కర్రల సమరానికి దేవరగట్టు సిద్ధమైంది. విజయదశమి రోజు అర్ధరాత్రి జరిగే కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. దీనిని బన్నీ ఉత్సవం అని కర్రల సంప్రదాయమని స్థానికులు పిలుచుకుంటారు. కాకపోతే ప్రతి ఏటా వందల మంది తలలు పగిలి రక్తం కారణం కారుతున్న.. నేటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దసరా అంటే నవరాత్రి ఉత్సవాలు మాత్రమే కాదు.. దేవరగట్టులో జరిగే కర్రల సమయం కూడా ప్రసిద్ధిచెందింది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలోని హోలగొంద మండలం దేవరగట్టు అడవుల్లో కొండపై వెలసిన మాల మల్లేశ్వర స్వామి ఉత్సవాలు చాలా హైలైట్ గా ఉంటాయి.
పురాణాల కథనం ప్రకారం:
త్రేతాయుగంలో సముద్ర మట్టనికి సుమారు 2000 వేల అడుగులు ఎత్తున ఉన్న దేవరగట్టు దట్టమైన అటవీప్రాంతంలో మునీశ్వర్లు లోకకల్యాణం కోసం గొప్ప తపస్సు చేయాలని నిచ్చాయించుకొన్నారు. అందులో భాగంగానే ప్రతి రోజు వారు కొండ గుహల్లో తపస్సు చేసేవారు. మునుల తప్పసు కు అక్కడే కొండల్లో ఉన్న మునికాసురుడు,, మల్లాసురుడు అనే రాక్షసులు వారి తపస్సుకు భంగము కలిగిస్తూ వచ్చారు. మునులు .. మేము ఇక్కడ లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తుంటే ఇద్దరు రాక్షసులు తప్పసు కు భంగం కలిగిస్తున్నారని పార్వతి పరమేశ్వరుడు ను వేడుకొన్నారు. వారు ఇద్దరు దేవరగట్టు కు చేరుకొని కూర్మ అవతరం లో కొండ గుహలో స్వయంభువుగా వెలసి రాక్షసుల నీడను గమనిస్తూ దేవరగట్టు వచ్చినట్లు చరిత్ర ఉంది. ఈ పార్వతీ పరమేశ్వరులే మాలవి మల్లేశ్వరులు అని మాల మల్లేశ్వర స్వామి అని పిలువబడుతోంది. దేవరగట్టు పైకి వచ్చిన తర్వాత వేలాదిమంది జనంతో రాక్షస సంహారానికి మల్లేశ్వర స్వామి వెళతారు. సంహారానికి ముందు మీకు చివరి కోరిక ఏంటి అని రాక్షసులను అడుగుతారు. తమకు నరబలి కావాలని రాక్షసులు కోరుతారు. అలా కుదరదని చెప్పి ఐదు చుక్కల రక్తం గురవయ్య ఇచ్చిన తర్వాత రాక్షస సంహారం జరుగుతుంది. ఆ ఐదు చుక్కల రక్తమే ప్రతిసారి కర్రల ఉత్సవంలో రక్తం చిందడం అనవాయతీ అని స్థానికులు చెబుతున్నారు. ఇక అప్పటినుంచి ప్రతి విజయదశమి రోజు మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం అనంతరం ఈ కర్రల సంప్రదాయం జరుగుతుంది.
దేవగట్టు చుట్టూ ఉన్న గ్రామాలు:
దేవరగట్టు చుట్టూ దాదాపు 50 గ్రాములు ఉన్నాయి. అందులో నేరనికి, నెరనికి తండా, కొత్తపేట గ్రామస్తులు ప్రత్యేకత చాటుకుంటారు ఉత్సవాలకు ముందు వచ్చే అమావాస్య నుంచి దీక్ష చేపట్టి కంకణ ధారణ మొదలు బన్నీ ఉత్సవాలు ముగిసేంతవరకు చాలా నిష్టతో ఉంటారు. కొండపై నుంచి విగ్రహాలు తిరిగి నెరనికి గ్రామానికి చేరేవరకు కట్టుబాట్లు పాటిస్తారు. 12 రోజులపాటు కనీసం కాళ్లకు చెప్పులు వేసుకోకుండా మద్యం మాంసం ముట్టకుండా పూర్తిగా బ్రహ్మచర్యం పాటిస్తారు. అయితే కొందరు ఇతర గ్రామాల నుంచి వచ్చినవారు మద్యం సేవించి కర్రల సంప్రదాయంలో పాల్గొనడంతో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయని ఉత్సవానికి మచ్చ తెచ్చేలా ఉన్నాయని అంటున్నారు యువత.
