Temple Bell: ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే గంట మోగించే సంప్రదాయం.. దీని వెనుక సైన్టిఫిక్ రీజన్ ఏమిటో తెలుసా..

ఇంటిలోని పూజ గదిలో పూజ సమగ్రాలో ఖచ్చితంగా గంట ఉంటుంది. అదే సమయంలో, ఆలయాలలో చిన్న, పెద్ద గంటలు కూడా ఏర్పాటు చేయబడతాయి. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ముందుగా గంట మోగిస్తారు. దేశంలో ఉన్న దేవాలయాల్లోనైనా విదేశాల్లో ఉన్నా హిందూ దేవాలయాలలో ఖచ్చితంగా గంట ఏర్పాటు చేస్తారు. ఇలా గుడిలో గంటలు మోగించే సంప్రదాయం ఈ నాటిది కాదు.. కొన్ని శతాబ్దాల నాటిది.

Temple Bell: ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే గంట మోగించే సంప్రదాయం.. దీని వెనుక సైన్టిఫిక్ రీజన్ ఏమిటో తెలుసా..
Bell In Temple

Updated on: Jun 15, 2023 | 7:43 PM

హిందూ సనాతన ధర్మంలో పూజకు ఎంత ప్రాముఖ్యత ఉందో గంట మోగించడానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. దేవాలయాల్లోనైనా, ఇంట్లో నైనా పూజ ముగించిన అనంతరం హారతి ఇచ్చే సమయంలో గంట మోగిస్తారు. ఇంటిలోని పూజ గదిలో పూజ సమగ్రాలో ఖచ్చితంగా గంట ఉంటుంది. అదే సమయంలో, ఆలయాలలో చిన్న, పెద్ద గంటలు కూడా ఏర్పాటు చేయబడతాయి. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే ముందుగా గంట మోగిస్తారు. దేశంలో ఉన్న దేవాలయాల్లోనైనా విదేశాల్లో ఉన్నా హిందూ దేవాలయాలలో ఖచ్చితంగా గంట ఏర్పాటు చేస్తారు. ఇలా గుడిలో గంటలు మోగించే సంప్రదాయం ఈ నాటిది కాదు.. కొన్ని  శతాబ్దాల నాటిది. అయితే గుడి అడుగు పెట్టిన వెంటనే ముందుగా చేసే పని గంట కొట్టడం.. ఇలా గంట ఎందుకు కొడతారో ఈ రోజు తెలుసుకుందాం..

హిందూ మత విశ్వాసం ప్రకారం.. ఆలయంలో అడుగు పెట్టిన వెంటనే గంట మోగించడం వల్ల దేవుని విగ్రహంలో చైతన్యం వస్తుంది. ఈ సమయంలో పూజలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అందుకే ముందుగా గంట మోగిస్తారు. గుడిలో గంట మోగించడం వల్ల అనేక జన్మల పాపాలు నశిస్తాయి అని పురాణాలు పేర్కొన్నాయి. గంట కొట్టడం వెనుక మతపరమైన ప్రాముఖ్యతతో పాటు శాస్త్రీయ కోణం కూడా ఉంది.

గంట కొట్టడం వెనుక మత విశ్వాసం..

ఇవి కూడా చదవండి

గంట మోగించడం ద్వారా శరీరంలో నిసృహ స్థితుల్లో ఉన్న స్టేజ్ నుంచి కమ్యూనికేషన్ మొదలవుతుందని  పెద్దలు విశ్వాసం. దేవాలయాల్లో పూజా గదిలో, మఠాలలో గంటలు మోగిస్తారు. ఇలా చేయడం వలన దేవుని విగ్రహంలో చైతన్యం మేల్కొంటుంది. గంట మోగించడం వల్ల వాతావరణంలో ఉత్తేజం లభించి సజీవంగా మారుతుంది. అందుకే పూజ సమయంలో.. ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ఖచ్చితంగా గంటను మోగిస్తారు. గంటను ఎల్లప్పుడూ ఇత్తడి సహా పంచ లోహాలతో తయారు చేస్తారు.

గంట కొట్టడం వెనుక శాస్త్రీయ కారణం  ఏమిటంటే? 
శాస్త్రం ప్రకారం  ఆలయంలో గంట మోగించడం వలన ప్రకంపనలు ఏర్పడతాయి. ఈ శబ్ద తరంగాలు చాలా దూరం వ్యాపించడం వల్ల చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా, వైరస్‌లు నాశనమవుతాయి. ఆలయం చుట్టూ ఉన్న ప్రతిదీ గంట నుంచి వెలువడే కంపనలతో స్వచ్ఛంగా మారాయి. అదే విధంగా గంట నుంచి వెలువడే శబ్దంతో ప్రతికూల శక్తి వెళ్లిపోతుంది. అశాంతిని కలిగించే అడ్డంకులు తొలగి.. సుఖ సంపదలు కలుగుతాయి.  అందుకే గుడిలో అడుగు పెట్టిన వెంటనే గంటను మోగిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).