యాషెస్ తొలి టెస్ట్ మ్యాచులో ఆస్ట్రేలియా విజయకేతనం
బర్మింగ్‌హామ్: యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై 251 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీషు టీమ్ 52.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యంత పరుగుల తేడాతో జరిగిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డుల్లోకి ఎక్కింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 284 పరుగులు చేయగా, ఆ ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్ 144 పరుగులతో సెంచరీ కొట్టడం విశేషం. అనంతరం ఇంగ్లాండ్ […]
బర్మింగ్‌హామ్: యాషెస్ తొలి టెస్టులో ఇంగ్లండ్‌పై 251 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 398 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీషు టీమ్ 52.3 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యంత పరుగుల తేడాతో జరిగిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డుల్లోకి ఎక్కింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 284 పరుగులు చేయగా, ఆ ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్ 144 పరుగులతో సెంచరీ కొట్టడం విశేషం. అనంతరం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 374 పరుగుల చేసి ఆలౌటైంది. అయితే అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 487 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం 398 పరుగులు భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ లక్ష్యఛేదనలో తడబడింది. కేవలం 146 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో మ్యాచ్ ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో రెండో ఇన్నింగ్స్ సందర్భంగా పాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్ చెరో 3 వికెట్లు పడగొట్టడంతో పాటు జేమ్స్ పాటిన్సన్, పీటర్ సిడిల్ చెరో రెండు వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ చేతులెత్తేసింది.