Devotional : “సామజవరగమనా” ఈ పదం వినగానే చాలా మందికి అలవైకుంఠ పురంలోని పాటు గుర్తుకొస్తుంది. అదే ముందు తరంవారికైతే త్యాగరాయ కీర్తన గుర్తుకొస్తుంది. ఇక 80లో వారికైతే శారద అంటూ గట్టిగా అరిచే శంకరాభరణం శంకర శాస్త్రిగారు గుర్తుకొస్తారు.. 90 లో అయితే బాలకృష్ణ సామజవరగమనా గుర్తుకొస్తే.. మరికొందరికి “మా మావ పాట” అని తన జ్ఞాపకాలను గుర్తు చేస్కునే కింగ్ సినిమా లోని “స్వరబ్రహ్మ జయసూర్య” బ్రహ్మానందం గుర్తుకొస్తారు.. అయితే అసలు సామజవరగమనా పాటలకు అర్ధం భావం ఏమిటో తెలుసుకుందాం..!
పల్లవి: సామజవరగమనా! సాధుహృత్సారసాబ్జపాల! కాలాతీతవిఖ్యాత! ॥సామజ॥
అనుపల్లవి: సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల! దయాలవాల! మాంపాలయ! ॥సామజ॥
చరణం: వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా। స్వీకృత యాదవకులమురళీ!
గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥సామజ॥
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ విన్నా , ఒక పాట హోరెత్తుతోంది . అదే సామజవరగమన చాలా మందికి ఈ పాట నోటికి కంఠస్తా వచ్చి ఉంటుంది , అలానే ఈ పాట చాలా మందికి బాగానే అర్థమయ్యి ఉంటుంది … కానీ చాలా మందికి ” సామజవరగమన ” అంటే ఏంటో తెలీదు..
సామజవరగమన ‘ అనే పదం త్యాగరాజ స్వామి కీర్తనలోనిది … ‘ సామజ ‘ అనగా ” ఏనుగు ” అని ..’ వరగమనా ‘ అనగా ” చక్కని నడక ” అని అర్థం … అలానే సామవేదం అనగా సంగీతం! .. మన భారతీయ సంగీతానికి మూలం సామవేదం! ” సామజవరగమన ” అంటే ఏనుగు లా గంభీరంగా , హుందాగా , ఠీవిగా నడిచేవారు అని అర్థం ..
అసలైన ” సామజవరగమన ..” శ్రీరాముడు మరియు శ్రీకృష్ణుడు ..”. వాల్మీకి తన రామాయణం లో ‘అరణ్యవాసం’లో ఒకచోట రాముడిని “గజవిక్రాంతగమను”డని వర్ణించారు. అంటే రాముడు ఏనుగులా హుందాగా నడిచే వాడు అని అర్ధం.. ఇదే అర్థం వచ్చేలా త్యాగరాజు తన కీర్తనలో ‘ సామజవరగమన ‘ అంటూ శ్రీరాముణ్ణి స్తుతించారు.
చాలా మంది ” సామజవరగమన ” అంటూ పాడేస్తున్నారు.. అయితే కొంతమందికి ఇది దేవుని కీర్తన అని కూడా తెలీదు .. దాని అర్థం ఏంటో కూడా తెలీదు.. అటువంటి వారికోసమైనా “సామజవరగమన ” కీర్తన.. దాని అర్థం ఒకసారి తెలుసుకుందాం..
సామజవరగమనా ! సాధుహృత్సారసాబ్జపాల ! కాలాతీతవిఖ్యాత ! ॥ సామజ॥
సామనిగమజసుధామయ గానవిచక్షణ గుణశీల ! దయాలవాల ! మాంపాలయ ! ॥
వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీపా।
స్వీకృత యాదవకులమురళీ !
గానవినోదన మోహనకర త్యాగరాజ వందనీయ ॥
ఈ కీర్తన త్యాగ రాయ కీర్తనలన్నిటిలో ప్రసిద్ధి పొందినది .. ఈ కీర్తన లో ని ప్రతి పదం శ్రీ కృష్ణుడిని వర్ణిస్తూ ఉంటుంది …
ఏనుగు నడకవంటి గంభీరమైన నడక తో, మునులు మనిషులు హృదయాలను ఏలుతున్న ఓ శ్రీ హరి, నువ్వు కాలం తో సంబంధం లేకుండా అందరి చేత పొగడ బడతావు.. సామవేదం పుట్టుక నీవల్లే జరిగింది.. సంగీతాన్ని రక్షించేవాడివి నీవే, గుణమునకి, దయకి ఉదాహరణ నీవే.. నన్ను కూడా నీవే నడిపించాలి.. సమావేదమునుండి పుట్టిన సప్తస్వరముల వల్ల, ప్రకాశిస్తూ.. గోవులని రక్షిస్తూ.. మురళి గానం తో మామ్మలందరిని ఆనంద పరుస్తూ.., ఈ త్యాగరాజ వందనములను అందుకో.. ఇదీ సామజవరగమన కు సంబంధించిన అసలు భావం!
వాగ్గేయకారుడు త్యాగయ్య, శ్రీకృష్ణుడి నడక ని, ఏనుగు నడక తో పోల్చారు. ఏనుగు నడక ని ,మనం గమనిస్తే, ఎంతో గంభీరంగా, నెమ్మది గా నడుస్తుంది. సింహం నడక హింస తో కూడిన అధికారానికి ప్రతీక అయితే, ఏనుగు నడక హింస లేని అధికారానికి ప్రతీక అని పెద్దలు అంటారు.
Also Read: