Wasim Jaffer: ఇండియా, కివీస్ మ్యాచ్‎పై అదిరిపోయే ట్వీట్ చేసిన వసీం జాఫర్.. అందులో ఏముందంటే..

సోషల్ మీడియాలో చమత్కారమైన పోస్ట్‌లకు పేరుగాంచిన భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ బుధవారం న్యూజిలాండ్‌, ఇడియాపై చమత్కారమైన పోస్టు చేశాడు. ఈ పోస్టుతో అభిమానుల్లో నవ్వులు పూయించాడు...

Wasim Jaffer: ఇండియా, కివీస్ మ్యాచ్‎పై అదిరిపోయే ట్వీట్ చేసిన వసీం జాఫర్.. అందులో ఏముందంటే..
Wasim
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 18, 2021 | 9:20 AM

సోషల్ మీడియాలో చమత్కారమైన పోస్ట్‌లకు పేరుగాంచిన భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ బుధవారం న్యూజిలాండ్‌, ఇడియాపై చమత్కారమైన పోస్టు చేశాడు. ఈ పోస్టుతో అభిమానుల్లో నవ్వులు పూయించాడు. మెన్ ఇన్ బ్లూ మూడు-మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని మొదటి టీ20లో కివీస్‎ను ఓడించింది. కెప్టెన్‎గా రోహిత్ శర్మ- కోచ్‎గా రాహుల్ ద్రవిడ్ తమ మొదటి మ్యాచ్‎లోనే విజయం సొంతం చేసుకున్నారు.

వసీం జాఫర్ బాలీవుడ్ మూవీ మున్నా భాయ్ M.B.B.S నుండి ఒక మీమ్‎నును పోస్ట్ చేశాడు. ఇటీవలి టీ20 ప్రపంచ కప్‌లో నిరాశపరిచిన తర్వాత న్యూజిలాండ్‌పై బుధవారం నాటి విజయం భారత అభిమానుల బాధలను కొంతవరకు తగ్గించడానికి సహాయపడుతుందని జాఫర్ మీమ్ ద్వారా సూచించాడు. ఫొటోలో నటుడు సంజయ్ దత్ “నా కల చెదిరిపోయింది, అది నా హృదయాన్ని కాల్చేస్తుంది. ఇది కొద్దిగా బాధిస్తోంది, అయితే ఇది బాగానే ఉంది” అని అంటాడు. దత్‌ను మరో నటుడు “అప్పుడు ఏమైంది?” అని అడిగాడు. ఆ ప్రముఖ నటుడు చిరునవ్వుతో జవాబిచ్చాడు, “అప్పుడు ఏమిటి.. మరుసటి రోజు, న్యూజిలాండ్ జట్టు నా ప్రాంతానికి వచ్చింది.” అని చెబుతాడు.

ఈ ట్వీట్‌కు అభిమానుల నుండి మంచి స్పందన లభించింది. పలువురు జాఫర్ హాస్యాన్ని ప్రశంసించారు. టీ20 ప్రపంచకప్‌ నుంచి అద్భుతంగా నిష్క్రమించిన టీమిండియా సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయింది. సూపర్ 12 దశలో పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన మెన్ ఇన్ బ్లూ వారి గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఈ టోర్నమెంట్‌లో టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి, పదవీకాలం కూడా ముగిసింది. టోర్నమెంట్ తర్వాత కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుండి వైదొలిగాడు.

జైపూర్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‎లో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి టీ20లో 165 పరుగుల లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయవంతంగా ఛేదించింది. రోహిత్ శర్మ 36 బంతుల్లో 48 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 40 బంతుల్లో 62 పరుగులు చేశాడు. కివీస్ ఆటగాడు మార్టిన్ గప్టిల్ 42 బంతుల్లో 70 పరుగులు చేయడంతో తొలుత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. టీ20 సిరీస్ తర్వాత ఇరు జట్లు రెండు టెస్టు మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి.

Read Also… Wasim Akram: అతడిని కాదని డేవిడ్ వార్నర్‎కే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎందుకించారంటే..