18 నెలల పసికందుకు ప్రాణం పోసిన రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్.. ఆకాశమార్గంలో తరలించి..!
తీవ్రమైన న్యుమోనియా, ఎఆర్‌డిఎస్‌తో బాధపడుతూ అత్యున్నత స్థాయి వెంటిలేటర్ మీద ఉన్న గోవాకు చెందిన 18 నెలల పసికందును రక్షించడం ద్వారా రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అత్యున్నత స్థాయి వైద్య నైపుణ్యం, నిబద్ధతను చాటుకుంది. ఈ చిన్నారిని రక్షించడానికి రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్ అద్భుతమైన టీమ్‌వర్క్, సమన్వయం, నిబద్ధతను ప్రదర్శించింది. మన దేశంలో ఒక చిన్నారిని కాపాడటానికి ఈ తరహా వైద్యం జరగడం ఇదే తొలిసారి.
తీవ్రమైన న్యుమోనియా, ఎఆర్‌డిఎస్‌తో బాధపడుతూ అత్యున్నత స్థాయి వెంటిలేటర్ మీద ఉన్న గోవాకు చెందిన 18 నెలల పసికందును రక్షించడం ద్వారా రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ అత్యున్నత స్థాయి వైద్య నైపుణ్యం, నిబద్ధతను చాటుకుంది. ఈ చిన్నారిని రక్షించడానికి రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్ అద్భుతమైన టీమ్‌వర్క్, సమన్వయం, నిబద్ధతను ప్రదర్శించింది. మన దేశంలో ఒక చిన్నారిని కాపాడటానికి ఈ తరహా వైద్యం జరగడం ఇదే తొలిసారి.
ఇన్‌ఫ్లుఎంజా న్యుమోనియాలో తర్వాత స్థాయి ARDS (అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్) ఆ చిన్నారికి ఉంది. అప్పటికే 1 వారం పాటు కృత్రిమ ఊపిరి సహాయంపై ఉన్నాడు. అతను హై-ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్, 100% ఆక్సిజన్, HFOVలో మద్దతుతో ఉన్నాడు. ఈ తరహా మద్దతు ఉన్నప్పటికీ అతను ఆక్సిజన్‌ను పూర్తి స్థాయిలో తీసుకోలేక పోతున్నాడు కాబట్టి అతనికి ECMO సహాయం అందించటం ప్రారంభించడం, ఆ తరహా రోగులను నిర్వహించగల ఆసుపత్రికి బదిలీ చేయడం ద్వారా మాత్రమే రక్షించడం జరిగింది.
ECMO అంటే ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెమ్బ్రేన్ ఆక్సిజనేషన్. ఈ ప్రక్రియలో రక్తం ఒకరి శరీరం వెలుపల, గుండె-ఊపిరితిత్తుల యంత్రానికి పంప్ చేయబడుతుంది. ఇది కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించి ఆక్సిజన్‌తో నిండిన రక్తాన్ని శరీరంలోని కణజాలాలకు తిరిగి పంపుతుంది. ఇది ఊపిరితిత్తులకు విశ్రాంతి కల్పించటంతో పాటుగా తిరిగి కోలుకోవటానికి, ఆక్సిజన్‌ను నిర్వహించడానికి సహాయపడుతుంది.
ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ చిర్ల మాట్లాడుతూ.. “అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చదగిన సర్వైవల్ రేటుతో ప్రముఖ పీడియాట్రిక్ ECMO సెంటర్‌గా వెలుగొందుతున్న రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు ఈ చిన్నారి తరలింపు కోసం కాల్ వచ్చింది. కాల్ వచ్చిన వెంటనే, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్, పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్, ECMO శిక్షణ పొందిన పెర్ఫ్యూషనిస్ట్, ECMO శిక్షణ పొందిన ఇంటెన్సివ్ కేర్ నర్సు, బయోమెడికల్ బృందం ICATT బృందంతో కలిసి గోవా ఆసుపత్రిలో ECMOను సురక్షితంగా నిర్వహించడానికి, బిడ్డను ఇక్కడికి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధమై పోయాయి అని అన్నారు. UK లో ECMOపై శిక్షణ పొందిన సీనియర్ కన్సల్టెంట్ నియోనాటాలజిస్ట్, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ కపిల్ బి సచానే ఈ ఎయిర్ అంబులెన్స్ బృందానికి నేతృత్వం వహించారు.
ఆయన ఈ బృందంలో కీలక సభ్యుడైన పీడియాట్రిక్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ సాయి రామ్‌తో కలిసి మాట్లాడుతూ.. “రెయిన్‌బో రిట్రీవల్ టీమ్ 24 గంటలకు పైగా అవిశ్రాంతంగా పని చేయడం ద్వారా ఈ విధిని విజయవంతంగా పూర్తి చేయగలిగింది. ECMO మద్దతు అందించాలని నిర్ణయం తీసుకున్న నాలుగు గంటల్లోపే మా బృందం గోవా చేరుకుంది. శిశువుకి 6 గంటల్లోపే ECMO మద్దతును వేగంగా అందించగలిగాము. ఈ చిన్నారి తీవ్ర అనారోగ్యంతో ఉంది. దీనికి తోడు కొత్త ఆసుపత్రిలో ECMOని ప్రారంభించడం కూడా సవాలుగా మారింది. అలాగే, దేశంలో ఇలాంటి రవాణా నిర్వహించడం ఇదే తొలిసారి. స్థానిక ఆసుపత్రిలో ECMO ప్రారంభించిన తర్వాత, సగం పని పూర్తయింది.
