వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన యాదాద్రి.. ఉట్టి పడుతున్న ఆధ్యాత్మిక శోభ.. పూర్తి వివరాలివే

|

Mar 04, 2022 | 8:51 PM

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి(Yadadri) శ్రీ లక్ష్శీ‌ న‌ర‌సిం‌హ‌స్వామి ఆలయ వార్షిక బ్రహ్మో‌త్సవా‌లకు ఆలయం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 14 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సారి కూడా..

వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన యాదాద్రి.. ఉట్టి పడుతున్న ఆధ్యాత్మిక శోభ.. పూర్తి వివరాలివే
Yadadri Temple
Follow us on

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి(Yadadri) శ్రీ లక్ష్శీ‌ న‌ర‌సిం‌హ‌స్వామి ఆలయ వార్షిక బ్రహ్మో‌త్సవా‌లకు ఆలయం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 14 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ సారి కూడా బాలా‌ల‌యం‌లోనే ఉత్సవాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. స్వస్తివ‌చ‌నంతో ఉత్సవాలు ప్రారం‌భమై 14న శత‌ఘ‌టా‌భి‌షే‌కంతో పూర్తి కానున్నాయి. యాదాద్రీశుడి ఆలయంలో ఏటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు(Brahmotsavalu) ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలతో 11 రోజుల పాటు స్వామిక్షేత్రం ముక్కోటి దేవతలకు విడిదిగా మారుతుందని అర్చకులు చెబుతున్నారు. ఈ సందర్భంగా సకల దేవతలను శాస్ర్తోక్తంగా ఆహ్వానించడం సాంప్రదాయంగా వస్తోందని వివరించారు. విశ్వక్సేన పూజలతో మొదలైన ఉత్సవాలు స్వయంభువులకు నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంతో పరిపూర్ణం అవుతాయి. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి బ్రహోత్సవాలు 1955లో ప్రారంభమయ్యాయి. ఆ కాలంలో ఘాట్‌రోడ్డు లేకపోవడం, మెట్లదారి అంతంత మాత్రంగానే ఉండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. రాయగిరి(Rayagiri) వరకు వివిధ వాహనాల ద్వారా వచ్చి, అక్కడి నుంచి టాంగాలు, ఎడ్ల బండ్ల సహాయంతో కొండపైకి చేరుకునేవారు. 1985లో యాదగిరిగుట్ట మండలంగా ఏర్పాటు కావడం, అంతకు ముందు 1978లో ఆర్టీసీ బస్‌ డిపో ఏర్పాటు చేయడంతో ప్రయాణ సౌకర్యం మెరుగుపడింది. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వందల కోట్ల వెచ్చించి ఆలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.

సంప్రోక్షణకు సిద్ధమవుతున్న యాదాద్రి..

యాదాద్రి దివ్యక్షేత్రం మహాకుంభ సంప్రోక్షణకు ముస్తాబవుతోంది. పునర్నిర్మాణ పనులు తుదిదశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే కొండపైన ప్రధాన ఆలయం భక్తుల దర్శనాలకు సిద్ధమైంది. కృష్ణ శిలలతో లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. క్యూలైన్లు భక్తిభావం ఉట్టిపడేలా స్వర్ణకాంతులీనుతోంది. కొండపైన, దిగువన పచ్చదనం పరచుకుని ప్రకృతి సోయగాలు సంతరించుకున్నాయి. భక్తులకు మరపురాని మధురానుభూతి పంచేలా యాదాద్రిని తీర్చిదిద్దుతున్నారు. స్వయంభువుల దర్శనాలకు చకచకగా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ దిగువన పెద్దఎత్తున పనులు జరుగుతున్నాయి. విశాలమైన రహదారుల నిర్మాణంతో పాటు పచ్చదనం, సుందరీకరణ పనులు నిర్విరామంగా సాగుతున్నాయి.

Also Read

Shane Warne Death: క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ కన్నుమూత.. దిగ్భ్రాంతికి గురైన క్రికెట్ ప్రేమికులు

People March: రైతు కేంద్రంగా కాంగ్రెస్ పోరుబాట.. 6వ రోజుకు చేరిన సీఎల్పీ నేత పీపుల్స్ మార్చ్

Bank Offers : పొదుపు చేయాలను కుంటున్నారా? ఈ బ్యాంకుల్లో ఇంట్రస్ట్ రెండింతలు వస్తుంది..