Holy River Ganga Bath: మనిషి చేసిన పాపాలు గంగాస్నానంతో తొలగిపోతాయా.. కర్మ మనిషిని ఎలా వెంటాడుతుందంటే..

| Edited By: Janardhan Veluru

Sep 25, 2021 | 9:42 AM

Holy River Ganga Bath: భారత దేశం ఆధ్యాత్మక ప్రదేశం.. భారతదేశం ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడివడి ఉన్నాయి. అంతేకాదు హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత..

Holy River Ganga Bath: మనిషి చేసిన పాపాలు గంగాస్నానంతో తొలగిపోతాయా.. కర్మ మనిషిని ఎలా వెంటాడుతుందంటే..
Ganga Bath
Follow us on

Holy River Ganga Bath: భారత దేశం ఆధ్యాత్మక ప్రదేశం.. భారతదేశం ఆర్థిక వ్యవస్థ, చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడివడి ఉన్నాయి. అంతేకాదు హిందూమతంలో గంగానదికి ఉన్న ప్రాముఖ్యత అత్యున్నతమైంది. గంగానదిని.. “గంగమ్మ తల్లి” , “పావన గంగ”, “గంగా భవాని” అంటూ హిందువులు నిరంతరం గంగానదిని స్మరించుకుంటారు. నీరు అంటే  సంస్కృతంలో  గంగ అని అర్ధం. ఇక సనాతన ధర్మంలో గంగానది చాలా పవిత్రమైనది. పావనం చేసేది. ఒక్కమారు గంగానదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలనుండి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగా జలం మింగితే స్వర్గప్రాప్తి నిశ్చయమనీ హిందువుల నమ్మకం. అంతేకాదు మరణించిన  తమ కుటుంబీకుల అస్తికలను గంగానదిలో నిమజ్జనం చేస్తే.. స్వర్గలోక ప్రాప్తి వస్తుందని విశ్వాసం.. అందుకనే దేశ విదేశాల్లోని హిందువులు తమ కుటుంబ సభ్యుల అస్థికలను గంగానదిలో కలపడానికి వారాణాసికి, గయకు వెళ్తారు. ఇక ఇంట్లో గంగా నది జలాన్ని ఒక చిన్న పాత్రలో ఇంటిలో ఉంచుకోవడం శుభప్రథమని భావిస్తారు. గంగా నది తీరాన కుంభ మేళ, ఛత్‌పూజ వంటి ఉత్సవాలు జరుగుతాయి.  గంగా నదిలో స్నానం పాపాలను ఎలా హరిస్తుంది అనే విషయంపై గంగాదేవినే అడిగి తెలుసుకున్న ఓ కథను తెలుసుకుందాం..

గంగలో స్నానమాచరిస్తున్న ఒకరికి ఒక సందేహం వచ్చింది… వెంటనే గంగానదినే అడిగాడట.  “అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపాలను వదిలేస్తున్నారు. మరి ఇంత మంది పాపభారాన్ని ఎలా మోస్తున్నావు తల్లీ… అని అడిగాడు. దీంతో అతనికి గంగా నది బదులిస్తూ.. “నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను” అని బదులిచ్చిందట. దీంతో ఆ వ్యక్తి.. వెంటనే, అయ్యో అన్ని పుణ్యనదులు ఇంతేకదా… పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకొని… సముద్రం వద్దకు వెళ్ళాడు.. అక్కడ సముద్రుడితో అయ్యో నదుల్లో కలిసే పాపాలన్నీ నీదగ్గరకు చేరుతున్నాయి.. ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని అడిగాడు. ఆ ప్రశ్నకు సముద్రుడు సమాధానం చెబుతూ.. నేనెక్కడ భరిస్తున్నాను? ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోనికి పంపిస్తున్నాను’ అని బదులిచ్చాడట.

దీంతో మళ్ళీ ఆ వ్యక్తి.. అయ్యో .. ఎంతో తేలికగా కదిలాడే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది… అని అనుకుంటూ.. మళ్లీ ఓ మేఘమాలికల్లారా ఎలా భరిస్తున్నారు… ఈ పాప భారాన్ని అని అడగగా… అవి పకపకా నవ్వి ‘మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటికప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా’…అని బదులిచ్చాయి. మేఘాల సమాధానం విన్న  ఆ వ్యక్తి ఓహో…ఆ పాపాలన్నీ మన మీద పడి లేదా తాగుతూ, మనమే అనుభవిస్తున్నామన్నమాట. అంటే కర్మ ఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడట.

ఇదే విషయాన్నీ శివుడు పార్వతి దేవికి

“ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః
ఆత్మతీర్ధం న జానన్తి కధం మోక్షః శృణు ప్రియే.
పరమశివుడు, పార్వతీదేవి కి ఉపదేశించిన శ్లోకమిది.

అంటే పుణ్యక్షేత్రాల్లోని తీర్ధాల్లో స్నానమాచరించిన పుణ్యం కలుగుతుంది.. ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగుతుందని తీర్ధ స్నానం చేయడానికి మనిషి భ్రమకు లోబడి పరుగెడతాడు. అంటే ఆత్మజ్ఞాన తీర్ధంలో స్నానమాచరించని వారికి మోక్షం కలుగుతుందని అని ఈ శ్లోకం అర్థం. అంటే కర్మ కర్మణా నశ్యతి…. అనగా..  కర్మ కర్మతోనే నశిస్తుంది.

Also Read:

Love Story First Day Collections: చైతు, సాయిపల్లవిల ‘లవ్ స్టోరీ’కి యుఎస్ ప్రేక్షకులు ఫిదా.. ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే..

Horoscope Today: రాశిఫలాలు నేడు…. ఏ రాశివారికి గ్రహబలం అనుకూలంగా ఉండి చేపట్టిన పనులు జరుగుతాయంటే..