ఈ చిన్నారి ఆక్సిజన్ సాచురేషన్ మెరుగుపడింది. తల్లిదండ్రులు కొంచెం ఉపశమనం పొందారు. మాకు ఒక అద్భుతమైన సర్జన్ ఉన్నారు. ఆయన నైపుణ్యం, కృషి ఈ చిన్నారిని కాపాడటంలో ఎంతగానో తోడ్పడింది. ఈ చిన్నారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించటానికి ముందు రవాణా సమయంలో చిన్నారి సురక్షితంగా ఉందని నిర్ధారించడానికి మా బృందం అవిశ్రాంతంగా పనిచేసింది అని వెల్లడించారు.
డాక్టర్ ఫర్హాన్ షేక్, HOD, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్, RCH, బంజారా హిల్స్ మాట్లాడుతూ..“ఈ చిన్నారి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. 29 రోజులు (సుమారు 4 వారాలు) ECMO పై ఉన్నాడు. వివిధ విభాగాల మధ్య ఖచ్చితమైన ప్రణాళిక, సమన్వయం కారణంగా మేము ఈ తరలింపును విజయవంతంగా చేయగలిగాము. యూనిట్‌లో ఎక్కువ కాలం ఉన్న ఈ బిడ్డ సంరక్షణ సవాలుగా నిలిచింది. ఈ చిన్నారి హాస్పిటల్ లో వున్న సమయంలో ఆరోగ్య పరంగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అతని తల్లిదండ్రులు తమ పూర్తి మద్దతు అందించారు. టీమ్‌వర్క్, 24 గంటల ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ మద్దతు, అద్భుతమైన ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ పద్ధతులతో మేము ఈ చిన్నారిని రక్షించగలిగాము..అని అన్నారు.
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ అనుపమ యెర్రా మాట్లాడుతూ.. “ECMO మద్దతు అవసరమైన పిల్లలను వేగంగా ఎయిర్‌లిఫ్ట్ చేయగల మా సామర్థ్యం ఈ చిన్నారి ని కాపాడటంలో ఎంతగానో తోడ్పడింది. అతి ప్రధానమైన ఎయిర్ అంబులెన్స్ ప్రొవైడర్స్‌తో మా భాగస్వామ్యం ఇందుకు తోడ్పడింది. అనారోగ్యంతో ఉన్న శిశువులకు సురక్షితమైన, సమర్థవంతమైన, సకాలంలో తగిన రవాణా అందేలా మేము అందించగలుగుతున్నందుకు గర్వపడుతున్నాము. ఇది జీవితాలను రక్షించడానికి, సమయానుకూల జోక్యాన్ని సాధ్యం చేయడానికి, చివరికి నిరాశలో కూరుకుపోయిన సమయంలో కుటుంబాలకు ఆశను తీసుకురావడానికి గోల్డెన్ పీరియడ్ ఉపయోగించుకోవడంలో మాకు సహాయపడుతుంది అని అన్నారు.
రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సీఎండీ డాక్టర్ రమేష్ కంచర్ల మాట్లాడుతూ.. “దేశంలోనే నియోనాటల్ , పీడియాట్రిక్ ట్రాన్స్‌పోర్ట్ సేవలలో అతిపెద్ద నెట్‌వర్క్‌ను రెయిన్‌బో కలిగి ఉంది. మేము రెండు దశాబ్దాలుగా రోడ్డు, వాయు రవాణా సదుపాయాన్ని కల్పిస్తున్నాము. మేము చాలా చిన్న వయసు కలిగిన, అనారోగ్యంతో ఉన్న శిశువులను విజయవంతంగా తరలించడం చేశాము. ఇటీవల ఇన్హెల్డ్ నైట్రిక్ ఆక్సైడ్‌తో HFOV పై PPHN లో ఉన్న శిశువును ఎయిర్‌లిఫ్ట్ చేసిన దేశంలో మొదటి హాస్పిటల్‌గా నిలిచాము. ఆ కుటుంబానికి, అసాధారణమైన టీం వర్క్‌ను ప్రదర్శించినందుకు మా వైద్య బృందానికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.. అని అన్నారు.
ఎయిర్ లిఫ్ట్ చేయబడిన ఈ చిన్నారి ఇప్పుడు చెప్పుకోదగ్గ పురోగతిని సాధించాడు. ECMO నుండి బయటకు వచ్చాడు. ఇప్పుడు అతి తక్కువ ఆక్సిజన్ మద్దతులో ఉన్నాడు. అతడిని త్వరలోనే గోవాకు తీసుకెళ్లేందుకు అతని తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్నారు.
పిల్లల జీవితాలను రక్షించడంలో తమ నిబద్ధతను ప్రదర్శిస్తూ.. మారుమూల ప్రాంతాల నుండి కూడా అనారోగ్యంతో ఉన్న రోగులకు వైద్యం అందించడానికి రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ తీవ్రంగా శ్రమిస్తోంది. అన్ని ప్రధాన ఎయిర్ అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడర్లతో వ్యూహాత్మక భాగస్వామ్యాలతో వారు తక్షణమే పని చేస్తారు. వేగవంతమైన రవాణా , సకాలంలో తగిన భరోసా ఇస్తారు. వారి అంకితభావం వల్లనే అనేకమంది ప్రాణాలు కాపాడబడ్డాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి