CWG 2022: కామన్వెల్త్ టీటీలో భారత్ శుభారంభం.. ప్రత్యర్థిని 15 నిమిషాల్లోనే మట్టికరిపించిన మనిక

COMMONWEALTH GAMES 2022: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న కామన్వెల్త్‌ గేమ్స్‌-2022 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి అధికారిక క్రీడా పోటీలు షురూ కానున్నాయి. ఆగస్టు 8 వరకు జరిగే ఈ క్రీడా సంగ్రామంలో ..

CWG 2022: కామన్వెల్త్ టీటీలో భారత్ శుభారంభం.. ప్రత్యర్థిని 15 నిమిషాల్లోనే మట్టికరిపించిన మనిక
Manika Batra
Follow us
Basha Shek

|

Updated on: Jul 29, 2022 | 5:32 PM

COMMONWEALTH GAMES 2022: ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న కామన్వెల్త్‌ గేమ్స్‌-2022 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి అధికారిక క్రీడా పోటీలు షురూ కానున్నాయి. కాగా ఆగస్టు 8 వరకు జరిగే ఈ క్రీడా సంగ్రామంలో భారతదేశం నుంచి 215 మంది ఆటగాళ్లు తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. కాగా శుక్రవారం జరిగిన టేబుల్‌ టెన్నిస్‌ ఈవెంట్లో భారత క్రీడాకారిణి మనికా బాత్రా (Manika Batra) శుభారంభం చేసింది. మహిళల టీమ్ ఈవెంట్‌లో మనిక బాత్రా సారథ్యంలోని టీమిండియా లీగ్ రౌండ్ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. భారత్ 3-0తో గెలిచి శుభారంభం చేసింది.  గ్రూప్‌ రౌండ్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన ముష్ఫిఖ్ కలాంను 11-5, 11-3, 11-2, తో వరుస సెట్లలో ఓడించింది. ఈ మ్యాచ్‌ కేవలం 15 నిమిషాల్లోనే ముగియడం విశేషం. అంతకు ముందు మహిళల డబుల్స్ ద్వయం శ్రీజ అకుల, రీత్ టెన్నిసన్, దక్షిణాఫ్రికా జంట లైలా ఎడ్వర్డ్స్- డానీషా పటేల్‌ల జోడీపై 11-7 11-7 11-5తో ను ఓడించారు. టేబుల్ టెన్నిస్‌లో క్వాలిఫైయింగ్ రౌండ్ 2 పోటీలు రాత్రి 8:30 గంటల నుంచి జరగనున్నాయి.

కాగా కామన్వెల్త్ గేమ్స్‌లో 2 స్వర్ణాలు సహా మొత్తం 4 పతకాలు సాధించిన మనికా ఆసియా క్రీడలలో మిక్స్‌డ్ డబుల్స్‌లో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకుంది. ఒలంపిక్స్ సింగిల్స్ ఈవెంట్‌లో మూడో రౌండ్‌కు చేరిన ఏకైక భారత మహిళా క్రీడాకారిణి మనిక. టోక్యో ఒలింపిక్స్‌లో మనిక ఈ ఘనత సాధించింది. అయితే తన దూకుడు స్వభావంతో ఒలింపిక్స్ అనంతరం కోచ్ తో గొడవ పడి వార్తల్లో ఎక్కింది. ఈక్రమంలో కామన్వెల్త్‌-2022 గేమ్స్ లోనూ ఆమెపై భారీ అంచనాలున్నాయి. టేబుల్‌ టెన్నిస్‌లో కచ్చితంగా పతకం తెస్తుందని భారత క్రీడాభిమానులు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..