AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AFG: భారత్‌తో టీ20సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ టీం ఇదే.. కోహ్లీకి బద్ధ శత్రువుకు చోటు..!

Afghanistan vs India: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత జట్టుతో తలపడేందుకు ఆఫ్ఘానిస్తాన్ టీం సిద్ధమైంది. 3 మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్ కోసం ఆఫ్ఘనిస్తాన్ భారత్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు భారత గడ్డపై జరగనుంది. కానీ, ఈ సిరీస్ ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా భారత్‌కు ఆతిథ్యం ఇవ్వనుండడం గమనార్హం.

IND vs AFG: భారత్‌తో టీ20సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ టీం ఇదే.. కోహ్లీకి బద్ధ శత్రువుకు చోటు..!
Ind Vs Afg T20 Series (1)
Venkata Chari
|

Updated on: Aug 24, 2026 | 6:11 PM

Share

IND vs AFG: భారత జట్టు ప్రస్తుతం శ్రీలంక జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఇది ముగిసిన వెంటనే స్వదేశంలో ఆఫ్ఘానిస్తాన్ జట్టుతో పొట్టి ఫార్మాట్‌లో ఢీ కొట్టేందుకు సిద్ధం కానుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు న్యూడిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈమేరకు ఆఫ్ఘానిస్తాన్ జట్టును నేడు ప్రకటించారు. ఈ సిరీస్‌లో ఆఫ్ఘాన్ జట్టుకు ఇబ్రహీం జద్రాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

కెప్టెన్‌గా ఇబ్రహీం జద్రాన్..

భారత జట్టుతో సిరీస్ కోసం ప్రకటించిన ఆఫ్ఘాన్ జట్టుకు 24 ఏళ్ల ఇబ్రహీం జద్రాన్ తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈక్రమంలో ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నసీబ్ ఖాన్ మాట్లాడుతూ.. భారత జట్టుతో సిరీస్ మాకు చాలా కీలకమైనది. కొత్త కెప్టెన్ సారథ్యంలో ఆఫ్గాన్ జట్టు అద్భుతంగా ఆడుతుందని భావిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చాడు.

ఎక్కువమంది చదివినది: Rishabh Pant: జస్ట్ 63.. ధోని రికార్డ్‌‌నే బద్దలు కొట్టిన రిషబ్ పంత్.. అదేంటో తెలుసా..?

మ్యాచ్ షెడ్యూల్..

తొలి టీ20ఐ: ఆదివారం, సెప్టెంబర్ 13, 2026 సాయంత్రం 7:00 గంటలకు (ఢిల్లీ).

2వ టీ20ఐ: మంగళవారం, సెప్టెంబర్ 15, 2026 సాయంత్రం 7:00 గంటలకు (ఢిల్లీ).

3వ టీ20ఐ: గురువారం, సెప్టెంబర్ 17, 2026 సాయంత్రం 7:00 గంటలకు (ఢిల్లీ).

కాగా, ఈ సిరీస్‌ ఇరుజట్లకు ఎంతో కీలకంగా మారింది. ఎందుకంటే, జపాన్‌లో జరిగే 2026 ఆసియా క్రీడల్లో పురుషుల టీ20 క్రికెట్ పోరుకు ముందు ఇరు జట్లకు తమ బలాలు, బలహీనతలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

స్ట్రీమింగ్: భారతదేశంలో ఫ్యాన్‌కోడ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.

ఎక్కువమంది చదివినది: Video: దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?

భారత్‌తో మూడు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ జట్టు:

ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (కీపర్), నూర్ రెహమాన్ (కీపర్), సెదిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాబీ, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యల్ ఖరోటీ, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రహ్మద్, ఫజల్ హక్ ఫరూఖీ, అబ్దుల్లా అహ్మజ్దై, నవీన్-ఉల్-హక్.

ఈ సిరీస్ కోసం ఇజాజ్ అహ్మద్‌జాయ్, షాహిదుల్లా కమల్, ఫరీద్ అహ్మద్ మాలిక్‌లను రిజర్వ్ ప్లేయర్లుగా చేర్చారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us