ప్రపంచంలోనే మొదటిసారిగా వివాహం ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలుసా..!

|

Aug 14, 2024 | 12:29 PM

హరిద్వార్‌లోని పురాతన నగరమైన కంఖాల్‌లో ఉన్న దక్షేశ్వర మహాదేవ ఆలయం. ఇది లయకారుడైన శివుని అత్తమామల ఇల్లు. విశ్వం సృష్టి సత్యయుగంలో దక్షేశ్వర మహాదేవ ఆలయం ప్రతిష్టించబడింది. ఇది విశ్వంలోని మొదటి వివాహ వేదిక. ఇది విశ్వంలోని మొట్టమొదటి స్వయం భూ శివలింగం. దీని ప్రభావం 1000 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

ప్రపంచంలోనే మొదటిసారిగా వివాహం ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలుసా..!
Daksheswar Mahadev Temple
Follow us on

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వివిధ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకుంటారు. అదేవిధంగా హిందూ సంతాన ధర్మంలో కూడా వివాహం అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధంగా పరిగణించబడదు.. రెండు కుటుంబాల కలయికగా కూడా పరిగణించబడుతుంది. హిందూ మతంలో వివాహ సంబంధాలను చాలా పవిత్రంగా భావిస్తారు. అయితే ప్రపంచంలో ఎవరి వివాహం.. మొదటిసారిగా ఎప్పుడు ఎక్కడ జరిగిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ప్రపంచంలో మొదటి వివాహం జరిగిన ప్రాంతం… భారతదేశంలో శివుని ఆలయం ఉంది.

ఎవరు మొదట వివాహం చేసుకున్నారు?

దక్షేశ్వర మహాదేవ ఆలయం ప్రధాన పూజారి మహంత దిగంబర స్వామి విశ్వేశ్వర పూరీ మహారాజ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే మొదటి వివాహం శివపార్వతులది అని చెప్పారు. సృష్టి ప్రారంభమైనప్పుడు శివుడు, సతీదేవిల వివాహం జరిగిందని అతను చెప్పాడు. ఆ వివాహ రాత్రినే శివ వివాహ రాత్రి లేదా శివరాత్రి అంటారు.

ఇవి కూడా చదవండి

ఆ ప్రాతం ఎక్కడ ఉందంటే?

ఉత్తరాఖండ్‌లోని హిందువులు పవిత్రంగా భావించే నగరం హరిద్వార్. హిందువుల విశ్వాసానికి ప్రధాన కేంద్రం. హరిద్వార్‌లోని పురాతన నగరమైన కంఖాల్‌లో ఉన్న దక్షేశ్వర మహాదేవ ఆలయం. ఇది లయకారుడైన శివుని అత్తమామల ఇల్లు. విశ్వం సృష్టి సత్యయుగంలో దక్షేశ్వర మహాదేవ ఆలయం ప్రతిష్టించబడింది. ఇది విశ్వంలోని మొదటి వివాహ వేదిక. ఇది విశ్వంలోని మొట్టమొదటి స్వయం భూ శివలింగం. దీని ప్రభావం 1000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ సిద్ధ పీఠం 1000 కిలోమీటర్ల విస్తీర్ణం తీర్థయాత్ర నగరంగా పిలువబడుతుంది.

శ్రావణ మాసంలో శివుడు నివసించే ప్రాంతం

కంఖల్ అనేది శివారాధన స్థలం. సతీదేవి జన్మస్థలం. అత్యంత పవిత్ర పూజా స్థలం. దక్షుడు తెగిన మొండెం రూపంలో తను ఇక్కడ నివసిస్తానని శివుడు తన మామగారైన దక్షునికి ఈ వరం ఇచ్చాడు. తనను ఇక్కడ దక్షుడు పేరుతో కలిపి పిస్తారని చెప్పాడు. అంతేకాదు సతీదేవి లేని లోటును తీర్చడానికి శ్రావణ మాసంలో శివుడు ఇక్కడ కొలువై ఉంటాడని నమ్మకం.

శివుని జలాభిషేకం

శివుడు చంద్రుడు, గంగ రెండింటినీ తలపై ధరించింది ఇక్కడే..కనుక సోమవారం రోజున గంగాజలంతో శివునికి జలాభిషేకం చేయడం విశేష ఫలితాలు ఇస్తాడని నమ్మకం. శివుని జలాభిషేకం చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఈ ఆలయానికి వస్తుంటారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు