CAPA IVM లేదా ఔషధ-రహిత IVF సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలకు మరింత సౌకర్యవంతమైన, ఒత్తిడిలేని, తక్కువ ఖర్చుతో కూడుకున్న సులువైన చికిత్స అనుభవాన్ని పొందేలా చూస్తుంది. భారతదేశంలోని అనేక మంది మహిళలు అనేక జీవనశైలి సంబంధమైన, వైద్యపరమైన కారణాల వల్ల.. ఆలస్యంగా గర్భం ధరించడం, పర్యావరణపరమైన, స్థూలకాయం, మధుమేహం మొదలైన కారణాలవల్ల వంధత్యంతో పోరాడుతున్నారు. IVF ద్వారా గత 45 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా లక్షలకొద్ది శిశువులకు జన్మనివ్వడం వలన గొప్ప వైద్య విప్లవాలలో ఒకటిగా ఉంది. దురదృష్టవశాత్తు, చాలా మంది సంతానోత్పత్తి – సవాలు ఎదుర్కుంటున్న మహిళలు IVF చికిత్సతో ముడిపడి ఉన్న శారీరక, భావోద్వేగ, ఆర్థికక్షోభ కారణంగా నిష్క్రమిస్తున్నారు. CAPA IVM (కెపాసిటేషన్ ఇన్విట్రో మెచ్యూరేషన్/ బై-ఫేసిక్ IVM) అనేది ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స, ఇందులో కొన్ని ఇంజెక్షన్లు మాత్రమే ఉంటాయి, అండాశయ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ వంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు.. ఇంకా ఆర్థిక భారం ఉండదు.
Oasis Fertility (ఓయాసిస్ ఫెర్టిలిటీ) చాలా సురక్షితమైన, అవాంతరాలు లేని పద్ధతిలో మహిళలు తమ మాతృత్వపు కలను సాకారం చేసుకోవడానికి ఈ ప్రత్యేకమైన సాంకేతికతను అందించే ప్రపంచంలోని కొన్ని కేంద్రాలలో ఒకటి. CAPA IVM అనేది తక్కువ వ్యవధి వైద్యవిధానం, మంచి ఫలితాలను అందిస్తుంది. PCOS ఉన్న మహిళలు, హార్మోన్ల ఇంజెక్షన్లు పడని మహిళలు లేదా రెసిస్టెంట్ ఓవరీ సిండ్రోమ్, థ్రోంబోఫిలియా ఉన్న మహిళలు, ఓసైట్ మెచ్యూరేషన్ సమస్యలు, హార్మోన్-సెన్సిటివ్ క్యాన్సర్ వంటి పరిస్థితులు ఉన్న మహిళలకు సిఫార్సు చేస్తాం.
విజ్ఞానం మరియు సాంకేతికతతో నడిచే సంస్థ అయినందున, Oasis Fertility నిరంతర పరిశోధన సాధనలు, గ్లోబల్ నిపుణుల ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ, సేవా శ్రేష్ఠతకు నిబద్ధత ద్వారా ఈ కొత్త సాంకేతికతను ఉపయోగిస్తుంది.
IVM (ఇన్ విట్రో మెచ్యూరేషన్) అనేది ప్రత్యేకంగా హార్మోన్ల ఇంజెక్షన్ల నుంచి తీవ్రమైన దుష్ప్రభావాలకు లోనయ్యే స్త్రీలకు లేదా స్పందన లోపం ఉన్న స్త్రీలకు ఉద్దేశించినది. ఈ పద్ధతిలో, IVF ప్రక్రియ కోసం పరిపక్వ అండములను సేకరించడానికి ఎక్కువ ఇంజెక్షన్లు ఉపయోగించకుండా.. అపరిపక్వ అండములు కేవలం కొన్ని ఇంజెక్షన్ల ద్వారా తీస్తారు. ఇది చాలా సురక్షితమైన ప్రక్రియ.. Oasis Fertility అనేది దేశంలో IVMలో అవసరమైన నైపుణ్యం, అనుభవం ఉన్న అతికొద్ది కేంద్రాలలో ఒకటి.
