Wednesday Puja Tips: సిరి సంపదల కోసం, విద్యాబుద్ధుల కోసం బుధవారం గణపతిని ఇలా పూజించండి..

విఘ్నాలు తొలగించే దైవంగా హిందువులు వినాయకుడిని పుజిస్తారు. బుధవారం గణేశుడికి అంకితం చేయబడిన రోజు. గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పరిహారాలను ఆచరిస్తారు. ఈ రోజు సంపద, శ్రేయస్సు. విద్య, వృత్తి పరమైన అభివృద్ధి కోసం బుధవారం కొన్ని రకాల పరిహారాలను చేయడం శుభప్రదం. గణపతి ఆశీర్వాదం కోసం ఈ రోజు బుధవారం ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం..

Wednesday Puja Tips: సిరి సంపదల కోసం, విద్యాబుద్ధుల కోసం బుధవారం గణపతిని ఇలా పూజించండి..
Lord Ganesha Puja

Updated on: Apr 23, 2025 | 6:52 AM

బుధవారం గణపతికి అంకితం చేయబడిన రోజు. విఘ్నాలను తొలగించి శుభాలను కలిగిస్తాడని నమ్మకం. అందుకనే బుధవారం గణేశుడిని వివిధ మార్గాల్లో పూజిస్తారు. తమ జీవితంలో ఆనందం, శ్రేయస్సు తీసుకురావడానికి గణపతిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అటువంటి వారి కోసం వినాయకుడి ఆశీర్వాదాలను పొందగల కొన్ని శక్తివంతమైన నివారణ చర్యల గురించి ఈ రోజు తెలుసుకుందాం.. సంపద, శ్రేయస్సు కోసం గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఐదు నివారణలు చేయండి. అంతేకాదు గణేశుడికి నెయ్యి , బెల్లం భోగంగా సమర్పించాలి. ఈ భోగాన్ని ఆవుకు నైవేద్యం పెట్టాలి. అయితే ఇలా దేవుడికి సమర్పించిన ఈ నెయ్యి, బెల్లం ని ప్రసాదంగా కుటుంబ సభ్యులు తీసుకోకూడదు. అయితే ఇలా చేసే పరిహారం వల్ల గణేశుడి ఆశీర్వాదం లభిస్తుంది.

శాంతి కోసం

బుధవారం రోజున వినాయక విగ్రహం ముందు మీ పూజ స్థలంలో ఒక తమలపాకును ఉంచండి. ఈ తమల పాకులను వారం రోజులు పూజించండి. మళ్ళీ బుధవారం ఈ తమలపాకులను పూజా స్థలం నుంచి తీసి ప్రవహిస్తున్న నదిలో కలపండి. మళ్ళీ బుధవారం కొత్త తమలపాకులను పూజ స్థలంలో పెట్టి.. వాటి స్థానంలో కొత్తవాటితో భర్తీ చేసి.. బుధవారం వరకు కొనసాగించండి.

విద్యా వృద్ధి కోసం

సరస్వతి దేవిలాగే.. గణేశుడు కూడా విద్య, బుద్ధి ప్రదాత అని హిందువులు నమ్ముతారు. మహాభారతం రాయడంలో గణేశుడు వేదవ్యాసుడికి సహాయం చేశాడని పురాణాల కథనం. మంచి చదువు, మంచి మార్కుల కోసం విద్యార్థులు గణేశుడికి జమ్మి ఆకులను సమర్పించాలి. గణపతిని పూజిస్తూ “ఓం శ్రీ గణేశయే నమః” అనే ఈ మంత్రాన్ని జపించండి.

ఇవి కూడా చదవండి

వృత్తిపరమైన వృద్ధి కోసం

ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్న వ్యక్తులు, కష్టపడి పనిచేసినప్పటికీ ఆశించిన ఫలితాలను పొందుతున్నవారు, నిరుద్యోగులు, గణేశుడికి పసుపులో ముంచిన దర్భ గడ్డిని సమర్పించండి. అప్పుడు ఓం గం గణపతయే నమః అనే ఈ మంత్రాన్ని జపించండి.

సంపద,డబ్బు కోసం

ఇంటి ప్రధాన ద్వారం వద్ద కుంకుమతో స్వస్తిక వేయడం శుభప్రదం. గణేశుడికి కుంకుమ, కుడుములు, ఉండ్రాళ్ళు సమర్పించండి. ఏదైనా ఆలయంలో రెండు అరటి మొక్కలు నాటండి. శనగపిండి లడ్డూ, అరటిపండ్లు నైవేద్యం పెట్టండి. ఈ పరిహారం చేయడం వలన ఆర్ధిక ఇబ్బందులు తీరి సిరి సంపదలు కలుగుతాయి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు