AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

454 రోజులుగా అభిమాని పోరాటం.. ఎట్టకేలకు కరుణించిన ఏబీ డివిలియర్స్! అసలు విషయం ఏంటంటే..?

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌కు ఇండియాలో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. మిథున్ అనే అభిమాని ఏబీడీ నుండి రిప్లై కోసం 454 రోజులు నిరంతరంగా ట్వీట్ చేశాడు. చివరకు ఏబీడీ అతని అంకితభావాన్ని గుర్తించి స్పందించారు. ఈ ఘటన ఏబీడీకి తన అభిమానుల పట్ల ఉన్న ప్రేమను, తన మానవత్వాన్ని చాటిచెప్పింది.

454 రోజులుగా అభిమాని పోరాటం.. ఎట్టకేలకు కరుణించిన ఏబీ డివిలియర్స్! అసలు విషయం ఏంటంటే..?
Ab De Villiers
SN Pasha
|

Updated on: Jun 05, 2026 | 11:52 AM

Share

ఇండియాలో ఇండియన్ క్రికెటర్లకు ఫ్యాన్స్ ఉండటం కామన్. కానీ ఫారెన్ క్రికెటర్లు కూడా మన దేశంలో అభిమానులు ఉంటారు. అందులోనూ కొంతమందికి అయితే భారీ సంఖ్యలో ఉంటారు. ఇండియన్స్ నుంచి అలాంటి అభిమానం పొందిన క్రికెటర్లలో ముందు వరుసలో ఉంటాడు సౌతాఫ్రికా మాజీ ప్లేయర్, మిస్టర్ 360 బ్యాటర్ ఏబీ డివిలియర్స్. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున ఎంతో కాలం ఆడి, విరాట్ కోహ్లీకి అత్యంత ఆప్తమిత్రుడిగా మారిన ఏబీ డివిలియర్స్‌కు మన దేశంలో లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

వారిలో ఒకడు మిథున్ అనే అభిమాని. ఇతనికి డివిలియర్స్ అంటే పిచ్చి ఇష్టం. తన సోషల్ మీడియా అంతా డివిలియర్స్ పోస్టులో నిండి ఉంటుంది. అయితే ఎక్స్‌లో తన పోస్ట్‌కు డివిలియర్స్ రిప్లే ఇవ్వాలని కోరుతూ.. 454 రోజుల క్రితం ఒక సంకల్పం తీసుకున్నాడు. ప్రతి రోజు ‘Until AB Replies.. @ABdeVilliers17 #RCB #GOAT Please Have A Look!’ అంటూ ట్వీట్ చేసేవాడు. ఇలా రోజులు, వారాలు, నెలలు, ఏడాది కూడా దాటిపోయింది. కానీ ఇప్పుడు అది ఏబీడీ కంట పడింది. తన అభిమాని తన రిప్లే కోసం ఇంతలా ఆరాటపడుతుంటే చూసి తట్టుకోలేక వెంటనే ఆ ట్వీట్‌కు రిప్లే ఇచ్చాడు. ‘There we go 😎 cheers to Day 454’ అంటూ ట్వీట్ చేశాడు.

దాంతో మిథున్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిజంగా నమ్మలేకపోతున్నాను.. ఇది నా కల.. దీనికి గురించి చెప్పడానికి మాటలు రావడం లేదంటూ తన సంతోషాన్ని ఎక్స్లో పంచుకున్నాడు. అయితే ఈ 454 రోజుల్లో ఒక్క రోజు కూడా మిథన్ ట్వీట్ చేయడం మిస్ చేయలేదు. సాధారణంగా ఇలా క్రికెటర్లను, హీరోలను ట్యాగ్ చేస్తూ చాలా మంది అభిమానలు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తుంటారు. కానీ, చాలా మంది వాటిని చూసి పట్టించుకోరు. కానీ డివిలియర్స్ మాత్రం రిప్లే ఇచ్చి తన అభిమానులకు తాను ఎంత విలువ ఇస్తాడో, ఎంత తిరిగి ప్రేమిస్తాడో నిరూపించుకున్నాడు. గ్రౌండ్లో దిగితే మాస్ బ్యాటింగ్ చేసే ప్లేయర్ కానీ.. మనసు మాత్రం వెన్న అంటూ క్రికెట్ అభిమానులు డివిలియర్స్‌ను మెచ్చుకుంటున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us