County Cricket: మళ్లీ కౌంటీ క్రికెట్ ఆడబోతున్న చెన్నై ప్లేయర్.. వెస్టిండీస్ ‘టెస్ట్’ సిరిస్ ముగిసిన వెంటనే..

|

Jun 19, 2023 | 3:18 PM

Ajinkya Rahane: ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ 2023 ఫైనల్ ద్వారా భారత జట్టులోకి పునరాగమనం చేయడంతో పాటు 135(89, 46) పరుగులతో మెరిసిన రహానే మరోసారి కౌంటీ క్రికెట్ ఆడబోతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే లీసెస్టర్‌షైర్‌..

County Cricket: మళ్లీ కౌంటీ క్రికెట్ ఆడబోతున్న చెన్నై ప్లేయర్.. వెస్టిండీస్ ‘టెస్ట్’ సిరిస్ ముగిసిన వెంటనే..
Ajinkya Rahane
Follow us on

Ajinkya Rahane: ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ 2023 ఫైనల్ ద్వారా భారత జట్టులోకి పునరాగమనం చేయడంతో పాటు 135(89, 46) పరుగులతో మెరిసిన రహానే మరోసారి కౌంటీ క్రికెట్ ఆడబోతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలోనే లీసెస్టర్‌షైర్‌ ఒప్పందం చేసుకున్న అతను జూన్-సెప్టెంబర్ మధ్యలో 8 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లతో పాటు రాయల్ లండన్ కప్ ఆడనున్నాడు. నిజానికి రహానే ఐపీఎల్ 2023 టోర్నీ ముగిసిన వెంటనే లీసెస్టర్‌షైర్‌ జట్టులో చేరవలసి ఉంది, కానీ డబ్య్లూటీసీ ఫైనల్ కారణంగా అలా చేయలేకపోయాడు.

అయితే వెస్టిండీస్ టూర్‌ తర్వాత అతను ఇంగ్లాండ్ చేరుకుని లీసెస్టర్‌షైర్‌ జట్టుతో ఏకమవుతాడు. ఇక వెస్టిండీస్ టూర్‌లో భారత్ రెండు టెస్టులు, మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడనున్న సంగతి తెలిసిందే. 2019 సీజన్‌లో హాంప్‌షైర్ తరపున ఆడిన రహానే మళ్లీ ఇప్పుడు తన రెండో కౌంటీ స్టింట్ ప్రారంభించబోతున్నాడు.

కాగా, ఇటీవల జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ తరఫున రహానే విజయవంతమైన పునరాగమనం చేశాడు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేయడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో హాఫ్ సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా నిలిచాడు. అంతేకాక 5000 పరుగుల మార్క్‌ని అందుకుని భారత్ తరఫున ఆ ఫీచ్ సాధించిన 13వ ఆటగాడిగా అవతరించాడు. ఇంకా ఐపీఎల్ 16వ సీజన్‌లో కూడా అతను చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మెరిసిన సంగతి తెలిసిందే..

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..