బ్రహ్మంగారి ఎపిసోడ్‌లో.. ఇప్పటికే ఎన్నో ట్విస్ట్‌లు తెరపైకి వచ్చాయి. వసంత వెంకటేశ్వరస్వామి మరణం తర్వాత.. వీలునామా.. ఆధిపత్య పోరు.. ఆతర్వాత.. స్వామీజీల బృందం ఎంట్రీ.. ఇలా.. ఒక్కో సీన్ ఉత్కంఠ రేపాయి. వసంత వెంకటేశ్వరస్వామి మరణం నుంచి.. ఇప్పటి వరకూ అసలేం జరుగుతోంది. బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం ఎపిసోడ్ ముగిసింది. శుభం కార్డు కూడా పడిదని అనుకునే లోపే.. మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం.. మఠానికి పీఠాధిపతిగా వెంకటాద్రిస్వామిని ప్రకటించడంతో.. వివాదం సుఖాంతమైందని అందరూ అనుకున్నారు.
కానీ.. వసంత వెంకటేశ్వరస్వామి రెండో భార్య మారుతి మహాలక్ష్మి.. మరో షాక్ ఇచ్చారు. హైకోర్టులో పిటిషన్ వేయడంతో.. మళ్లీ మఠం వివాదం మొదటికి వచ్చింది. అయితే.. ఆమె పూటకో మాట మాట్లాడుతుండటం.. ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వివాదంలో ఒకరు ముందుకు లాగుతుంటే మరొకరు వెనక్కి లాగుతున్నారు. మధ్యవర్తుల మాట కూడా వినడం లేదు. దీంతో మఠంలో పీఠముడి వీడటం లేదు. ఇప్పుడు ప్రభుత్వం జోక్యం తప్పనిసరిగా కనిపిస్తోంది.
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మారుతి మహాలక్ష్మి మఠంలోకి ప్రవేశించకుండా చూడలంటూ కందిమల్లయ్య పల్లె గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేశారు.
మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు సమక్షంలో సామరస్యపూర్వక పరిష్కారం చేసినప్పటికీ మఠం ప్రతిష్టను దెబ్బతీస్తూ మారుతి మహాలక్ష్మి న్యాయస్థానం ఆశ్రయించడం ఆగ్రహం వ్యక్తం చేశారు.
మఠంకి మళ్ళీ తిరిగి వస్తున్న నేపథ్యంలో భద్రత కోసం పోలీసు ఉన్నతాధికారులను మారుతి మహాలక్ష్మి సంప్రదించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ప్రతిష్టను దెబ్బతీసిన మారుతి మహాలక్ష్మి మఠం లోకి ప్రవేశిస్తే సమస్యలు ఉత్పన్నం అవుతాయని అంటున్నారు గ్రామస్తులు. మఠాధిపతి నియామకం పూర్తయ్యేవరకూ కందిమల్లాయపల్లె పుర సంస్థానం (మహా నివేదన మందిరం) లోకి మహాలక్ష్మి వెళ్లేందుకు అనుమతి నిరాకరించవలసినదిగా పోలీస్ స్టేషన్‌లో విజ్ఞప్తి చేశారు కందిమల్లాయపల్లె గ్రామస్థులు.