Vastu Tips for Tulsi ఇంట్లో తులసి మొక్కను పొరపాటున కూడా ఈ దిక్కులో ఉంచొద్దట… ఎక్కడ ఉంచాలంటే..!

|

Jan 23, 2023 | 8:07 AM

తులసి మొక్కను నాటడంతో పాటు దాన్ని ఏ దిశలో ఉంచాలనేది కూడా ముఖ్యమే.. అదే విధంగా సరైన రోజున నాటడం మంచిది. తులసిని ఉంచే దిశ, ప్రదేశం ముఖ్యమైంది. తులసిని తప్పుడు స్థానంలో ఉంచితే మంచిది కాదట.

Vastu Tips for Tulsi ఇంట్లో తులసి మొక్కను పొరపాటున కూడా ఈ దిక్కులో ఉంచొద్దట... ఎక్కడ ఉంచాలంటే..!
Tulsi Direction
Follow us on

తులసి మొక్కకు సరైన దిశ : హిందూ మతంలో తులసి మొక్క చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇందులో లక్ష్మీదేవి కొలువై ఉన్నందున, ప్రజలు ఈ మొక్కను తమ ఇళ్లలో నాటుకుని, పూజించి, నీళ్లు సమర్పించుకుని, పవిత్రంగా చూసుకుంటారు. సాధారణంగా ప్రజలు తులసి మొక్కను నాటేటప్పుడు సరైన స్థలం, దిశను పట్టించుకోరు. కానీ, వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో తులసిని ఎక్కడ ఉంచాలనేది కూడా శాస్త్రం చెబుతుంది. తులసి మొక్కను సరైన దిశలో పెడితే ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. తులసి మొక్కను నాటడంతో పాటు దాన్ని ఏ దిశలో ఉంచాలనేది కూడా ముఖ్యమే.. అదే విధంగా సరైన రోజున నాటడం మంచిది. తులసిని ఉంచే దిశ, ప్రదేశం ముఖ్యమైంది. తులసిని తప్పుడు స్థానంలో ఉంచితే మంచిది కాదట. వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను సరైన దిశలో ఉంచడం, నాటడం వల్ల సత్ఫాలితాలు అందుతాయి.

దిక్కు..
మీరు ఇంట్లో తులసిని నాటడానికి, లేదంటే పెంచడానికి సరైన దిశ ఉత్తరం.. తులసీమాతను ఉత్తర దిశలో నాటండి. ఇంట్లో ఈ దిశలో తులసి మొక్కను నాటడం సాధ్యం కాకపోతే, ఈశాన్యంలో కూడా నాటుకోవచ్చు. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. గురువారం నాడు తులసి మొక్కను నాటితే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. శనివారము రోజున తులసిని నాటడం వలన ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది.

ప్రతికూల ప్రభావం..
వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్కను తూర్పు దిక్కున పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ప్రతికూల ప్రభావం, వ్యాపార నష్టాన్ని ఎదుర్కొంటారు. అందువల్ల, తులసి మొక్కను దక్షిణ లేదా నైరుతి దిశలో నివారించాలి.

ఇవి కూడా చదవండి

ఇంటి పైకప్పు..
కొందరి జాతకంలో బుధుడు సంపదతో సంబంధం కలిగి ఉంటాడు. అందుచేత తులసి మొక్కను ఇంటి పైకప్పు మీద పెట్టకూడదు. ఇలా చేయడం వలన అశుభ ఫలితాలు వస్తాయి. ధన నష్టాన్ని ఎదుర్కొంటారు.

తులసి మొక్కను చాలా పవిత్రంగా భావిస్తారు. ఇలా తులసి మొక్కను పైకప్పుపై ఉంచితే పక్షులు, పావురాలు గూడు కట్టుకుని మురికిగా తయారవుతాయి. అలాగే ఇంటి పైకప్పు మీద తులసి మొక్కను ఉంచడం వల్ల ఉత్తరం వైపు నుండి చీమలు వస్తాయని ఒక నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..