BCCI: చీఫ్‌ సెలెక్టర్‌గా ఆ మాజీ ఆల్‌రౌండర్‌! త్వరలోనే పేరు ఖరారు చేయనున్న బీసీసీఐ

|

Nov 20, 2022 | 7:07 AM

శుక్రవారం (నవంబర్‌ 19) సోషల్ మీడియా ద్వారా సెలక్షన్ కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. అలాగే కొత్త కమిటీ ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధమవుతోందని తెలుస్తోంది. 

BCCI: చీఫ్‌ సెలెక్టర్‌గా ఆ మాజీ ఆల్‌రౌండర్‌! త్వరలోనే పేరు ఖరారు చేయనున్న బీసీసీఐ
Ajit Agarkar
Follow us on

ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ వైఫల్యంతో టీమిండియాలో ప్రక్షాళనలు మొదలయ్యాయి. జట్టుతో పాటు సెలెక్షన్‌ కమిటీలోనూ కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కాగా శుక్రవారం (నవంబర్‌ 19) సోషల్ మీడియా ద్వారా సెలక్షన్ కమిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది బీసీసీఐ. అలాగే కొత్త కమిటీ ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధమవుతోందని తెలుస్తోంది. కాగా చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీని నిన్న తొలగించిన తర్వాత, సెలక్షన్ కమిటీ చీఫ్ పదవికి అజిత్ అగార్కర్ పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో అజిత్ అగార్కర్ ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సెలక్షన్ కమిటీలో అతనికి చోటు దక్కలేదు. అయితే ఈసారిమాత్రం అజిత్ అగార్కర్‌కు ఏకగా చీఫ్‌ సెలెక్టర్‌గా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అగార్కర్‌తో బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి చర్చ జరపలేదు.

కాగా టీమిండియా తరఫున 26 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అజిత్ అగార్కర్‌ 58 వికెట్లు పడగొట్టాడు. అలాగే 191 వన్డే మ్యాచ్‌ల్లో 288 వికెట్లు తీశాడు. 4 టీ20 మ్యాచుల్లో 3 వికెట్లు తీశాడు. అలాగే ఐపీఎల్‌లో 32 మ్యాచ్‌లు ఆడిన అజిత్ 29 వికెట్లు తీయగలిగాడు. అగార్కర్‌తో పాటు టీమిండియా మాజీ స్పిన్నర్‌ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌, మాజీ ఆల్‌రౌండర్‌ రోజర్‌ బిన్నీ, సలీల్‌ అంకోలాలను సెలెక్షన్ కమిటీ సభ్యులుగా నియమించవచ్చని సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..