క్రేజీ రికార్డు నెలకొల్పిన స్టీవ్‌స్మిత్‌

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ యాషెస్‌ తొలి టెస్టులో రెండు శతకాలు సాధించి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో తొలుత శతకం బాది, రెండో ఇన్నింగ్స్‌లో 50కి పైగా పరుగులు చేయడం స్మిత్‌కు ఇది తొమ్మిదోసారి. అంతకుముందు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ ఒక్కడే ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా ఉండేవాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో స్మిత్‌(144, 142) రెండు శతకాలు సాధించి కలిస్‌తో సమానంగా నిలిచాడు. వీరి తర్వాత ఇంగ్లాండ్‌ […]

క్రేజీ రికార్డు నెలకొల్పిన స్టీవ్‌స్మిత్‌
Follow us
Ram Naramaneni

|

Updated on: Aug 06, 2019 | 5:38 PM

ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌ యాషెస్‌ తొలి టెస్టులో రెండు శతకాలు సాధించి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో తొలుత శతకం బాది, రెండో ఇన్నింగ్స్‌లో 50కి పైగా పరుగులు చేయడం స్మిత్‌కు ఇది తొమ్మిదోసారి. అంతకుముందు దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్వెస్‌ కలిస్‌ ఒక్కడే ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా ఉండేవాడు. తాజాగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో స్మిత్‌(144, 142) రెండు శతకాలు సాధించి కలిస్‌తో సమానంగా నిలిచాడు.

వీరి తర్వాత ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ అలిస్టర్‌కుక్‌(8), ఆసీస్‌ దిగ్గజం అలెన్‌ బోర్డర్‌(7), విరాట్‌కోహ్లీ(7), రికీపాంటింగ్‌(7), కుమార సంగక్కర(7), సచిన్‌ తెండుల్కర్‌(7) వరుసగా ఉన్నారు.