YS Sharmila – Bonalu: ఆషాడ మాస బోనాల సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల బోనమెత్తారు. మొయినాబాద్ మండలంలోని పెద్ద మంగళవారం గ్రామంలోని తన చిన్ననాటి స్నేహితురాలు రజిని నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల బోనాల ఉత్సవాలల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ప్రతి ఏటా నిర్వహించే ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి బోనం సమర్పించానని షర్మిల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బోనాల పండుగతో పాటు స్నేహితుల దినోత్సవం కావడంతో ఫ్రెండ్ ఇంటికి వచ్చినట్లు షర్మిల చెప్పారు. షర్మిల వెంట కొండా రాఘవ రెడ్డి, ఏపూరి సోమన్న తదితరులు ఉన్నారు.
కాగా, తెలంగాణలో బోనాల ఉత్సావ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. పాతబస్తీలోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. ఆడపడుచులు అమ్మవారికి బోనాలు, సాక సమర్పిస్తున్నారు.
Read also: ‘సీఎం పదవి కోసం ముసలివాళ్లను కూడా మోసం చేసిన ఘనత అతనిదే.. నవరత్నాల పేరుతో నవనామాలు పెట్టారు’