IND vs AUS 4th Test: ఇండోర్‌లో ఓటమితో గేమ్ ప్లాన్ ఛేంజ్.. నాలుగో టెస్టులో టీమిండియా స్ట్రాటజీ ఏంటంటే?
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. ఇక్కడ ముందుగా ఫాస్ట్ బౌలర్లకు సహాయపడేందుకు పిచ్ సిద్ధంగా ఉంటుందని భావించారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత, అహ్మదాబాద్ టెస్ట్ కోసం మంచి టెస్ట్ వికెట్‌ను సిద్ధం చేయాలని టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌ను ఆదేశించింది. అయితే, అంతకుముందు మీడియాలో కొన్ని కథనాలు వినిపించాయి. వాటి వెనుక ఉన్న కారణం ఏమిటంటే, టీమ్ ఇండియా లండన్‌లోని ఓవల్‌లో WTC ఫైనల్ ఆడుతుందని, అక్కడ పిచ్‌పై చాలా పచ్చిక ఉందని, ఫాస్ట్ బౌలర్లకు కూడా సహాయం చేస్తుందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అహ్మదాబాద్‌లో అదే వికెట్‌ను సిద్ధం చేసుకుని డబ్ల్యూటీసీ ఫైనల్‌కు సిద్ధమవ్వాలన్నది టీమ్‌ఇండియా ప్రయత్నంగా నిలిచిందంటూ వార్తలు వచ్చాయి. కానీ, తాజాగా టీమ్‌ఇండియా ప్లాన్ మారిపోయిందంట.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023 మూడో మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత, భారత జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పుడు స్పిన్ అనుకూలమైన పిచ్, మ్యాచ్ విన్నింగ్ ఫార్ములాకు తిరిగి రావచ్చని తెలుస్తోంది. గత దశాబ్ద కాలంలో స్వదేశంలో భారత జట్టు టెస్టు రికార్డు మెరుగ్గా ఉంది. భారత్‌లో స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌లు సిద్ధం కావడమే దీనికి ప్రధాన కారణం. భారతదేశం కూడా స్పిన్నర్లతో నిండి ఉంది. భారత బ్యాట్స్‌మెన్ కూడా స్పిన్‌ను బాగా ఆడతారు. అయితే విదేశీ బ్యాట్స్‌మెన్ స్పిన్‌కు వ్యతిరేకంగా అంత బాగా ఆడలేకపోతున్నారు.
ఇండోర్‌లో స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న టీమ్ ఇండియా..
భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌లలో, టీమ్ ఇండియా మేనేజ్‌మెంట్ ఆదేశాల మేరకు స్పిన్-ఫ్రెండ్లీ ట్రాక్‌లు తయారు చేశారు. ఇక్కడ నాగ్‌పూర్, ఢిల్లీలో టీమ్ ఇండియా గెలిచింది. కానీ, ఇండోర్‌లో మాత్రం అదే స్పిన్ వలలో చిక్కుకుంది. ఇండోర్‌లో మొదటి రోజు నుంచి స్పిన్నర్లు సత్తా చాటారు. ఇక్కడ భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మ్యాచ్‌లోకి తిరిగి రావడం అసాధ్యమైంది.
ఇండోర్ టెస్టులో ఓడిపోయిన టీమ్ ఇండియా.. అహ్మదాబాద్ టెస్టులో ఎలాగైనా గెలవాలనుకుంటోంది. టీమ్ ఇండియా ఇప్పుడు అహ్మదాబాద్ టెస్టులో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పిచ్‌ను స్పిన్‌కు అనుకూలంగా మార్చే అవకాశం మళ్లీ పెరిగింది. గతంలో ఇక్కడ జరిగిన మ్యాచ్‌ల్లోనూ స్పిన్ ట్రాక్ కనిపించింది. రెండేళ్ల క్రితం ఇక్కడ జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌పై భారత జట్టు ఘన విజయం సాధించింది. ఒక టెస్టులో భారత స్పిన్నర్లు రెండు రోజుల్లోనే ఇంగ్లండ్‌ను ఓడించగా, రెండో టెస్టులో కూడా మూడు రోజుల పాటు మ్యాచ్ నిలవలేకపోయింది.
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ ఏం చెబుతోందంటే?
పీటీఐతో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. ‘భారత జట్టు మేనేజ్‌మెంట్ నుంచి మాకు ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. మా క్యూరేటర్లు ఇంతకు ముందు చేసిన విధంగానే సాధారణ పిచ్‌ని సిద్ధం చేస్తున్నారు. చివరి రోజుల్లో ఖచ్చితంగా బీసీసీఐ గ్రౌండ్, పిచ్ కమిటీ నుంచి స్థానిక క్యూరేటర్లకు సూచనలు అందుతాయని, కానీ, అప్పటి వరకు మా వైపు నుంచి ఒక మంచి టెస్ట్ వికెట్ సిద్ధం చేయవచ్చు’ అని తెలిపారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..