తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో హుండీ ఆదాయం భారీగా పెరిగింది. ఆలయ ఖజానాకు భక్తుల నుంచి 19 రోజుల్లో రూ.2.28కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. ఈ నెల 11నుంచి 29వ తేదీవరకు నృసింహుడిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇతర పూజా, సేవా కార్యక్రమాలు, ప్రసాదం రుసుముల తర్వాత గత 19 రోజుల్లో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంకు హుండీ ఆదాయం సమకూరింది.
భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు. 2 కోట్ల 28 లక్షల 25 వేల 714 రూపాయల నగదు, 95 గ్రాముల బంగారం, 3.700కిలోల మిశ్రమ వెండి ఆలయ ఖజానాలో జమచేసినట్లు ఈవో గీతారెడ్డి తెలిపారు. 657 అమెరికా డాలర్లు, 15 ఆస్ట్రేలియా డాలర్లు, 15 కెనడా డాలర్లు, 12 సింగపూర్ డాలర్లు, 40 సింగపూర్ దిన్హార్స్, 57మలేషియా రింగెట్స్‌లో పాటు పలు విదేశీ కరెన్సీని భక్తులు హుండీల్లో సమర్పించారని తెలిపారు. సత్యనారాయణస్వామి మండపంలో నిర్వహించిన కానుకల లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి పర్యవేక్షించారు.
టికెట్లు, నిత్య పూజలు, లడ్డూలు, విరాళాలు, హుండీ సేకరణ, కల్యాణోత్సవాలు, ఫిక్స్ డ్ డిపాజిట్లు వంటి వాటి ద్వారా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి రోజువారీ ఆలయం ఆదాయంలో భారీ పెరుగుదల కనిపిస్తోంది. హుండీ ఆదాయంతోపాటు మొత్తంగా ఆలయ వార్షిక ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరణ చేసి అనేక సౌకర్యాలు కల్పించడంతో పాటు రవాణా, వసతి సహా అనేక సౌకర్యాలు పెంచడం వలన భక్తుల సంఖ్య భారీగా పెరగమే దీనికి కారణం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..