Madhavan: పుత్రోత్సాహంతో పొంగిపోతోన్నహీరో మాధవన్‌.. 5 స్వర్ణాలతో సహా మొత్తం 7 పతకాలు సాధించిన తనయుడు వేదాంత్‌

|

Feb 12, 2023 | 9:24 PM

ఈ పోటీల్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తోన్న వేదాంత్‌ మాధవన్ 5 స్వర్ణ పతాకలు, 2 రజత పతకాలతో సహా మొత్తం 7 పతకాలను గెల్చుకున్నాడు. 100, 200, 1500 మీటర్ల రేసులో స్వర్ణ పతకాలు సాధించిన మ్యాడీ తనయుడు..

Madhavan: పుత్రోత్సాహంతో పొంగిపోతోన్నహీరో మాధవన్‌.. 5 స్వర్ణాలతో సహా మొత్తం 7 పతకాలు సాధించిన తనయుడు వేదాంత్‌
Madhavan
Follow us on

సఖి సినిమాతో అమ్మాయిల మనసులు కొల్లగొట్టిన స్టార్‌ హీరో మాధవన్‌ పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. ఆయన కుమారుడు ఎమర్జింగ్‌ స్విమ్మర్‌ వేదాంత్‌ మాధవన్‌ ఖేలో ఇండియా గేమ్స్‌-2023లో రికార్డు స్థాయిలో పతకాలు సాధించడమే దీనికి కారణం. ఈ పోటీల్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహిస్తోన్న వేదాంత్‌ మాధవన్ 5 స్వర్ణ పతాకలు, 2 రజత పతకాలతో సహా మొత్తం 7 పతకాలను గెల్చుకున్నాడు. 100, 200, 1500 మీటర్ల రేసులో స్వర్ణ పతకాలు సాధించిన మాధవన్ తనయుడు.. 400, 800 మీట్లర​ రేసులో రెండు రజత పతకాలు సొంతం చేసుకున్నాడు. కాగా ఈ గేమ్స్‌లో మహారాష్ట్ర మొత్తం 161 మెడల్స్‌ గెల్చుకుని పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. వీటిలో 56 స్వర్ణాలు, 55 రజతాలు, 50 కాంస్యాలు ఉన్నాయి. ఈక్రమంలో ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది మహారాష్ట్ర. అలాగే బాలుర విభాగంలో కూడా అత్యధిక పతకాలు సాధించి మరో ట్రోఫీని సొంతం చేసుకుంది.

కాగా తన తనయుడి ప్రదర్శనతో ఆనందంలో తేలిపోతున్నాడు మాధవన్‌. ఈసందర్భంగా తన కుమారుడు, మహారాష్ట్ర జట్టుకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపాడు. అలాగే కోచ్‌, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపన మ్యాడీ.. ఖేలో ఇండియా గేమ్స్‌ను ఘనంగా నిర్వహించిన కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఇటీవల కాలంలో కొలనులో బంగారు చేపలా పతకాలు కొల్లగొడుతున్నాడు వేదాంత్‌. గతేడాది డానిష్‌ ఓపెన్‌లో బంగారు పతకం గెలవడం ద్వారా తొలిసారి వార్తల్లోకెక్కాడు వేదాంత్‌. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ కోసం రెడీ అవుతున్న అతను అందుకోసం దుబాయ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు. కుమారుడి తట్రైనింగ్‌ కోసం తన కుటుంబాన్ని మొత్తం దుబాయ్‌కు షిఫ్ట్‌ చేశాడు మాధవన్‌.