CT University 2023: దేశ యువత చూపు సీటీ యూనివర్సిటీ వైపు..! ఏపీ, తెలంగాణతోపాటు 30 దేశాల విద్యార్ధుల తొలి ఎంపిక

| Edited By: Janardhan Veluru

Jun 15, 2023 | 4:37 PM

సీటీ గ్రూప్ కన్వెన్షన్‌ అనతికాలంలోనే ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది. ఉన్నత విద్యను అందించడంతో నూతన పోకడలను అవలంభిస్తూ యువతను తీర్చిదిద్దుతూ వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది. సీటీయూ అందించే కోర్సులు, క్యాంపస్‌ వివరాలు..

CT University 2023: దేశ యువత చూపు సీటీ యూనివర్సిటీ వైపు..! ఏపీ, తెలంగాణతోపాటు 30 దేశాల విద్యార్ధుల తొలి ఎంపిక
CT University
Follow us on

పంజాబ్, సీటీ యూనివర్సిటీ: సీటీ గ్రూప్ కన్వెన్షన్‌ అనతికాలంలోనే ప్రపంచస్థాయి గుర్తింపు పొందింది. ఉన్నత విద్యను అందించడంతో నూతన పోకడలను అవలంభిస్తూ యువతను తీర్చిదిద్దుతూ వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది. సీటీయూ అందించే కోర్సులు, క్యాంపస్‌ వివరాలు, ప్లూస్‌మెంట్లు, ఆవిష్కరణలు, విజయ ప్రస్థానం ఒక్కసారి చూస్తే..

రెండు దశాబ్ధాలు విజయభేరి

సీటీ ఎడ్యుకేషనల్ సొసైటీ 1997లో స్థాపించారు. నాటి నుంచి గడచిన 2 దశాబ్ధాలుగా సీటీ గ్రూప్ ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్‌ నాణ్యమైన విద్య నందిస్తూ వరుస విజయాలు, ప్రశంసలను అందుకుంటోంది. సీటీయూ ఆధ్వర్యంలో జలంధర్‌లో రెండు మెగా క్యాంపస్‌లు, 2 స్కూళ్లు ఉన్నాయి. పంజాబ్‌లోని లూథియానాలో గ్లోబల్ యూనివర్సిటీ నడుస్తోంది. జ్ఞాన వృద్ధికి, స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌కు ఇది బెస్ట్‌ ప్లేస్‌. అటు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ఇన్నోవేషన్ ర్యాంకింగ్స్‌లో మొత్తం 9 వేల భారతీయ విద్యాసంస్థల్లో సీటీయూ 155వ ర్యాంక్‌లో నిలిచింది. సాంకేతికత, మౌలిక సదుపాయాలలో అధిక పెట్టుబడులు పెడుతూ.. విద్యార్థుల అభ్యాసనానికి అందుబాటులో ఉన్న ఉత్తమ వనరులను అందిస్తోంది. దేశంలోని టాప్‌ 30 యూనివర్సిటీలలో (ARIIA ర్యాంకింగ్స్‌) 2011లో సీటీ యూనివర్సిటీ గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఇక్కడ చదివే విద్యార్ధులకు దేశీ, విదేశీ స్థాయిల్లో టాప్‌ ఎమ్‌ఎన్‌సీ, కార్పొరేట్‌ సంస్థల్లోనూ రూ.51 లక్షల ప్యాకేజీతో వంద శాతం ప్లేస్‌మెంట్‌లు కల్పిస్తోంది. ‘ఎర్న్ వైల్ యు లెర్న్’ ప్రోగ్రామ్ ద్వారా జాబ్స్‌ అందిస్తోంది.

Ct University

సీటీయూ అందించే కోర్సుల వివరాలు..

అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ స్థాయిల్లో పలు రకాల కోర్సులను అందిస్తోంది. మేనేజ్‌మెంట్ నుంచి హాస్పిటాలిటీ, ఇంజనీరింగ్ నుంచి ఫ్యాషన్ డిజైన్ వరకు దాదాపు 100 కంటే ఎక్కువ ప్రోగ్రాంలు విద్యార్ధులకు అందుబాటులో ఉంచింది. విద్యార్ధులకు వర్ధమాన సాంకేతికతను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయడానికి ఐబీఎమ్‌తో కార్పొరేట్ సంస్థతో టై-అప్‌ అయ్యింది. తద్వారా అత్యంత నైపుణ్యం కలిగిన వందల గ్రాడ్యుయేట్లను, ఐటీ నిపుణులను యేటా ఉత్పత్తి చేస్తోంది. ఐబీఎమ్‌ స్పెషలైజేషన్‌లతో బీటెక్‌, బీసీఏ, బీబీఏ, ఎమ్‌సీఏ, ఎమ్‌బీఏ కోర్సులను అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

