మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా .. చూపుడు వేలు ఆకారం వెనుక దాగున్న మిస్టరీ ఇదే..

వేళ్లను బట్టి మనిషి ఎలాంటివాడో చెప్పొచ్చు. అవును.. మీరు చదవుతున్నది నిజమే.. హస్తసాముద్రికం ప్రకారం.. చూపుడు వేలు గురు గ్రహానికి ప్రతీక. దీని ఆకారాన్ని బట్టి వ్యక్తి స్వభావం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం వంటివి తెలుసుకోవచ్చు. మీ వేలు ఆకారం మీ గురించి ఏం చెబుతుంది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

మీ చేతి వేళ్లు మీ భవిష్యత్‌ను చెప్తాయా .. చూపుడు వేలు ఆకారం వెనుక దాగున్న మిస్టరీ ఇదే..
Index Finger Shape Says Your Personality

Updated on: Dec 27, 2025 | 4:39 PM

సాధారణంగా మన చేతికి ఐదు వేళ్లు ఉంటాయి. కొంతమందికి ఆరో వేలు కూడా ఉంటుంది. దానిని అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అయితే మన చేతిలోని ఐదు వేళ్లలో ప్రతి వేలికి ఒక ప్రత్యేక చరిత్ర, ప్రాముఖ్యత, గ్రహ సంబంధం ఉంటుంది. హస్తసాముద్రికం ప్రకారం.. చూపుడు వేలును గురు వేలు అని పిలుస్తారు. ఈ చూపుడు వేలు ఆకారం మనిషి తెలివితేటలను, స్వభావాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో ఇక్కడ చూద్దాం.

చూపుడు వేలు – గ్రహ సంబంధం

హస్తసాముద్రికం ప్రకారం వేళ్ల విభజన ఇలా ఉంటుంది:

  • బొటనవేలు: శుక్రుడు
  • చూపుడు వేలు: బృహస్పతి
  • మధ్య వేలు: శని
  • ఉంగరపు వేలు: రవి
  • చిటికెన వేలు: బుధుడు

చూపుడు వేలు గురు గ్రహానికి ప్రతీక కాబట్టి దీనిపై పుష్యరాగ రత్నాన్ని ధరించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని శాస్త్రం చెబుతోంది.

ఇవి కూడా చదవండి

వేలి ఆకారం.. మీ స్వభావం

పొడవైన చూపుడు వేలు: ఒక వ్యక్తికి చూపుడు వేలు మిగిలిన వేళ్లతో పోలిస్తే పొడవుగా ఉంటే వారిలో అద్భుతమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరు సమాజంలో నాయకులుగా ఎదిగే అవకాశం మెండుగా ఉంటుంది.

చదునైన వేలు – వెడల్పు గోరు: చూపుడు వేలు ఫ్లాట్‌గా ఉండి గోరు భాగం వెడల్పుగా ఉంటే.. ఆ వ్యక్తికి ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ. పదునైన తెలివితేటలతో తాము చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు.

త్రిభుజాకార లేదా సూటి వేలు: ఈ ఆకారం ఉన్నవారు ఎక్కువగా కలల ప్రపంచంలో విహరిస్తుంటారు. వీరికి ప్రేమ, కోరికలు ఎక్కువగా ఉంటాయి. వాస్తవంలో కంటే ఊహల్లో బ్రతకడానికి వీరు ఇష్టపడతారు.

మందపాటి వేలు లేదా గోరు: వేలు లేదా గోరు ప్రాంతం మందంగా ఉన్నవారు విశాల హృదయులు. దానధర్మాలు చేయడం, మతపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం వీరి ప్రత్యేకత. వీరు దాతృత్వ గుణాన్ని కలిగి ఉంటారు.

చిన్నగా, ఉబ్బినట్లుగా ఉండే వేలు: చూపుడు వేలు చిన్నగా లేదా ఉబ్బినట్లు ఉంటే వారు తమ జీవితంపై కొంత ప్రతికూల భావన కలిగి ఉంటారు. అయితే వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కానీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉండవచ్చు.

చూపుడు వేలును ఎలా వాడాలి?

శాస్త్రాల ప్రకారం చూపుడు వేలును ఎప్పుడూ మంచి ప్రయోజనాల కోసమే వాడాలి. ఎవరినైనా అవమానించడానికి లేదా చెడు ఉద్దేశంతో ఈ వేలును చూపిస్తే ఆ ప్రతికూల ప్రభావం మనపై రెట్టింపు స్థాయిలో పడుతుందని చరిత్ర చెబుతోంది. అందుకే పెద్దలు ఎవరినీ వేలెత్తి చూపవద్దని హెచ్చరిస్తుంటారు. చూపుడు వేలు ఆకారం అనేది కేవలం ఒక వ్యక్తి యొక్క సాధారణ లక్షణాలను మాత్రమే సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి ఈ శాస్త్రం ఒక మార్గదర్శిగా ఉపయోగపడుతుంది.