తనిష్క్ నుంచి సమృద్ధి కలెక్షన్.. ప్రత్యేక తగ్గింపు కూడా..

తనిష్క్‌లో లభించే బంగారు ఆభరణాలు వధువు అందాన్ని పెంచుతాయి. అత్యుత్తమ నైపుణ్యంతో తయారు చేసిన ఈ ఆభరణాలు నిజంగా కళ్ళకు కనువిందు చేస్తాయి. పాత పనికిరాని ఆభరణాలను వదిలించుకుని, తనిష్క్ నుండి ఈ ప్రత్యేకమైన ఆభరణాలను సొంతం చేసుకునేందుకు ఇప్పుడే.. తనిష్క్ షోరూంను సందర్శించండి..

తనిష్క్ నుంచి సమృద్ధి కలెక్షన్.. ప్రత్యేక తగ్గింపు కూడా..

Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 07, 2025 | 8:09 PM

తెలుగు రాష్ట్రాల ప్రజలు వరమహాలక్ష్మి వ్రతాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ధన వృద్ధితో పాటు ఆరోగ్యం, విజయం కోసం ఈ వ్రతాన్ని చేస్తారు. ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ పండుగ సందర్భంగా చాలా మంది మహిళలు బంగారు, డైమాండ్ ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వరమహాలక్ష్మి వ్రతాన్ని దృష్టిలో ఉంచుకుని టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్.. ‘సమృద్ధి కలెక్షన్‌’ను విడుదల చేసింది.

సమృద్ది కలెక్షన్ చాలా ప్రత్యేకమైనది. సాంప్రదాయక పండుగ దీపాల నుంచి ప్రేరణ పొంది ఈ కలెక్షన్ విడుదల చేసినట్లు తనిష్క్ తెలిపింది. పండుగ సందర్బంగా బంగారు ఆభరణాలపై గ్రాముకు రూ.450, వజ్రాభరణాల విలువపై 20 శాతం వరకు తగ్గింపు ఇవ్వనున్నారు. ఈ స్పెషల్ ఆఫర్లు ఆగష్టు 7 నుంచి ఆగష్టు 10 వరకు ఏపీ, తెలంగాణలోని అన్ని తనిష్క్ స్టోర్స్‌లో అందించనున్నారు. గోల్డ్ ఎక్సేంజ్‌ను కూడా కొనుగోలుదారులు ఉపయోగించుకోవచ్చు.

Tanishq Jewellery

సమృద్ధి కలెక్షన్‌లో ప్రతీ ఆభరణం క్లిష్టమైన నకాషి పని, యాంటిక్ ఫినిష్‌తో మిళితమై ఆభరణ ప్రియులను విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుందని తనిష్క్ తెలిపింది. ఇందులో నెక్లెస్‌లు, గాజులు, చెవి పోగులు తదితరాలు ఉన్నాయి. ఆభరణాల్లో అద్భుత రంగు రాళ్లను ఉంచడంతో పాటు సూక్ష్మమైన అంశాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

శ్రావణ మాసం, వరలక్ష్మివ్రతం సందర్భంగా బంగారం కొనాలనుకునే  వారికి ఇదొక సువర్ణవకాశం అని చెప్పవచ్చు.. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బంగారు ఆభరణాలను కొనలనుకుంటే.. దగ్గర్లోని తనిష్క్ షోరూంను సందర్శించండి..