చనిపోయిన వారి బట్టలు మనం ధరించకూడదా..? వారి వస్తువులు వాడితే ఏమవుతుందో తెలుసా.?

|

May 05, 2023 | 4:15 PM

ఒకరి మరణానంతరం వివిధ ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తారు. అయితే కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. చనిపోయిన వారి బట్టలు వేసుకోకూడదని, వారి వస్తువులను, వారికీ సంబంధించిన వాటిని ఇంట్లో ఉంచకూడదని నమ్ముతుంటారు. అయితే, ఇలా ఎందుకు చెబుతారు. చనిపోయిన వారి బట్టలు, వస్తువులు ఉపయోగిస్తే ఏం జరుగుతుంది..

చనిపోయిన వారి బట్టలు మనం ధరించకూడదా..? వారి వస్తువులు వాడితే ఏమవుతుందో తెలుసా.?
Clothes Of Dead People
Follow us on

హిందూమతంలో, మరణం ముగింపు కాదని నమ్ముతారు.. ఎందుకంటే హిందువులు పునర్జన్మను నమ్ముతారు. మరణించిన వ్యక్తి ఆత్మ మరొక శరీరంలో పునర్జన్మ పొందుతుందని నమ్మకం. ఇక్కడ ఒకరి మరణానంతరం వివిధ ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తారు. అయితే కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. చనిపోయిన వారి బట్టలు వేసుకోకూడదని, వారి వస్తువులను, వారికీ సంబంధించిన వాటిని ఇంట్లో ఉంచకూడదని నమ్ముతుంటారు. అయితే, ఇలా ఎందుకు చెబుతారు. చనిపోయిన వారి బట్టలు, వస్తువులు ఉపయోగిస్తే ఏం జరుగుతుంది.. దీనికి గల కారణలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా అది మన మంచి కోసమే అయ్యుంటుంది. మరణించిన వ్యక్తి వస్తువులను దానం చేయడం ఉద్దేశ్యం ఏమిటంటే, మనం వారితో అనుబంధాన్ని వదులుకోమని మన మనసుకి తెలిసేలా చేయటం. వారు లేని జీవితంలో మనం ముందుకు సాగాలని, వారి జీవిత ప్రయాణం మనతో ముగిసిందని, ఇప్పుడు వెళ్లిపోయిన వారి ఆత్మ మనల్ని మరచిపోయి వారి తదుపరి పునర్జన్మకు వెళ్లాలని చెప్పడమే దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యం.

లేదంటే చనిపోయిన వ్యక్తి దుస్తులను పదే పదే ధరించడం వల్ల నిరాశకు లోనవుతారు. వాటిని చూసిన ప్రతిసారీ ఆనాటి ఘోరమైన నష్టాన్ని గుర్తుకు తెస్తుంది. అందువల్ల, మరణించిన వారి దుస్తులను ధరించకుండా ఉండటం మంచిది. జ్యోతిష్యం కూడా ఇదే చెబుతోంది.

ఇవి కూడా చదవండి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మరణించిన వారి దుస్తులను దానం చేయాలి. ఎందుకంటే వారి దుస్తులను దానం చేయడం వల్ల మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని నమ్ముతారు. దాతలకు దీవెనలు కలిగించే ఉదాత్తమైన కార్యంగా భావిస్తారు. మీ ప్రియమైన వ్యక్తి మరణిస్తే..ఆ వ్యక్తి దుస్తులను దానం చేయడం వారి జ్ఞాపకాన్ని గౌరవించే మార్గం. అదే సమయంలో ఒక మంచి పని చేయడానికి ఇది ఒక మార్గంగా జ్యోతిష్యం చెబుతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..