సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా తొలగించండి: కోచ్ రిపోర్ట్

ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ ప్రదర్శనపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ప్రక్షాళన చేపట్టింది. కోచ్‌, కెప్టెన్‌లను మార్చాలనే యోచనలో ఉంది.  ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌  జట్టు విషయంలో స్యయంగా తానే కేర్ తీసుకుంటానని ఎనౌన్స్ చేశారు. అయితే సర్ఫరాజ్‌ అహ్మద్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని పాక్‌ క్రికెట్‌ కోచ్‌ మికీ ఆర్థర్‌ పీసీబీ క్రికెట్‌ కమిటీకి సూచించారని పాక్ మీడియా వర్గాల నుంచి సమాచారం అందుతోంది. పాక్‌ జట్టు ప్రదర్శనలను పీసీబీ క్రికెట్‌ బోర్డు […]

సర్ఫరాజ్‌ను కెప్టెన్‌గా తొలగించండి: కోచ్ రిపోర్ట్
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 05, 2019 | 7:58 PM

ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ ప్రదర్శనపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ప్రక్షాళన చేపట్టింది. కోచ్‌, కెప్టెన్‌లను మార్చాలనే యోచనలో ఉంది.  ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌  జట్టు విషయంలో స్యయంగా తానే కేర్ తీసుకుంటానని ఎనౌన్స్ చేశారు. అయితే సర్ఫరాజ్‌ అహ్మద్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని పాక్‌ క్రికెట్‌ కోచ్‌ మికీ ఆర్థర్‌ పీసీబీ క్రికెట్‌ కమిటీకి సూచించారని పాక్ మీడియా వర్గాల నుంచి సమాచారం అందుతోంది. పాక్‌ జట్టు ప్రదర్శనలను పీసీబీ క్రికెట్‌ బోర్డు మూడేళ్లుగా సమీక్షిస్తున్న సంగతి తెలిసిందే.

సర్ఫరాజ్‌ స్థానంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు షాదాబ్‌ ఖాన్‌ను, సుదీర్ఘ ఫార్మాట్‌కు బాబర్‌ ఆజామ్‌ను సారథులుగా నియమించాలని ఆర్థర్‌ సూచించారని తెలుస్తోంది. ఆటగాళ్లను నడిపించే నైపుణ్యాల్లో సర్ఫరాజ్‌ను ఆర్థర్‌ వ్యతిరేకించారట. మరో రెండేళ్లు అవకాశమిస్తేనే కోరుకున్న ఫలితాలు అందిస్తానని క్రికెట్‌ కమిటీకి నేతృత్వం వహిస్తున్న పీసీబీ ఎండీ వసీమ్‌ ఖాన్‌కు ఆయన చెప్పారని తెలుస్తోంది. ఆర్థర్‌తో కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఆయన నేతృత్వంలోనే పాక్‌ ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనిచ్చిన ప్రజెంటేషన్‌, వివరణతో కమిటీ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. అయితే  కోచ్‌గా ఆర్థర్‌ను కొనసాగించేందుకు కొంతమంది పాక్‌ మాజీలు మద్దతు తెలుపుతుండగా, మరికొంతమంది మాత్రం అతను వద్దనే అంటున్నారు.