియో సినిమా యాప్‌లో ఉచితంగా స్ట్రీమింగ్ కానున్నాయి. బాలీవుడ్ ప్రముఖ నటులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్లు ఏఆర్ రెహమాన్, సోనూ నిగమ్ తదితరులు ఈసారి ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొననున్నారని సమాచారం.

చెన్నై, బెంగళూరు మధ్య రాత్రి 8 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఓపెనింగ్ మ్యాచ్ మినహా అన్ని నైట్ మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతాయి. ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తొలి మ్యాచ్ ఆడడం ఇది తొమ్మిదోసారి. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో, CSK గతంలో 2009, 2011, 2012, 2018, 2019, 2022 మరియు 2023 సీజన్లలో ఓపెనింగ్ మ్యాచ్‌ ఆడింది. సార్వత్రిక ఎన్నికల కారణంగా బీసీసీఐ ఈ ఏడాది ఐపీఎల్‌ తొలి దశ షెడ్యూల్‌ను ప్రకటించింది. దీని ప్రకారం, మొదటి దశలో 17 రోజుల్లో 2 డబుల్ హెడర్‌లతో సహా మొత్తం 21 మ్యాచ్‌లు జరుగుతాయి. మిగతా షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.

ఇవి కూడా చదవండి

బాలీవుడ్ తారల సందడి..

రిషబ్ ఈజ్ బ్యాక్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us