Koniamman Temple: వైభవంగా కోనియమ్మన్ రథోత్సవం.. మత సామరస్యం చాటుకున్న ముస్లిం సోదరులు

|

Feb 29, 2024 | 7:08 AM

ఈ ఆలయంలో ఏటా జరిగే ఉత్సవాలకు చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. కోనియమ్మన్ ఆలయం.. కోయింబత్తూర్‌ టౌన్ హాల్ ప్రాంతంలో ఉండగా.. నగరంలోని ఆలయాల్లోని ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అంతేకాదు కొందరు ఈ అమ్మవారి పేరుమీదునే నగరం వెలసింది అని నమ్మకం. 

Koniamman Temple: వైభవంగా కోనియమ్మన్ రథోత్సవం.. మత సామరస్యం చాటుకున్న ముస్లిం సోదరులు
Koniyamman Temple Festival
Follow us on

తమిళనాడులోని కోయంబత్తూరులోని నోయల్ నది ఉత్తర ఒడ్డున ఉన్న చారిత్రాత్మక హిందూ దేవాలయం కోనియమ్మన్ ఆలయంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా జరిగిన రథోత్సవం మత సామరస్యానికి వేదికగా నిలిచింది.  పార్వతి దేవి ప్రతి రూపంగా ఇక్కడ అమ్మవారిని పూజిస్తారు.  అంగరంగ వైభవంగా జరిగిన అమ్మవారి ఆలయ రథోత్సవానికి భక్తులు పోటెత్తారు. ఈ ఆలయంలో ఏటా జరిగే ఉత్సవాలకు చుట్టుపక్కల జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. కోనియమ్మన్ ఆలయం.. కోయింబత్తూర్‌ టౌన్ హాల్ ప్రాంతంలో ఉండగా.. నగరంలోని ఆలయాల్లోని ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అంతేకాదు కొందరు ఈ అమ్మవారి పేరుమీదునే నగరం వెలసింది అని నమ్మకం.

ఇక.. ఈ నెల 20న ధ్వజారోహణంతో కోనియమ్మన్ ఆలయ ఉత్సవం వైభవంగా ప్రారంభమైంది. పులి వాహనం, చిలుక వాహనం, సింహవాహనం, అన్నవాహనం.. ఇలా ప్రతి రోజూ అమ్మవారిని ఒక్కో వాహనంపై ఊరేగిస్తూ ఉత్సావాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కోనియమ్మన్ ఆలయ రథోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు పాల్గొని రథాన్ని తాడుతో లాగి పూజలు చేశారు. ఈ క్రమంలో.. మసీద్‌ మీదుగా రథోత్సవం వెళ్తుండగా.. ముస్లిం సోదరులు తమ మత సామరస్యాన్ని చాటుకున్నారు. ముస్లిం సోదరులు భక్తులకు వాటర్‌ బాటిల్స్‌ అందజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..