గర్భస్రావం శారీరకంగా, మానసికంగా చాలా బాధాకరమైనది. కొంతమంది స్త్రీలు వారి గర్భస్రావానికి కారణం గుర్తించకపోవడం వల్ల అనేక గర్భస్రావాల కారణంగా మాతృత్వపు ఆశను కోల్పోతారు. పిండంలో జన్యుపరమైన లోపాలు గర్భస్రావానికి కారణం కావచ్చు. గతంలో అనేక గర్భస్రావాలు ఎదుర్కొన్న స్త్రీలు సంతానోత్పత్తి నిపుణులను సంప్రదించి IVF తీసుకోవచ్చు. ఈ ప్రక్రియలో ఏర్పడిన పిండాలను PGT (ప్రీ-ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్) ద్వారా ఏదైనా జన్యుపరమైన లోపలను తనిఖీ చేయవచ్చు. PGT అనేది స్త్రీ గర్భాశయంలోని పిండాన్ని మరింత అభివృద్ధి కోసం ఉంచే ముందు పిండంలో జన్యుపరమైన లోపాలను గుర్తించే సాంకేతికత. అదేవిధంగా, కుటుంబ చరిత్రలో ఏదైనా జన్యు పరమైన రుగ్మతలు కలిగిన స్త్రీలు PGTని ఉపయోగించవచ్చు. తద్వారా వారి సంతానం జన్యుపరమైన రుగ్మతలను వారసత్వంగా పొందే ప్రమాదాన్ని తొలగించవచ్చు.
• పిండంలో జన్యుపరమైన లోపాలను గుర్తిస్తుంది
• మంచి పిండాల ఎంపికలో సహాయపడుతుంది
• తల్లితండ్రుల నుంచి పిల్లలకు జన్యుపరమైన రుగ్మతలు సంక్రమించకుండా నిరోధించడంలో సహాయపడుతుంది
• గర్భందాల్చే సమయాన్ని, గర్భస్రావం అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది
ERA అనేది IVF ప్రక్రియలో స్త్రీ గర్భాశయంలోకి పిండాన్ని అమర్చడానికి ఉత్తమ సమయాన్ని గుర్తించడంలో సహాయపడే మరొక ముఖ్యమైన సాంకేతికత. ఇంప్లాంటేషన్ విండోను అంచనా వేయడానికి గర్భాశయ ఎండోమెట్రియంకి చెందిన జన్యువులను ERA తనిఖీ చేయడం వలన IVF విజయవంతమైన రేటు మెరుగుపడుతుంది (ఇంప్లాంటేషన్ విండోను అంటే గర్భాశయం పిండాన్ని స్వీకరించడానికి ఎక్కువగా అనుకూలమైన సమయం).
క్రమరహిత జీవనశైలి, జంక్ ఫుడ్ వినియోగం, వ్యాయామం లేకపోవడం, అనేక ఇతర కారణాల వల్ల క్యాన్సర్ అవకాశాలుపెరిగాయి. క్యాన్సర్, కీమోథెరపీ, రేడియేషన్ వంటి చికిత్సలు కూడా స్త్రీ సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయి. అలాంటప్పుడే ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్, క్యాన్సర్‌తో బాధపడుతున్న స్త్రీలకు క్యాన్సర్ చికిత్సకు ముందు వారిసంతానోత్పత్తిని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. తరువాత జీవితంలో తల్లిగామారే అవకాశం ఉంటుంది. స్త్రీ అండములు/పిండాలు/అండాశయ కణజాలాన్ని విట్రిఫికేషన్ అనే సాంకేతికత ద్వారా భద్రపరచవచ్చు. తద్వారా దాతల అండములు లేదా సరోగసీ కోసం వెళ్లే బదులు వారి సొంత పిల్లలను కలిగి ఉండవచ్చు.
చాలామంది మహిళలు విద్య, వృత్తిపై దృష్టి సారించి మాతృత్వమును వాయిదా వేస్తారు. కానీ స్త్రీ జీవగమనాన్ని ఎవరూ ఆపలేరు. మహిళలకు వయస్సుతోపాటు సంతానోత్పత్తి సామర్ధ్యం తగ్గుతుంది. స్త్రీలు పుట్టుకతోనే నిర్ణీత సంఖ్యలో అండములతో పుడతారు, అవి ప్రతి ఋతుచక్రంతో తగ్గిపోతుంది. స్త్రీకి 30 ఏళ్లు వచ్చే సరికి గర్భం దాల్చే సామర్థ్యం తగ్గిపోతుంది. వారి ప్రాధాన్యతల కారణంగా మాతృత్వమును ఆలస్యం చేయాలనుకునే స్త్రీలు వారి అండములు / అండాశయ కణజాలాన్ని భద్రపరచడం ద్వారా సంతానోత్పత్తిని కాపాడుకోవచ్చు. ఇది వారి సౌలభ్యం మేరకు తర్వాత మాతృత్వాన్ని పొందడానికి వీలుకల్పిస్తుంది.
