Telangana: తెలంగాణలోని ప్రముఖపుణ్యక్షేత్రం యాదాద్రి(Yadadri) శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి(Sri Lakshami narasimha) ఆలయ దర్శనం భక్తులందరికీ ఈనెల 28 నుంచి కలుగనుంది. ఈ మేరకు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 28న ఉదయం 11గంటల 55 నిమిషాలకు మహకుంభ సంప్రోక్షణతో ప్రధాన ఆలయం పునః ప్రారంభం కానుంది. యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ అనంతరం మూలవిరాట్ దర్శనానికి అనుమతిస్తామని యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. మహా కుంభ సంప్రోక్షణ అనంతరం పూజా కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. బాలాలయంలోని స్వామివారి ఉత్సవ మూర్తులను శోభాయాత్రగా ప్రదానాలయంకు తరలింపు చేపడతామని చెప్పారు, అయితే పూజల సమయంలో దర్శనానికి భక్తులను అనుమతించడం లేదని ఈవో స్పష్టం చేశారు. ఆ రోజు మధ్యాహ్నం తర్వాతే భక్తులకు దర్శనానికి అనుమతినిస్తామని తెలిపారు.
ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఇక ఈనెల 21 నుంచి 7 రోజుల పాటు బాలాలయంలో పంచ కుండాత్మక యాగం నిర్వహించనున్నామని యాదాద్రి ఆలయ ఈఓ గీతా రెడ్డి చెప్పారు. 108 పారాయణదారులు, ఆలయ అర్చక బృందంతో ఈ క్రతువును నిర్వహించనున్నారు. ఇప్పటికే యాదాద్రి ఆలయ గోపురాల కలశాల సంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తి చేశామని.. చెప్పారు. స్వామివారికి కైంకర్యాలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు జియో ట్యాగింగ్ ని ఉపయోగిస్తామని తెలిపారు గీతరెడ్డి.
Also Read:
Bangladesh: ఇస్కాన్ టెంపుల్‌పై 200 మంది దాడి.. విగ్రహాలను అపవిత్రం చేసి డబ్బు, నగలు దోచుకెళ్లిన మూక
Tirumala: తిరుమలలో అన్నమయ్య ప్రాజెక్టుకు పూర్వ వైభవాన్ని తీసుకుని రావాలని అన్నమయ్య వంశీకుల విజ్ఞప్తి