సీటీయూ అందించే కోర్సుల ప్రత్యేకత

ఐబీఎమ్‌ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ ద్వారా ఏఐ, మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్‌ల్లో శిక్షణ పొందిన ఫ్యాకల్టీ బోధిస్తారు. పియర్సన్ పరీక్షల ఆధారంగా విద్యార్థులను మూల్యాంకనం చేస్తారు. అనంతరం డిజిటల్ బ్యాడ్జ్‌లు, సర్టిఫికెట్లు అందజేస్తారు. ప్రాజెక్ట్‌లు, అసైన్‌మెంట్లు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్ధులకు కోర్సు పూర్తైన తర్వాత 3 గ్లోబల్ ఇ-సర్టిఫికేట్‌లను అందిస్తుంది. అందువల్లనే ఇతర యూనివర్శిటీల యూజీలు, పీజీల కంటే ఇక్కడి ప్లేస్‌మెంట్‌లు, ప్యాకేజీలు చాలా మెరుగ్గా ఉంటాయి. అటు పారామెడికల్, హెల్త్‌కేర్, ఫార్మసీ రంగాల్లో శంకర ఐ హాస్పిటల్, మాక్స్ హాస్పిటల్ వంటి ప్రముఖ ఆసుపత్రులతో టై-అప్‌ కుదుర్చుకొంది. అలాగే యేటా 32 కోట్ల విలువైన స్కాలర్‌షిప్‌లు, టాప్‌ ప్లేస్‌మెంట్ రికార్డులు, అంతర్జాతీయ క్యాంపస్, రెసిలెంట్ ఫ్యాకల్టీ, ఆధునిక మౌలిక సదుపాయాలతో సీటీయూ అత్యుత్తమ విద్యను అందిస్తోంది. సీటీయూ విద్యాసంస్థల్లో చదివిన లక్ష మందికిపైగా విద్యార్ధులు ప్రపంచ దేశాల్లో కొలువులు సొంతం చేసుకున్నారు.

వినూత్న ఆవిష్కరణలు, పరిశోధన పట్ల నిబద్ధతతో రోబోటిక్స్, ఆటోమేషన్ ల్యాబ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ వంటి 24/7 ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు సీయూ యూనివర్సిటీలో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు వారి కలల ప్రాజెక్ట్‌లను రూపొందించడానికి, ఆవిష్కరించడానికి తమ తోడ్పాటును అందిస్తోంది. తద్వారా స్మార్ట్ వ్యవసాయ రోబోట్లు, రోబోటిక్ స్పైడర్‌లు, రోబోటిక్ చేతులు వంటి ఎన్నో ఆవిష్కరణలు ఔత్సాహిక విద్యార్ధులు సృష్టిస్తున్నారు. మెరుగైన సమాజం, మానవజాతి ఉన్నతి, పర్యావరణానికి మేలు చేసే సాంకేతికతలు, ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి విద్యార్థులను ప్రోత్సహిస్తోంది.

కేవలం సాంకేతికత, పారామెడికల్, హెల్త్‌కేర్, ఫార్మసీ స్పెషలైజేషన్లలో మాత్రమేకాకుండా సివిల్‌ సర్వెంట్లను కూడా తయారు చేయడంలో సీయూటీ మేటీ. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అవ్వాలనే యువత కలలను నెరవేర్చడంతో అవసరమైన నైపుణ్యాలు అందిస్తోంది. విద్యార్ధులకు ఉచిత గైడెన్స్‌, ఇంటర్నెట్ సేవలు, ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. యూనివర్సిటీలో దాదాపు 500 మందికి పైగా అనుభవం కలిగిన ఫ్యాకల్టీ సభ్యులు ఉన్నారు. గడచిన యేళ్లలో 80కిపైగా జర్నల్స్‌, 73 పేటెంట్లను పొందింది.

సీటీ యూనివర్సిటీ క్యాంపష్ విశేషాలు..

సుమారు 50 ఎకరాల స్థలంలో క్యాంపస్ విస్తరించి ఉంది. 30కిపైగా దేశాలకు చెందిన విద్యార్ధులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. మన దేశంలోని 28 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పలు రకాల కోర్సుల్లో చదువుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి 200 మందికిపైగా విద్యార్ధులు ఇక్కడ చదువుతున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా సౌత్ ఇండియన్ మెస్ సీటీయూ నడుపుతోంది. తెలుగు విద్యార్ధుల కోసం విజయవాడ, హైదరాబాద్‌లో సీటీ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. కోర్సు ఎంపికలు, అడ్మిషన్ ప్రమాణాలు, ఉద్యోగ అవకాశాలు వంటి ఇతర వివరాలు ఆయా సెంటర్లలో అనుభవజ్ఞులైన కౌన్సెలర్‌ అందిస్తారు. ఇలాంటి బెస్ట్‌ యూనివర్సిటీలో చదివిన వారిదే రేపటి బంగారు భవిష్యత్తు. సీయూటీలో 2023-24 అకడమిక్‌ సంవత్సరంలో అడ్మిషన్లు పొందేందుకు దేశ వ్యాప్తంగా యువత పరుగులు తీస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.