Vinayaka Chavithi 2024: అనంత చతుర్దశి ఎప్పుడు, గణేష నిమజ్జనానికి శుభ ముహూర్తం.. పద్ధతి.. పూర్తి సమాచారం ఏమిటంటే

అనంత చతుర్దశి రోజున ప్రజలు గణపతి విగ్రహాన్ని ఎంతో వైభవంగా, సంగీత వాయిద్యాలతో ఊరేగిస్తూ నది దగ్గరకు తీసుకుని వెళ్లి నిమజ్జనం చేస్తారు. బప్ప మళ్లీ ఏడాది తమ ఇంటికి తీసుకుని రావాలని ప్రార్థిస్తారు. గణేష్ ఉత్సవం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిధిన ప్రారంభమవుతుంది. ఈ పండుగ భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్దశి తేదీ వరకు కొనసాగుతుంది. ఈ 10 రోజులు వినాయకుడు ఇళ్ళలో, పూజా మండపాలలో కొలువుదీరి పూజలను అందుకుంటాడు.

Vinayaka Chavithi 2024: అనంత చతుర్దశి ఎప్పుడు, గణేష నిమజ్జనానికి శుభ ముహూర్తం.. పద్ధతి.. పూర్తి సమాచారం ఏమిటంటే
Lord Ganesha
Image Credit source: iStock

Updated on: Sep 14, 2024 | 7:16 AM

వినాయక చవితి ఉత్సవాలు ముగింపు సమయం అసంనమవుతోంది. తొమ్మది రోజుల పాటు పూజలను అందుకున్న గణపయ్య పదో రోజైన అనంత చతుర్దశి రోజున నిమజ్జనంతో గంగమ్మ ఒడిలోకి చేరతాడు. అనంత చతుర్దశి రోజున ప్రజలు గణపతి విగ్రహాన్ని ఎంతో వైభవంగా, సంగీత వాయిద్యాలతో ఊరేగిస్తూ నది దగ్గరకు తీసుకుని వెళ్లి నిమజ్జనం చేస్తారు. బప్ప మళ్లీ ఏడాది తమ ఇంటికి తీసుకుని రావాలని ప్రార్థిస్తారు. గణేష్ ఉత్సవం భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిధిన ప్రారంభమవుతుంది. ఈ పండుగ భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్దశి తేదీ వరకు కొనసాగుతుంది. ఈ 10 రోజులు వినాయకుడు ఇళ్ళలో, పూజా మండపాలలో కొలువుదీరి పూజలను అందుకుంటాడు.

అనంత చతుర్దశి పూజ తిథి మరియు శుభ ముహూర్తం

వేద క్యాలెండర్ ప్రకారం అనంత చతుర్దశి తిథి 16 సెప్టెంబర్ 2024న మధ్యాహ్నం 03:10 గంటలకు ప్రారంభమవుతుంది. చతుర్దశి తిథి 17 సెప్టెంబర్ 2024న రాత్రి 11:44 గంటలకు ముగుస్తుంది. అనంత చతుర్దశి రోజున ఉదయం 6.20 గంటల నుండి 11.44 గంటల వరకు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.

గణేష నిమజ్జనానికి శుభ ముహూర్తం

హిందూ వేద క్యాలెండర్ ప్రకారం గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ఉదయం 9.23 నుంచి సాయంత్రం 9.28 వరకు శుభ సమయం. ఈ శుభ సమయంలో గజాననుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం.

ఇవి కూడా చదవండి

నిమజ్జనం చేసేందుకు విధానం

గణేశుడిని నిమజ్జనం చేయడానికి ముందుగా చెక్క ఆసనాన్ని సిద్ధం చేయండి. దానిపై స్వస్తిక్ గుర్తుని వేసి గంగాజలంతో శుద్ధి చేయండి. పసుపు రంగు వస్త్రాన్ని పరచి దానిపై వినాయక విగ్రహాన్ని ఉంచి.. కొత్త బట్టలు వేసి పసుపు, కుంకుమ అంద్దండి. అనంతరం ఆసనంపై అక్షతలు వేసి గణపతి విగ్రహానికి పూలు, పండ్లు, మోదకం మొదలైన వాటిని సమర్పించండి. బప్పా విగ్రహాన్ని నిమజ్జనం చేసే ముందు పూర్తి నియమ నిబంధలనతో పూజించండి. గణపతి తిరిగి తమ ఇంటికి మళ్ళీ తిరిగి రమ్మనమని ప్రార్థించండి. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి హారతి ఇవ్వండి. ఆ తరువాత గణేశ విగ్రహాన్ని ఆచారబద్ధంగా నిమజ్జనం చేయండి. పుజాదికార్యక్రమాల సమయంలో ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే క్షమించమని గణపయ్యను అడగండి. వచ్చే ఏడాది మళ్లీ ఇంటికి రమ్మనమని ప్రార్థించండి.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి