Vastu Tips: దానం చేయడానికి కొన్ని నియమాలున్నాయి.. దానం ఎవరికీ, ఎలా చేయాలంటే..

|

Nov 30, 2023 | 3:21 PM

అన్ని దానాలోకెల్లా అన్నదానం గొప్పదని పెద్దల ఉవాచ. ఆకలి అన్న వ్యక్తి కడుపునిండా అన్నం పెట్టిన జీవి ధన్యుడు అని అంటారు. ధన, కనక, వస్తు ఇలా ఎన్ని రకాలుగా దానం చేసినా ఎదుటివారిని సంతృప్తి పరచలేం.. అదే ఆకలి గా ఉన్న వ్యక్తికీ ఆహారం ఇస్తే.. తృప్తిగా తిని.. చాలు అని అంటారు.. అన్నదాత సుఖీభవ అని దీవిస్తాడు. దానానికి అంతటి విశిష్టత ఉందని మన పురాణాలు పేర్కొన్నాయి. అందుకనే దానం చేసే వ్యక్తి ఇతరులకు సహాయం చేసి మంచి అనుభూతిని పొందుతాడు. అయితే దానం చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలు వాస్తుశాస్త్రంలో పేర్కొన్నాయి. 

Vastu Tips: దానం చేయడానికి కొన్ని నియమాలున్నాయి.. దానం ఎవరికీ, ఎలా చేయాలంటే..
Vastu Tips
Follow us on

మానవునికి ఉన్న సుగుణాల్లో ఒకటి దానం చేసే గుణం. తనను అడిగినా అడగక పోయినా ఎదుటివారి కష్టాన్ని, అవసరాన్ని గుర్తించి చేసే దానిని దానం అని అంటారు. వస్తు, సేవ రూపంలో దానం ఉంటుంది. ఆహారం, వస్తువులు, వాహనాలు, భూమి, ఆవులు ఇలా అనేక రకాల దానాలున్నాయి. అయినప్పటికీ అన్ని దానాలోకెల్లా అన్నదానం గొప్పదని పెద్దల ఉవాచ. ఆకలి అన్న వ్యక్తి కడుపునిండా అన్నం పెట్టిన జీవి ధన్యుడు అని అంటారు. ధన, కనక, వస్తు ఇలా ఎన్ని రకాలుగా దానం చేసినా ఎదుటివారిని సంతృప్తి పరచలేం.. అదే ఆకలి గా ఉన్న వ్యక్తికీ ఆహారం ఇస్తే.. తృప్తిగా తిని.. చాలు అని అంటారు.. అన్నదాత సుఖీభవ అని దీవిస్తాడు. దానానికి అంతటి విశిష్టత ఉందని మన పురాణాలు పేర్కొన్నాయి. అందుకనే దానం చేసే వ్యక్తి ఇతరులకు సహాయం చేసి మంచి అనుభూతిని పొందుతాడు. అయితే దానం చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని నియమాలు వాస్తుశాస్త్రంలో పేర్కొన్నాయి.

కనుక దానం చేసే సమయంలో కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుంటే ప్రశాంతమైన మనసు లభిస్తుందని విశ్వాసం.

దానం అంటే అనేది ఇతరులకు సహాయపడే చర్య అని అర్థం. కనుక ఇతరులకు ఉపయోగపడే వాటిని దానం చేయాలని పెద్దలు సూచించారు. విలువ లేని వస్తువులను విరాళంగా ఇస్తే.. డబ్బు, సమయం వృధా.. అంతేకాదు మీరు ఇచ్చిన దానం స్వీకరించిన వారికి నిరాశను కలిగిస్తుంది.

ఇవి కూడా చదవండి

దానం ఎవరికీ చేయాలంటే..

హిందూ మతం  విశ్వాసాల ప్రకారం బ్రాహ్మణులకు దానం చేయడం అత్యంత పవిత్రమైనది చర్యగా  పరిగణించబడుతుంది. అయితే బ్రాహ్మణులకు మాత్రమే కాదు.. ఎవరికైనా ఆ వస్తువులు అవసరమైతే వారికీ  ఆ అవసరాన్ని తీర్చే విధంగా ఆ వస్తువులను దానం చేయాలని నిపుణుడు సూచించారు. ఎందుకంటే దానం తీసుకున్న వ్యక్తి సంతోషముగా ఇచ్చిన వ్యక్తికి మంచి జరగాలని ప్రార్ధిస్తాడు. ఆశీర్వాదాన్ని ఇస్తాడని..  సానుకూల శక్తిని విశ్వంలోకి పంపుతాడని నమ్మకం. అందువల్ల ఎవరికైనా ఎక్కువ అవసరం ఉంటే.. వారి అవసరాన్ని తీర్చే విధంగా విరాళాన్నీ ఇస్తారు. .

  1. దానం చేసే సమయంలో తప్పని సరిగా కొన్ని విషయాలను గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ అపాత్రదానం చేస్తే అలా చేసే దానం వలన పితృ దోషాన్ని ఎదుర్కొన వలసి ఉంటుందని విశ్వాసం.
  2. దానం చేయడానికి ఉత్తమ సమయం ఉదయం..  స్నానం చేసిన తర్వాత చేసే దానం ఉత్తమంగా పరిగణింపబడుతుంది.
  3. మురికి చేతులతో ఏదైనా దానం చేయకూడదు, ఎందుకంటే అది ప్రతికూలతను ఆహ్వానిస్తుంది .
  4. వస్తువులను దానంగా ఇస్తుంటే.. వాటిని విసిరినట్లు ఇవ్వకుండా చూసుకోవాలి.. ఇష్టపూర్వకంగా.. సున్నితంగా వస్తువులను దానంగా ఇవ్వాలి.
  5. ఇనుముతో చేసిన వస్తువులను దానం చేస్తే మీరు శని దేవుడి అనుగ్రహాన్ని పొందుతారని హిందూ మతంలో విశ్వాసం.
  6. అయితే శనిదేవుని అనుగ్రహం పొందాలనే ఉద్దేశ్యంతో దానం చేయకపోతే.. ఎప్పుడూ ఇనుము వస్తువులను దానం చేయకూడదు.
  7. కనుక దానం చేసే సమయంలో తప్పనిసరిగా ఈ విషయాలను దృష్టి లో పెట్టుకోవాలి.. అదే సమయంలో చేసే దానం గొప్ప కోసం కాకుండా ఇతరుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు