Chanakya Niti Telugu :ఇలాంటి స్నేహితుడు పాము కంటే డేంజర్.. నమ్మితే నష్టం తప్పదు..! చాణక్యుడి హెచ్చరిక..

ప్రతి వ్యక్తి తన జీవితంలోని అన్ని దశలలో వివిధ రకాల వ్యక్తులను ఎదుర్కోవలసి ఉంటుంది. స్నేహితులను ఎంచుకోవడంలో ఉన్న సూక్ష్మబేధాల గురించి చాణక్య నిత్యంలో సూచించిన సలహాలను మనం పరిశీలించినట్టయితే..చాణక్యుడి ప్రకారం, స్నేహితులను ఎంచుకోవడం అంటే జీవిత మార్గాన్ని ఎంచుకున్నట్లే. మంచి లక్షణాలు కలిగిన స్నేహితులు మనల్ని జీవితంలో విజయానికి నడిపిస్తారని చాణక్యుడు పేర్కొన్నాడు. అయితే

Chanakya Niti Telugu :ఇలాంటి స్నేహితుడు పాము కంటే డేంజర్.. నమ్మితే నష్టం తప్పదు..! చాణక్యుడి హెచ్చరిక..
Such A Person Is More Poisonous Than A Snake Dont Make Friends Said By Chanakyaniti

Updated on: Feb 13, 2025 | 10:53 AM

చాణక్యుడు చెప్పిన జీవిత సత్యాలు అన్ని కాలాలు, అన్ని వయసుల వారికి సరిపోయేలా ఉంటాయి. మనిషి ఎదిగేందుకు చాణక్యుడు చెప్పిన సూత్రాలు ఉపయోగపడతాయి. జీవితంలో గెలిచేందుకు చాణక్యుడి మాటలు మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. జీవితంలో విజయం సాధించాలంటే తప్పక చాణక్యుడి నీతి మాటలు పాటించాలి అంటారు మన పెద్దలు. అందుకే ప్రతి చోట, ప్రతి పనిలో చాణక్యుడి నీతి అనే మాట మనకు వినిపిస్తూనే ఉంటుంది. ఆయన చెప్పిన మాటలు నేటికీ చాలా మంది పాటిస్తుంటారు. చాణక్యుడి నీతి జీవితానికి అవసరమైన వివిధ విషయాల గురించి స్పష్టమైన వివరణను అందిస్తుంది. అందులో ఒకటి నమ్మకమైన స్నేహితులు అంటే ఎవరో కూడా వివరించాడు..

ప్రతి వ్యక్తి తన జీవితంలోని అన్ని దశలలో వివిధ రకాల వ్యక్తులను ఎదుర్కోవలసి ఉంటుంది. స్నేహితులను ఎంచుకోవడంలో ఉన్న సూక్ష్మబేధాల గురించి చాణక్య నిత్యంలో సూచించిన సలహాలను మనం పరిశీలించినట్టయితే..చాణక్యుడి ప్రకారం, స్నేహితులను ఎంచుకోవడం అంటే జీవిత మార్గాన్ని ఎంచుకున్నట్లే. మంచి లక్షణాలు కలిగిన స్నేహితులు మనల్ని జీవితంలో విజయానికి నడిపిస్తారని చాణక్యుడు పేర్కొన్నాడు. అయితే చెడు లక్షణాలు కలిగిన స్నేహితులు పాముల వంటివారని, అలాంటి వారు మనకు ఎప్పుడూ ఏదో ఒక ప్రమాదాన్ని బహుమతిగా ఇస్తుంటారని హెచ్చరించారు.

* పాముల మాదిరిగానే కొంతమంది మనుషుల మనస్తత్వంలో ఎప్పుడూ విషం నిండి ఉంటుంది. మీరు అలాంటి వారిని గుర్తించినట్లయితే, వారికి దూరంగా ఉండటం చాలా ముఖ్యం.

ఇవి కూడా చదవండి

* తమను పెంచిన తల్లిదండ్రుల కోసం కష్టపడి పనిచేయని వారిని, అమ్మనాన్నలను అవమానించే వారిని చాణక్యుడు అత్యంత దుర్మార్గులుగా అభివర్ణిస్తాడు. ఈ రకమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఎవరి జీవితాన్ని కూడా మంచి మార్గంలో వెళ్ళనివ్వరు.

* చాణక్యుడి నీతి ప్రకారం, మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన వ్యక్తులు, భార్యలను, పిల్లలను పట్టించుకోకుండా స్వార్థ ప్రయోజనాల కోసం జీవించేవారు పాముల వంటివారని పేర్కొన్నాడు. అలాంటి వారితో స్నేహం చేయడం మీ అభివృద్ధికి అడ్డుకట్టే అవుతుంది.

* జీవితంలో న్యాయం, నిజాయితీకి విలువ ఇవ్వని వారితో స్నేహం చేస్తే అవి మీ జీవితాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తాయని చాణక్యుడు కూడా చెప్పాడు. అలాంటి స్నేహాలను మొగ్గలోనే తుంచేసుకోవటం మంచి లక్షణంగా చాణక్యుడు చెప్పాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..