Shani Dev: ఆర్ధిక, మానసిక సమస్యల నివారణకు.. శనివారం శనీశ్వరుడికి ఈ నూనెతో పూజ చేయండి… అద్భుతం ఫలితం మీ సొంతం

|

Jan 08, 2022 | 3:40 PM

Saturday Shanidev Puja: శనివారం శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా హిందువులు భావిస్తారు. శనీశ్వరుడిని కర్మ ప్రదాత అని భక్తుల నమ్మకం. అంతేకాదు శనీశ్వరుడికి కోపం వస్తే..

Shani Dev: ఆర్ధిక, మానసిక సమస్యల నివారణకు.. శనివారం శనీశ్వరుడికి ఈ నూనెతో పూజ చేయండి... అద్భుతం ఫలితం మీ సొంతం
(రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
Follow us on

Saturday Shanidev Puja: శనివారం శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా హిందువులు భావిస్తారు. శనీశ్వరుడిని కర్మ ప్రదాత అని భక్తుల నమ్మకం. అంతేకాదు శనీశ్వరుడికి కోపం వస్తే.. ఆ వ్యక్తి భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుంది. ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయినా నేలమీదకు దిగి వచ్చేలా చేస్తాడు ఇలా చేయడానికి ఎక్కువ సమయం తీసుకోడు అని భక్తుల నమ్మకం. అందుకనే శనివారం రోజున శనీశ్వరుడిని తాము తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించి తమను కరుణతో చూడమని వేడుకుంటారు.

ముఖ్యంగా శనీశ్వరుడిని ఆవ నూనెతో పూజిస్తారు. శనీశ్వరుడికి ఆవ నూనెతో అభిషేకం చేస్తారు. కొంతమంది ఆవనూనె దీపాన్ని కూడా వెలిగిస్తారు. అయితే శనీశ్వరుడికి ఆవనూనె ఎందుకు అంత ఇష్టం.. ఈ ప్రశ్న కూడా తప్పక వస్తుంది. వాస్తవానికి దీనికి సంబంధించిన ఒక పురాణం ఉంది. ఈరోజు శనీశ్వరుడికి ఆవనూనెకు గల సంబంధం గురించి తెలుసుకుందాం..

పురాణ కథనం: 
రామాయణ కాలంలో ఒకసారి.. శనీశ్వరుడు తన బలం, శక్తిని గురించి తలచుకుని గర్వపడ్డాడు. అదే సమయంలో హనుమంతుడి పరాక్రమం నాలుగు దిక్కులకూ వ్యాపించింది. హనుమంతుని శక్తి గురించి శనీశ్వరుడికి తెలిసింది. దీంతో శనీశ్వరుడు.. హనుమంతునితో యుద్ధం చేయడానికి వెళ్తాడు. అప్పుడు తన ప్రభువు శ్రీరాముని భక్తితో ధ్యానం చేస్తున్న హనుమంతుడిని శనీశ్వరుడు చూశాడు.

హనుమంతుడిని తనతో యుద్ధం చేయమంటూ శని సవాల్ చేశాడు. హనుమంతుడు .. శనిని యుద్ధం వద్దంటూ వారించాడు. అయినప్పటికీ శనీశ్వరుడు యుద్ధం చేయాల్సిందే అంటూ పట్టుబట్టడంతో.. ఇరువురు యుద్ధానికి దిగారు.  ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది.

ఈ యుద్ధంలో శనిదేవుడు హనుమంతుని చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. ఆంజనేయ స్వామి కొట్టిన దెబ్బలకు శనీశ్వరుడు శరీరమంతా గాయపడింది.. నొప్పితో ఇబ్బంది పడ్డాడు. అప్పుడు హనుమంతుడు.. శనీశ్వరుడి దెబ్బలకు  ఆవనూనె పూసాడు. దీంతో శనీశ్వరుడి ఒళ్ళు నొప్పులు, దెబ్బలు మాయం అయ్యాయి. అప్పుడు శనీశ్వరుడు ఇక నుంచి ఎవరైతే.. హృదయపూర్వకంగా తనకు ఆవ నూనె సమర్పిస్తారో.. వారు అన్ని కష్టాల నుంచి విముక్తి పొందుతారని వరం ఇచ్చాడు. అప్పటి నుండి శని దేవుడికి ఆవాల నూనె సమర్పించే సంప్రదాయం మొదలైంది.

శనివారం నాడు తనకు ఆవాల నూనెను సమర్పించే భక్తులను శనీశ్వరుడు ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారని నమ్మకం. అటువంటి వ్యక్తుల శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శనీశ్వరుడి దయతో.. శని మహాదశ ప్రభావం తగ్గుతుంది.

Also Read:

Zodiac Signs: ఈ రాశుల వారు పొదుపు చేయడంలో నిష్ణాతులు, వృధా ఖర్చులను ఇష్టపడరు..