COMMONWEALTH GAMES 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మహిళల జట్టు పరాజయం పాలైంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ (52; 34 బంతుల్లో 8×4, 1×6) రేణుకా సింగ్ నాలుగు వికెట్లతో రాణించినప్పటికీ కంగారూలతో ఓటమిని తప్పించుకోలేకపోయింది భారత జట్టు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో ఆసీస్ మొదట తడబడింది. రేణుక దాటికి ఒకనొకదశలో 49 పరుగులకే ఐదు టాపార్డర్ వికెట్లు కోల్పోయింది. అయితే యాష్లీ గార్డనర్ అజేయ అర్ధ సెంచరీకి తోడు గ్రేస్ హారిస్ 37 పరుగుల విలువైన ఇన్నింగ్స్‌లు భారత జట్టుకు ఓటమిని మిగిల్చాయి.
హర్మన్ ప్రీత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్
కాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రేణుకా సింగ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మిడిలార్డర్‌లో హర్మన్‌ప్రీత్ 34 బంతుల్లోనే 52 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచింది. ఇందులో 8 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఇక రేణుకు తన 4 ఓవర్లలో కేవలం 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. అయితే ఇతర ఆటగాళ్లు విఫలమవ్వడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ముఖ్యంగా లక్ష్య ఛేదనలో ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా టీమిండియాపై ఎదురుదాడికి దిగింది. గ్రేస్ హారిస్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 20 బంతుల్లో 37 పరుగులు చేసింది. ఇందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి . ఆమె స్ట్రైక్ రేట్ దాదాపు 185. ఇక ఆరంభంలో నెమ్మదిగా ఆడిన గార్డ్‌నర్ ఆ తర్వాత క్రమంగా జోరు పెంచింది. 9 ఫోర్ల సాయంతో అర్ధ సెంచరీ పూర్తి చేసి నాటౌట్‌గా నిలిచి తన జట్టును విజయతీరాలకు చేర్చింది.
That’s that from our first game at #CWG2022
Australia win by 3 wickets.#TeamIndia will look to bounce back in the next game.
Scorecard – https://t.co/cuQZ7NHmpB #AUSvIND #B2022 pic.twitter.com/p1sn3xS6kj
— BCCI Women (@BCCIWomen) July 29, 2022
కాగా భారత బౌలర్లలో రేణుకా తప్ప మిగతా వారు పెద్దగా రాణించలేదు. గైక్వాడ్ 2 ఓవర్లలో 24 పరుగులు ఇవ్వగా.. రాధా యాదవ్ 4 ఓవర్లలో 42 పరుగులు సమర్పించుకుంది. అదే సమయంలో మేఘనా సింగ్ 4 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చింది. ఇక చివరి ఓవర్లలో భారత్ బ్యాటింగ్ కూడా పేలవంగా సాగింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన టీమిండియా చివరి ఐదు ఓవర్లలో భారత జట్టు 39 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. దీంతో కేవలం 154 పరుగులకే పరిమితమైంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..