ఆండ్రో లైఫ్ క్లినిక్‌లు పురుషులకు సంతానోత్పత్తి చికిత్సలకు వీలు కల్పిచడంతోపాటు గోప్యత, అవకాశం అందించే ప్రత్యేకమైన పురుష సంతానోత్పత్తి క్లినిక్‌లు. 50% వంధ్యత్వానికి పురుష సమస్య కారణమైనప్పటికీ, చాలామంది పురుషులు సంతానోత్పత్తి మూల్యాంకనాన్ని తిరస్కరిస్తారు. ఇంకా జాప్యంచేస్తారు. AndroLife అనేది పురుషులు తమ సంతానోత్పత్తి సమస్యలను ఆండ్రోలజిస్టులతో బహిరంగంగా చర్చించేలా ప్రోత్సహించడానికి, పితృత్వాన్ని ప్రసాదించే అధునాతన పురుష సంతానోత్పత్తి చికిత్సలను చేపట్టడానికి ప్రోత్సహించే ఒక ప్రత్యేక కార్యక్రమం. సంతానోత్పత్తి సంప్రదింపులు, చికిత్సను ఆలస్యం చేయడం వలన గర్భధారణపై హానికరమైన ప్రభావాలు ఉంటాయి.
మైక్రోఫ్లూయిడిక్స్, MACS (మాగ్నెటిక్ యాక్టివేటెడ్ సెల్ స్టార్టింగ్), TESA (టెస్టిక్యులర్ స్పెర్మ్ ఆస్పిరేషన్), మైక్రో-TESE (మైక్రో సర్జికల్ టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్ట్రాక్షన్) అనేవి శుక్రకణాల ఎంపిక.. వాటిని వెలికి తీయడంలో సహాయపడే అధునాతన విధానాలు. ఒయాసిస్ ఫెర్టిలిటీ కి సూక్ష్మ – TESEలో నైపుణ్యం ఉంది. ఇది శుక్రకణాల గణాంకము లేని పురుషులలో ఉపయోగించబడుతుంది. ఈ చికిత్స విధానం దేశంలోని అతితక్కువ కేంద్రాల ద్వారా మాత్రమే అందింస్తారు.
ఏదైనా IVF నమూనా జతకాకపోతే తల్లిదండ్రుల ఆనందాన్ని నాశనం చేస్తుంది. దీన్ని అర్థం చేసుకొని, ఒయాసిస్ ఫెర్టిలిటీ IVF ప్రక్రియ ప్రతి దశను గుర్తించే, పర్యవేక్షించే.. నమోదుచేసే అధునాతన ట్రాక్ మరియు ట్రేస్ సిస్టమ్ను ఉపయోగిస్తుంది. ఈ సాంకేతిక ద్వారా, లోపాలు, అసమతుల్యతల ప్రమాదం నిరోధించబడుతుంది. దీంతో దంపతులు వారి సొంత బిడ్డను పొందుతారు.
ARTis (సహాయక పునరుత్పత్తి సాంకేతిక సమాచార వ్యవస్థ) అనేది ఒయాసిస్ క్లౌడ్-ఆధారిత సాఫ్ట్వేర్, ఇది దంపతుల రికార్డులను నిర్వహిస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా నివేదికలను సులభంగా వెలికితీయగలదు. పరిశోధనలు, స్కాన్, విధానాలు, నివేదికలు మొదలైన వాటితో సహా అన్ని చికిత్సా ప్రక్రియలు ARTisలో నమోదుచేస్తారు. ఇది దంపతుల చికిత్స, ప్రతిదశపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటానికి సహాయపడుతుంది. తద్వారా పారదర్శకత ఉంటుంది.