భద్రతా చర్యలు:
బన్నీ ఉత్సవాన్ని ప్రశాంతంగా సాంప్రదాయబద్ధంగా శాంతియుతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. ఉత్సవానికి వారం రోజుల ముందు నుంచే నాటు సారా తయారీ కేంద్రాలను ధ్వంసం చేయడం బైండోవర్ కేసులు నమోదు చేయడం జరుగుతూనే ఉంది. అయినప్పటికీ ఉత్సవం జరిగే కొద్దిసేపటికి ముందే మద్యం సేవించి వస్తున్నారని అలాంటి సంప్రదాయం మానిపించేందుకు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని నిర్వాహకులు అంటున్నారు
ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా దేవరగట్టు కర్రల సంబరానికి వందలాది మంది పోలీసులు బందోబస్తుగా ఉంటున్నారు. కనీసం రెండు వేల మందికి పైగానే బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు ఫ్లడ్లైట్లు ఏర్పాటు చేశారు. కొన్నిసార్లు వెలుగుతున్న దివిటీలు చూసేందుకు వచ్చే వారిపై పడిన సందర్భాలు ఉన్నాయి. కర్రల చివరన ఇనుప చూవలు ధరించడంతో తలకు తగిలినప్పుడు తీవ్ర గాయాలు అవుతున్నాయి అలాంటివి ధరించకుండా పోలీసులు ఎంత ప్రయత్నించినా ఆగడం లేదు. కర్రల సంబరం ప్రశాంతంగా నిర్వహించేందుకు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఎస్పీ స్వయంగా దేవరగట్టు వెళ్లి అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు వీలు లేదని కలెక్టర్ కోటేశ్వరరావు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అంటున్నారు. శాంతి భద్రతలతో పాటు శానిటేషన్ పార్కింగ్ విద్యుత్ తాగునీరు వైద్యం తదితర సౌకర్యాలని అందుబాటులో ఉంచుతున్నట్లు చెబుతున్నారు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు ఎస్పీ సిద్ధార్థ కౌశల్.
ప్రతి ఏడాది రక్తపాతం:
దేవరగట్టులో బన్నీ ఉత్సవముగా కర్రల సమరం గా పిలువబడే సంప్రదాయం అనేక విమర్శలకు కూడా దారితీసింది. రాక్షస క్రీడలాగా పాత కక్షల ముసుగులో దాడికి పాల్పడుతున్నట్లుగా కొందరు విమర్శిస్తున్నారు. ప్రతిసారి కనీసం వంద మందికి తగ్గకుండా తలను తగులుతున్నాయి. ఈ కర్రల సమరం పై మానవ హక్కుల సంఘాలు కూడా భగ్గుమంటున్నాయి
ఇంట్లో చెప్పకుండా 14 ఏళ్ల మహేష్ అనే బాలుడు కర్రల సంబరాన్ని చూసేందుకు వచ్చాడు. 2011లో కర్రల సమరంలో కిందపడి తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయాడు. తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం ఉన్న ఒక్క కొడుకు కర్రల సమరంలో మృత్యువాత పడటంతో ఇప్పటికీ దసరా పండుగకు ఆ కుటుంబం దూరంగా ఉంటుంది. మాట్లాడించేందుకు ప్రయత్నిస్తే కన్నీటి పర్యంతం అవుతుంది ఆ కుటుంబం. ఏమి విమర్శ చేసినా ఉత్సవాలపై ప్రభావం చూపుతుందనే భయం భక్తితో ఏమీ మాట్లాడలేకపోతున్నారు.
ఈ ఏడాది అయినా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా శాంతియుతంగా వ్యక్తిగత కక్షలకు తావు లేకుండా బన్నీ ఉత్సవం జరగాలని అందరూ కోరుకుంటున్నారు.
Reporter: Nagireddy , TV9 Telugu
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)