Yadadri: యాదాద్రి ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారు.. ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు

|

Mar 16, 2022 | 3:56 PM

తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పునర్నిర్మాణం చేపడుతున్న యాదాద్రి (Yadadri) లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 28 న మధ్యాహ్నం 12.11 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ...

Yadadri: యాదాద్రి ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారు.. ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు
Yadadri Temple Gopuram
Follow us on

తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పునర్నిర్మాణం చేపడుతున్న యాదాద్రి (Yadadri) లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉద్ఘాటనకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 28 న మధ్యాహ్నం 12.11 గంటలకు మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నట్ల ఆలయ అధికారులు తెలిపారు. 21న ఉదయం 9 గంటలకు విశ్వక్సేనుడికి తొలిపూజ, స్వస్తిపుణ్యాహ వాచన మంత్ర పఠనాలతో స్వయంభు పంచనారసింహుడి ప్రధానాలయ ఉద్ఘాటన, మహాకుంభ సంప్రోక్షణ పర్వాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉద్ఘాటన పర్వాలు 28న మధ్యాహ్నం 12.11 గంటలకు మిథున లగ్నం సుముహూర్తంలో మహాకుంభాభిషేకం, సాయంత్రం 6 గంటలకు శాంతి కల్యాణంతో ముగియనున్నాయి. అనంతరం సామాన్య భక్తులకు గర్భాలయంలో కొలువుదీరిన పాంచనారసింహుల దర్శనాలు కల్పించనున్నారు. ప్రధానాలయ పనులు పూర్తికావడంతో ప్రభుత్వం మహాకుంభ సంప్రోక్షణ తేదీని ఖరారు చేసింది. ఉద్ఘాటన పర్వాలు ఈనెల 21 నుంచి పాంచరాత్రాగమ శాస్త్ర పద్దతిలో జరగనున్నాయి.

ఆలయ ఉద్ఘాటనకు మరో ఆరు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఏర్పాట్ల పూర్తి చేయడంలో అధికారులు నిమగ్నమయ్యారు. బాలాలయ గడపలోనే ఉద్ఘాటన వేడుకలు నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు.. ఇందు కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. దీంతో బాలాలయంలో భక్తులు నిర్వహించుకునే మొక్కు పూజలు, శాశ్వత సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవాలు, కల్యాణాలు, వెండిజోడుసేవలను బుధవారం నుంచి రద్దు చేయాలని అధికారులు నిర్ణయించారు. మంగళవారం నిర్వహించిన ఆర్జిత సేవలే బాలాలయంలో చివరివి అయ్యాయి.

Also Read

Bellamkonda Suresh: బెల్లంకొండ సురేష్, శరన్‌ల వివాదానికి ఎండ్ కార్డు.. అకౌంట్స్ సెటిల్ చేసుకున్నామన్న శరన్

Gold Seized: ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. కటకటాల పాలయ్యాడు.. ఢిల్లీ విమానాశ్రయంలో..

Stealth Omicron Variant: చైనాను వణికిస్తున్న మరో కొత్త వేరియంట్‌.. 13 నగరాల్లో లాక్‌డౌన్‌