ప్రతి స్త్రీకి, చికిత్స విధానం మారుతూ ఉంటుంది. సంతానోత్పత్తి నిపుణులు స్త్రీ వయస్సు, ఆరోగ్యస్థితి, వైద్య చరిత్ర, జీవనశైలి, ప్రమాదకారకాలు మొదలైన వాటి ఆధారంగా చికిత్స విధానాన్ని నిర్ణయిస్తారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ అనేది మహిళలు మాతృత్వాన్ని సాధించడంలో సహాయపడటానికి ఆహార మార్పులు, జీవనశైలి మార్పులతోపాటు ప్రత్యేక చికిత్సలతో సహా సమగ్ర విధానాన్ని అనుసరిస్తుంది.
ఒయాసిస్ ఫెర్టిలిటీ 2వ శ్రేణి, 3వ శ్రేణి నగరాల్లో సంతానోత్పత్తి శిబిరాలను నిర్వహించడం ద్వారా వంధ్యత్వం, అధునాతన సంతానోత్పత్తి చికిత్సల గురించి అవగాహన కల్పిస్తుంది. అదేవిధంగా, ఒయాసిస్ ఫెర్టిలిటీలోని సంతానోత్పత్తి నిపుణులు వెబ్నార్లు, టాక్షోలు, ఫేస్‌బుక్ లైవ్ వంటి మొదలైన వాటి ద్వారా దంపతులు సంతానోత్పత్తి చికిత్సలకు సిద్దపడటానికి, చర్చించడానికి ప్రోత్సహిస్తారు. ఒయాసిస్ ఫెర్టిలిటీ ప్రధాన నినాదం 2వ శ్రేణి, 3వ శ్రేణి నగరాల్లో విస్తరించడం, తద్వారా సంతానోత్పత్తి చికిత్సలను ఈ ప్రాంతాల్లోని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం.
“గత 45 సంవత్సరాలుగా జంటలకు సురక్షితమైన, మెరుగైన ఫలితాల పరంగా మేము IVF పరిశ్రమలో గొప్ప మైలురాళ్లను చేరుకున్నాము. విలువలు, పారదర్శకత మా ప్రధాన సూత్రాలు.. అనేక అధునాతన సాంకేతికతల ద్వారా IVF ప్రయాణంలో దంపతుల అనుభవాన్ని మెరుగుపరచడంపై మేము ఎల్లప్పుడూ దృష్టిపెడతాము. దంపతులకు వారి సొంత పిల్లలను కౌగలించుకొనే ఆనందాన్ని అందించడం మా ఆశయం.. మహిళల్లో వంధ్యత్వం పెరగడానికి జీవనశైలి మార్పులు ప్రధానకారణంగా మారాయి. సరైన సమయంలో సంతానోత్పత్తి చికిత్స మంచి ఫలితాన్ని ఇస్తుంది. కావున మహిళలు ఈ కళంకాన్ని ఛేదించడం చాలాకీలకం” అని వరంగల్ నగరలంలోని ఒయాసిస్ ఫెర్టిలిటీ, క్లినికల్ హెడ్ & ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ Dr. Jalagam Kavya Rao (జలగం కావ్యా రావు) చెప్పారు.
“ఊబకాయం, మధుమేహం, ధూమపానం, మద్యపానం, ఆలస్యంగా పిల్లల గురించి ప్రయత్నించడం మొదలైన అనేక కారణాల వల్ల భారతదేశంలో పురుషుల వంధ్యత్వం పెరుగుతోంది. మైక్రోఫ్లూయిడిక్స్ అనేది IVF ప్రక్రియ కోసం శుక్రకణాల ఎంపికలో సహాయపడే అధునాతన సాంకేతికత, ఇది విజయం రేటును పెంచుతుంది. MicroTESE వంటి అధునాతన స్పెర్మ్ రిట్రీవల్ టెక్నిక్ వల్ల చాలా తక్కువ శుక్రకణాల గణాంకం ఉన్న పురుషులు తండ్రులు కావచ్చు. ముఖ్యమైన విషయం ఏమిటంటే పురుషులు మేల్కొని వారి వంధ్యత్వ సమస్యలను బహిరంగంగా చర్చించాలి. స్త్రీలలో లేదా పురుషులలో కాలగమనాన్ని మనం ఆపలేము; కాబట్టి సరైన సమయంలో సరైన అడుగు వేయడం చాలా ముఖ్యం” అని ఒయాసిస్ ఫెర్టిలిటీకి చెందిన సైంటిఫిక్హెడ్ & క్లినికల్ ఎంబ్రియాలజిస్ట్ Dr. Krishna Chaitanya (కృష్ణ చైతన్య) చెప్పారు.