కోవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. 2021లో జరగాల్సిన ఆసియా కప్‌ను 2023కు వాయిదా వేస్తున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) ప్రకటించింది.కరోనాకు తోడు ఈ ఏడాది క్రికెట్ క్యాలెండర్ బిజీగా ఉండడం వల్ల ఈ టోర్నీని 2023కి రీషెడ్యూల్ చేసినట్లుగా నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది పాకిస్థాన్‌లో జరగాల్సిన ఈ టోర్నీని తొలుత శ్రీలంకకు తరలించారు. భారత్-పాక్ మధ్య నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ మార్పు చేశారు.
అయితే శ్రీలంకలో కొవిడ్ కేసులు పెరుగుతుండడం వల్ల ఆసియా కప్‌ను రద్దు చేస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు ఇటీవలే ప్రకటించింది. తాజాగా దీనికి రీషెడ్యూల్‌ను ఏసీసీ వెల్లడించింది.”ఆసియా కప్ గురించి తీవ్రంగా ఆలోచించిన తర్వాత టోర్నీని 2023లో నిర్వహించడం మేలనిపించింది. 2022లో మరో ఆసియా కప్ ఉండడం వల్ల 2021 సీజన్‌ను 2023లో జరపాలని నిర్ణయించాం. సంబంధించిన తేదీలు నిర్ణీత సమయంలో ప్రకటిస్తాం,” అని ఏసీసీ పేర్కొంది.ః