Video: ‘జుట్టు పట్టుకుని కొడతా రేయ్’.. దిగ్వేష్ రతికి ఇచ్చిపడేసిన కావ్యమారన్ ఖతర్నాక్ ప్లేయర్

Abhishek Sharma Strong Reply to Digvesh Rathi: నోట్‌బుక్ వేడుకకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రతికి రెండుసార్లు జరిమానా విధించింది. అయినప్పటికీ అతను వేడుకలు జరుపుకోవడం కొనసాగిస్తూనే ఉన్నాడు. అభిషేక్‌తో వాదన తర్వాత మరో శిక్ష ముప్పును ఎదుర్కొంటున్నాడు. అయితే, మ్యాచ్ తర్వాత, ఇద్దరూ ఆ సంఘటన గురించి చర్చించుకుని ఒకరితో ఒకరు కరచాలనం చేసుకున్నారు.

Video: జుట్టు పట్టుకుని కొడతా రేయ్.. దిగ్వేష్ రతికి ఇచ్చిపడేసిన కావ్యమారన్ ఖతర్నాక్ ప్లేయర్
Abhishek Sharma Vs Digvesh

Updated on: May 20, 2025 | 10:51 AM

Abhishek Sharma Strong Reply to Digvesh Rathi: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్వేష్ రాఠి ట్రేడ్‌మార్క్ ‘నోట్‌బుక్ వేడుక’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సెలబ్రేషన్స్ విషయంలో దిగ్వేష్, హైదరాబాద్ బ్యాట్స్‌మన్ అభిషేక్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హైదరాబాద్ జట్టుకు అభిషేక్ శర్మ వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు. అతను 20 బంతుల్లో 59 పరుగులు చేశాడు. లక్నో నుంచి మ్యాచ్‌ను దూరంగా తీసుకెళ్తున్నప్పుడు, రతి తన వికెట్ తీయడం ద్వారా లక్నోకు కొత్త ఆశను అందించాడు.

దిగ్వేష్ రతి తన పాత శైలిలో సెలబ్రేషన్స్..

అయితే, రతి వేడుకతో అభిషేక్ అస్సలు సంతోషంగా లేడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చాలా కోపంగా ఉన్న అభిషేక్ వైపు దిగ్వేష్ రతి వెళ్ళినప్పుడు విషయం మరింత పెద్దదైంది. ఈ సమయంలో, లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ రతిని ఆపడానికి ప్రయత్నించగా, అంపైర్ కూడా జోక్యం చేసుకుని అభిషేక్‌ను డ్రెస్సింగ్ రూమ్‌కు తిరిగి వెళ్లమని కోరాడు. అయితే, హైదరాబాద్ ఓపెనర్ మైదానం వదిలి వెళుతూ రతికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. రతి జుట్టు పట్టుకుని కొడతాడనంటూ అభిషేక్ సైగలు చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

దిగ్వేష్‌కు రెండుసార్లు జరిమానా..

నోట్‌బుక్ వేడుకకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ రతికి రెండుసార్లు జరిమానా విధించింది. అయినప్పటికీ అతను వేడుకలు జరుపుకోవడం కొనసాగిస్తూనే ఉన్నాడు. అభిషేక్‌తో వాదన తర్వాత మరో శిక్ష ముప్పును ఎదుర్కొంటున్నాడు. అయితే, మ్యాచ్ తర్వాత, ఇద్దరూ ఆ సంఘటన గురించి చర్చించుకుని ఒకరితో ఒకరు కరచాలనం చేసుకున్నారు. ఆ తరువాత బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వారిద్దరితో మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో సులభమైన విజయాన్ని నమోదు చేసింది. రతి 4 ఓవర్లలో 37 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. ఇషాన్ కిషన్‌ను కూడా అవుట్ చేసి మరోసారి ‘నోట్‌బుక్ వేడుక’ చేసుకున్నాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..