Vidur Niti: ఈ నాలుగు అలవాట్లు వ్యక్తి జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి.. తస్మాత్ జాగ్రత్త..!
Vidur Niti: మహాభారత కాలంలో ధృతరాష్ట్రుడి ప్రధాన సహాయకుడు అయిన విధురుడు చాలా తెలివైన, దూరదృష్టి గలవాడు. ధృతరాష్ట్రుడు, విధురుడి మధ్య జరిగిన సంభాషణ..
Vidur Niti: మహాభారత కాలంలో ధృతరాష్ట్రుడి ప్రధాన సహాయకుడు అయిన విధురుడు చాలా తెలివైన, దూరదృష్టి గలవాడు. ధృతరాష్ట్రుడు, విధురుడి మధ్య జరిగిన సంభాషణ సంకలనమే విధుర నీతి. ఈ సంభాషనలో వ్యక్తి జీవితానికి సంబంధించిన ఎన్నో కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా వ్యక్తి జీవితంలో ఎదుగుదల, వినాశనానికి గల కారణాలను కూలంకశంగా పేర్కొనడం జరిగింది. సాధారణంగా వ్యక్తి జీవితం సాఫీగా సాగాలంటే లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పనిసరి. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటే.. జీవితంలో అన్నీ సమకూరుతాయి. సుఖసంతోషాలతో విలసిల్లుతుంది. అయితే, ఈ విధుర నీతి ప్రకారం.. వ్యక్తికి ఉండే నాలుగు లక్షణాలు వారి జీవితాన్ని నాశనం చేస్తాయి. అభివృద్ధికి సంబంధించిన అన్ని దారులు మూసుకుపోతాయి. వీరి ఇంట్లో డబ్బు కొరత, పేదరికం తాండవిస్తుంది. జీవితాన్ని ఇంతలా ప్రభావితం చేసే ఆ నాలుగు లక్షాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదాసీనత, సోమరితనం: విధుర నీతి ప్రకారం.. ఉదాసీనత, సోమరితనం ఉన్న వ్యక్తుల ఇళ్లలో లక్ష్మీ దేవి కొలువై ఉండదు. ఇలాంటి వారు, ఇవాళ చేయాల్సిన పనులను రేపటికి వాయిదా వేస్తుంటారు. అలా వారి వినాశనానికి వారే కారణం అవుతారు. సోమరితనం మనిషికి అతి పెద్ద శత్రువు. అందుకే సోమరితనాన్ని విడిచిపెట్టి కష్టపడే మార్గాన్ని ఎంచుకోవాలి.
అదృష్టం, భగవంతునిపై ఆధారపడటం: విధుర నీతి ప్రకారం.. ఎవరైనా సరే అదృష్టం, భగవంతునిపై మాత్రమే ఆధారపడకూడదు. భగవంతునిపై ఆశ పెట్టుకుని మాత్రమే జీవించేవారు ఎలప్పుడూ పేదరికంలోనే మగ్గిపోతుంటారు. భగవంతుడిని విశ్వసించడం మంచిదే.. అదే సమయంలో కర్మ ఫలాన్ని కూడా విశ్వసించాలి.
పెద్దలను గౌరవించని వారు: విధుర నీతి ప్రకారం.. పెద్దలను గౌరవించని వ్యక్తుల పట్ల లక్ష్మీ దేవి ఏమాత్రం కరుణ చూపదు. వారి ఇంట్లోకి అస్సలు అడుగు పెట్టదు. ఆ కారణంగానే వారు ఎల్లప్పుడూ పేదరికంలో మగ్గిపోతుంటారు. అందుకే పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి.
పని చేయకుండా తప్పించుకునేవారు: విధుర నీతి ప్రకారం పని చేయకుండా తప్పించుకు తిరిగేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు. ఇలాంటి వారి ఇళ్లలో ఎప్పుడూ డబ్బు కొరత ఉంటుంది. ఇలాంటి వారు జీవితంలో ఎప్పటికీ పురోగతి సాధించలేరు. ఎందుకంటే కృషి లేకుండా విజయం సాధించలేరు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..