Yadagiri Gutta: తెలంగాణ (Telangana) ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (Sri Lakshami Narasimha Swamy) దేవస్థానంలో అడ్డగోలు చార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోసారి యాదాద్రి భక్తులకు ఆలయాధికారులు షాక్ ఇస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి కొండపైకి వాహనాల అనుమతి లేదంటూ.. వాహననాల రాకపోకలపై భారీగా చార్జీలను వడ్డించారు. కొండపైకి అనుమతించే భక్తుల టూ వీలర్స్ పార్కింగ్ కు భారీగా చార్జీలను వసూలు చేయనున్నారు.
ఇక నుంచి కొండపై పార్క్ చేసే టూవీలర్ కు మొదటి గంటకు రూ. 500 లను వసూలు చేయనున్నారు. మొదటి గంట అనంతరం అదనంగా వాహనం ఉండే ప్రతి ఒక్క గంటకు వంద రూపాయల చొప్పున చార్జీలు వసూలు చేయడానికి దేవస్థానం అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. టూవీలర్స్ ను కొండపైకి అనుమతిస్తూ.. అడ్డగోలు చార్జీలను దేవస్థానం విధిస్తోందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా పార్కింగ్ టిక్కెట్ల ధరలపై మండిపడుతున్నారు. అయితే ఆలయ పునర్నిర్మాణం తర్వాత కొండపైకి వాహనాలను దేవస్థానం అనుమతించని సంగతి తెలిసిందే. అయితే తాజాగా పార్కింగ్ పేరుతో భక్తులకు భారీ వడ్డనలతో కొండపైకి భక్తుల వాహనాలను దేవస్థానం అనుమతినిస్తోంది.
Viral Video: అద్భుతమైన దృశ్యం.. దేవ దూతలా దివి నుంచి భువికి దిగిన తెల్లని నెమలి.. వీడియో వైరల్