AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఎవడ్రా వీడు.. W,W,W,W,W.. హ్యాట్రిక్‌తోపాటు 5 వికెట్లు.. తొలి మ్యాచ్‌లోనే బీభత్సం

Ajnas K Hat Trick With 5 Wicket Haul: కేరళ క్రికెట్ లీగ్ (KCL) 2025లో భాగంగా 11వ మ్యాచ్‌లో, త్రిస్సూర్ టైటాన్స్ కొచ్చి బ్లూ టైగర్స్‌పై 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో, ఒక ఆటగాడు తన అరంగేట్రంతో తన జట్టుకు అతిపెద్ద మ్యాచ్ విజేతగా నిరూపించుకున్నాడు.

Video: ఎవడ్రా వీడు.. W,W,W,W,W.. హ్యాట్రిక్‌తోపాటు 5 వికెట్లు.. తొలి మ్యాచ్‌లోనే బీభత్సం
Kcl 2025 Ajnas K
Venkata Chari
|

Updated on: Aug 27, 2025 | 7:08 AM

Share

Ajnas K Hat Trick With 5 Wicket Haul: కేరళ క్రికెట్ లీగ్ (KCL) 2025లో జరిగిన 11వ మ్యాచ్‌లో త్రిసూర్ టైటాన్స్ వర్సెస్ కొచ్చి బ్లూ టైగర్స్ మధ్య ఉత్కంఠభరితమైన పోరు జరిగింది. చివరి బంతికి త్రిసూర్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో త్రిసూర్ టైటాన్స్ విజయంలో అజినాస్ కె హీరో. ఇది అజినాస్ కె అరంగేట్ర మ్యాచ్. అతను తన తొలి మ్యాచ్‌లోనే జట్టుకు బలమైన విజయాన్ని అందించగలిగాడు. కొచ్చి బ్లూ టైగర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతను సీజన్‌లో తొలి హ్యాట్రిక్ సాధించడమే కాకుండా, 5 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు.

తొలి మ్యాచ్‌లోనే ఆధిపత్యం..

ఈ మ్యాచ్‌లో కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి బలమైన ఆరంభం ఇచ్చింది. ఇందులో సంజు శాంసన్ 89 పరుగుల తుఫాను ఇన్నింగ్స్‌ కూడా ఉంది. అయితే, అజినాస్ తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆటను మలుపు తిప్పాడు. అతను తన స్పెల్‌లో కొచ్చి బ్యాటర్లను నిరంతరం ఇబ్బంది పెట్టాడు. 18వ ఓవర్‌లో హ్యాట్రిక్ పూర్తి చేశాడు. అజినాస్ వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఇందులో సంజు శాంసన్, జెరిన్ పిఎస్, మహ్మద్ ఆషిక్ వంటి బ్యాటర్స్ ఉన్నారు. ఈ హ్యాట్రిక్‌కు ముందు, అతను మరో రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతని ఖాతాలో 5 వికెట్లు చేరాయి. అతని డేంజరస్ బౌలింగ్ కొచ్చిని 188 పరుగుల వద్ద ఆపేసింది.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో త్రిస్సూర్ టైటాన్స్ చివరి బంతిని అజినాస్‌కు ఇచ్చింది. అజినాస్ తన 4 ఓవర్ల స్పెల్‌లో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అతను 7.50 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. ఇది ఈ బలమైన బ్యాటింగ్ ముందు చాలా తక్కువగా అనిపించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేసిన వారిలో అతను అత్యంత ఎకానమీ బౌలర్.

చివరి బంతి వరకు మ్యాచ్..

అజిన్హాస్ చేసిన ఈ అద్భుతమైన బౌలింగ్ త్రిస్సూర్ టైటాన్స్‌ను బలమైన స్థితిలో నిలిపింది. ఆ తర్వాత, కొచ్చి ఇచ్చిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన త్రిస్సూర్ జట్టు ఈ సవాలును స్వీకరించి అద్భుతమైన విజయాన్ని సాధించింది. త్రిస్సూర్ టైటాన్స్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ లక్ష్యాన్ని చేరుకుంది. చివరి ఓవర్లలో సిజోమోన్ జోసెఫ్, అర్జున్ ఎ.కె. విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. దీని కారణంగా త్రిస్సూర్ టైటాన్స్ జట్టు మ్యాచ్ చివరి బంతికి విజయం సాధించగలిగింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..